breaking news
Sadavarthi sathram
-
‘సదావర్తి’కి సగం డబ్బు చెల్లింపు
సాక్షి, అమరావతి: సదావర్తి భూముల కొనుగోలుకు రెండో అత్యధిక పాటదారుడు సగం డబ్బులు చెల్లించారు. నాలుగు రోజుల క్రితం చెన్నైలో జరిగిన బహిరంగ వేలంలో 83.11 ఎకరాల భూములను రూ.60.25 కోట్లతో కొనేందుకు రెండో అత్యధిక బిడ్డరుగా నిలిచిన హైదరాబాద్‌కు చెందిన చదలవాడ లక్ష్మణ్ శుక్రవారం పాట మొత్తంలో సగం రూ.30 కోట్ల 12 లక్షల 50 వేలు చెల్లించారు. ఇందుకు సంబంధించి డబ్బులు అందినట్టు సదావర్తి సత్రం ఈవో శ్రీనివాసరెడ్డి ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. నిబంధనల ప్రకారం మిగిలిన సగం రూ.30.125 కోట్లను 90 రోజుల గడువు లోగా చెల్లించాల్సి ఉంటుంది. వేలంలో రూ.60.30 కోట్ల అత్యధిక ధరకు సత్రం భూమిని కొనుగోలు చేసేందుకు ముందు కొచ్చిన టీడీపీ నేత బద్వేలు శ్రీనివాసులు రెడ్డి వైదొలగడంతో లక్ష్మణ్‌కు అవకాశం వచ్చిన సంగతి విదితమే. -
'భూములు వేలం వేసే హక్కు ఏపీ సర్కార్‌కు లేదు'
విజయవాడ: సదావర్తి సత్రం భూములను వేలం వేసే హక్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సూరిబాబు అన్నారు. గురువారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. సదావర్తి సత్రం భూములపై మద్రాస్ హైకోర్టులో కేసు నడుస్తుందని చెప్పారు. ఓ పక్క కేసు నడుస్తుండగా.. ప్రభుత్వం టీడీపీ నేతలకు కట్టబెట్టడం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. రూ. 10 కోట్లు విలువ చేసే భూమిని రూ. 27 లక్షలకే కట్టబెట్టడంపై మండిపడ్డారు. దీని వెనుక వందల కోట్లు చేతులు మారాయని సూరిబాబు ఆరోపించారు.