breaking news
Sadagoppan Ramesh
-
‘కెప్టెన్ మార్పు తథ్యం.. అతడికే పగ్గాలు’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. ముంబై ఇండియన్స్ తర్వాత ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన జట్టు సీఎస్కే. టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో సీఎస్కే ఈ ఘనత సాధించింది.అయితే, ధోని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొన్న తర్వాత సీఎస్కే పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ధోని వారసుడిగా 2022లో రవీంద్ర జడేజాను ఎంపిక చేయగా.. వరుస ఓటములు నేపథ్యంలో మధ్యలోనే అతడు వైదొలిగాడు. దీంతో మరోసారి పగ్గాలు చేపట్టిన ధోని.. ఆ మరుసటి ఏడాది జట్టుకు ట్రోఫీ అందించాడు.పేలవ ప్రదర్శనఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోగా.. అతడి సారథ్యంలో సీఎస్కే అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోయింది. గత మూడు సీజన్లలో ఒక్కసారి కూడా ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది. అంతేకాదు.. ఈ ఏడాది మరీ దారుణంగా ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇక గాయం వల్ల రుతు కూడా జట్టుకు చాలాసార్లు దూరమయ్యాడు.ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ సదగోపన్ రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్‌గా రుతురాజ్‌ను తొలగించి.. అతడి స్థానంలో సంజూ శాంసన్‌కు బాధ్యతలు అప్పగించాలని సీఎస్కే యాజమాన్యానికి సూచించాడు.అత్యుత్తమ ఎంపిక అతడే‘‘కెప్టెన్ విషయంలో మార్పు అనివార్యమని సీఎస్కే భావిస్తున్నట్లుగా ఉంది. ఒకవేళ అదే నిజమై.. కెప్టెన్‌ను మార్చాలనుకుంటే సంజూ శాంసన్ అత్యుత్తమ ఎంపిక అవుతాడు. అతడు అద్భుతమైన టీమ్ ప్లేయర్. నిజంగానే చెన్నై కెప్టెన్‌ను మార్చాల్సిన సమయం వచ్చింది. సంజూ పేరును పరిగణనలోకి తీసుకోండి. ఐపీఎల్లో కెప్టెన్‌గా 66 మ్యాచ్‌లు ఆడి 33 గెలిచిన ఘనత అతడిది.సంజూ సారథ్యంలో రాజస్తాన్ రాయల్స్ ఓసారి ఫైనల్ చేరింది. మరోసారి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. కెప్టెన్‌గా అతడి విజయాల శాతం ఎక్కువే. సీఎస్కేలో ఎన్నో మార్పులు చేయాల్సి ఉంది. ముఖ్యంగా కెప్టెన్ మార్పు తథ్యం. సంజూకు బాధ్యతలు ఇచ్చిన వెంటనే ట్రోఫీ గెలవకపోవచ్చు. కానీ జట్టును ఆ దిశగా తీర్చిదిద్ది మున్ముందు మంచి ఫలితాలు సాధించగలడు’’ అని సదగోపన్ రమేశ్ పేర్కొన్నాడు.కాగా ఐపీఎల్-2026 వేలానికి ముందు చెన్నై రవీంద్ర జడేజా, సామ్ కర్రాన్‌లను రాజస్తాన్‌కు ట్రేడ్ చేసి.. ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్‌ను తీసుకుంది. ఈ ఏడాది సంజూ సీఎస్కే తరఫున 14 మ్యాచ్‌లలో కలిపి 477 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు ఉన్నాయి. చదవండి: నా అభిమాని.. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తూంటాడు -
IND vs ZIM: అతడు కోచ్‌గా ఉన్నాడంటే.. అన్నీ వైట్వాష్లే!
భారత టీ20 కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన తర్వాత శ్రేయస్ అయ్యర్‌కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. యూకే పర్యటనలో భాగంగా అతడి సారథ్యంలో పసికూన ఐర్లాండ్ చేతిలో టీమిండియా 2-0తో వైట్‌వాష్‌కు గురైంది.అనంతరం ఇంగ్లండ్ గడ్డ మీద 4-0తో క్లీన్‌స్వీప్ అయింది. ఈ సిరీస్‌లో ఓ మ్యాచ్ వర్షం వల్ల రద్దైపోయింది. దీంతో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి ఏడు మ్యాచ్‌లలోనూ శ్రేయస్ అయ్యర్‌కు గెలుపన్నదే లేకుండా పోయింది. ఈ క్రమంలో జింబాబ్వే గడ్డ మీద తొలి మ్యాచ్ సందర్భంగా ఎట్టకేలకు శ్రేయస్ సేన విజయాల ఖాతా తెరిచింది.సమిష్టిగా రాణించి ఆతిథ్య జింబాబ్వే జట్టుపై ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా వరుస పరాభవాల తర్వాత శ్రేయస్ తొలిసారి గెలుపు రుచిచూశాడు. అయితే, జింబాబ్వేపై విజయాన్ని కూడా ఇంతలా సెలబ్రేట్ చేసుకోవాల్సిన పనిలేదంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా విమర్శించారు.మిగిలిపోయిందైనా.. అది విందు భోజనం లాంటిదే!ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సదగోపన్ రమేశ్ శ్రేయస్ అయ్యర్‌కు మద్దతుగా నిలిచాడు. ‘‘జింబాబ్వే మీద విజయాన్ని గొప్పగా భావించవద్దని చాలా మంది అంటున్నారు. అయితే.. టీ20 ప్రపంచకప్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత టీమిండియా టీ20మ్యాచ్‌లో విజయం కోసం చకోర పక్షిలా ఎదురుచూసింది.చాన్నాళ్ల ఆకలి తర్వాత దక్కిన గెలుపు ఇది. కాబట్టి ఇది మిగిలిపోయిందే అయినా.. పెళ్లి భోజనం లాంటిదే. శ్రేయస్ అయ్యర్‌కు కాస్త ఊరట లభించింది. అతడి కెప్టెన్సీ ఆరంభంలోనే టీమిండియా ఘోర పరాజయాలు చవిచూసింది.కాబట్టి ఇప్పుడు జింబాబ్వే మీద గెలిచినా సరే.. అది విజయమే. ఇప్పుడు ఇదే అతడికి బూస్ట్’’ అని సదగోపన్ రమేశ్ పేర్కొన్నాడు. అదే విధంగా.. జింబాబ్వే టూర్లో గౌతం గంభీర్‌కు బదులు తాత్కాలిక హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్న వీవీఎస్ లక్ష్మణ్‌పై రమేశ్ ప్రశంసలు కురిపించాడు.వీవీఎస్ లక్ష్మణ్‌పై ప్రశంసలు‘‘ఈ విజయంలో వీవీఎస్ లక్ష్మణ్‌దే సింహభాగం. అతడు ఎప్పుడు కోచ్‌గా వ్యవహరించినా సరే.. అప్పుడు టీమిండియా తప్పక విజయాలు సాధిస్తుంది. అతడి మార్గదర్శనంలో టీమిండియా ప్రత్యర్థులను దాదాపుగా అన్ని సిరీస్‌లలోనూ వైట్‌వాష్ చేసింది.టీమిండియా వైట్‌వాష్‌లకు గురైన తర్వాత కూడా అతడు ఇలాంటి ఫలితాలు రాబట్టాడు. వరుస పరాజయాల తర్వాత ఇప్పుడు జింబాబ్వేతో తొలి మ్యాచ్‌లోనూ టీమిండియా గెలిచింది’’ అని రమేశ్ వీవీఎస్ లక్ష్మణ్‌ను ప్రశంసించాడు. కాగా జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా గురువారం నాటి తొలి టీ20లో ఏడు వికెట్ల తేడాతో గెలిచి.. 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య శని, ఆది వారాల్లో మిగిలిన రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందుకు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక.చదవండి: తెలివితక్కువోడు తప్పిస్తే.. తానేంటో నిరూపించాడు! -
ఇంగ్లండ్ అతడికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది.. మీరేం చేస్తున్నారు?
టీమిండియాతో వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్ స్టార్ జో రూట్ అదరగొట్టాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తొలి వన్డేలో 76 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ వన్‌డౌన్ బ్యాటర్.. కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డేలో 99 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సెంచరీ చేసే అవకాశం ఉన్నా.. సహచరుడికి మ్యాచ్ ముగించే అవకాశం ఇచ్చి.. హుందాగా వ్యవహరించాడు.ఈ మ్యాచ్‌లో రూట్ ఇన్నింగ్స్ కారణంగా ఇంగ్లండ్ జయభేరి మోగించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇక లార్డ్స్ వేదికగా నిర్ణయాత్మక మూడో వన్డేలోనూ రూట్ మరోసారి తన అనుభవాన్ని చూపించాడు. కేవలం 39 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మొత్తంగా 48 బంతుల్లో తొమ్మిది ఫోర్లు బాది 74 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇంగ్లండ్ తొలి క్రికెటర్‌గా రికార్డుఇక మూడో వన్డేలో గెలిచి ఇంగ్లండ్ సిరీస్ 2-1తో కైవసం చేసుకోగా.. టీమిండియా ఓటమితో నిరాశగా వెనుదిరిగింది. రూట్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.నిజానికి గత కొంతకాలంగా రూట్ వన్డేల్లోనూ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ ముప్పై ఐదేళ్ల బ్యాటర్ గత ఆరు వన్డే ఇన్నింగ్స్‌లో చేసిన పరుగులు వరుసగా.. 61, 75, 111*, 76*, 99*, 74*. తద్వారా ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో వరుసగా ఆరు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన తొలి క్రికెటర్‌గా రూట్ చరిత్రకెక్కాడు.ఇంగ్లండ్ అతడికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది.. మీరేం చేస్తున్నారు?ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ సదగోపన్ రమేశ్ టీమిండియా యాజమాన్యం వైఖరిని విమర్శించాడు. ఇంగ్లండ్ మేనేజ్మెంట్ జో రూట్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చి.. మంచి ఫలితాలు రాబడుతోందన్నాడు. అదే సమయంలో భారత జట్టు యాజమాన్యం మాత్రం దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి విషయంలో తప్పు చేస్తోందని మండిపడ్డాడు.కాగా ఇప్పటికే రోహిత్- కోహ్లి అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. వన్డే వరల్డ్‌కప్-2027 ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అయితే, అనూహ్య రీతిలో రోహిత్‌ను కెప్టెన్సీ తప్పించిన యాజమాన్యం.. రో-కో ప్రపంచకప్ ఆడతారో లేదోనన్న అంశంపై తమకు స్పష్టత లేదన్నారు.రోహిత్ భారీ శతకంఈ క్రమంలోనే లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో మూడో వన్డే సందర్భంగా రోహిత్ శర్మ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోడుతన్నాడంటూ ప్రచారం ఊపందుకుంది. అయితే, ఈ మ్యాచ్‌లో రోహిత్ భారీ శతకం (138)తో రాణించి ఊహాగానాలకు చెక్ పెట్టాడు. తాను రిటైర్ కాబోవడం లేదని స్పష్టం చేశాడు.మీరు తప్పు చేస్తున్నారుఈ పరిణామాల నేపథ్యంలో నేపథ్యంలో రమేశ్ స్పందిస్తూ.. ‘‘విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు యాజమాన్యం మద్దతుగా ఉండాల్సిన సమయం ఇది. వాళ్లిద్దరు ఇప్పటికీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-5లో ఉన్న సత్తా కలవారు. ఓసారి ఇంగ్లండ్ మేనేజ్మెంట్ను చూడండి. జో రూట్‌కు వాళ్లు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నారు. అతడి నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టుకునేందుకు చేయాల్సిందంతా చేస్తున్నారు.అతడిపై ఏమాత్రం ఒత్తిడి పెట్టడం లేదు. ఇంగ్లండ్ రూట్‌ను తమ బలంగా భావిస్తోంది. కానీ భారత జట్టు యాజమాన్యం మాత్రం రోహిత్- విరాట్లనే తమ వెన్నెముకగా భావించాల్సింది పోయి వారి విషయంలోనే స్పష్టత లేకుండా చేస్తోంది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో రోహిత్ వరుసగా 11, 26, 138 పరుగులు చేయగా.. కోహ్లి 5, 74, 65 పరుగులు సాధించాడు.చదవండి: లార్డ్స్ వన్డేలో అదే హైలైట్: పాక్ మాజీ క్రికెటర్ -
అతడికి షరతులు వర్తించవా?.. అగార్కర్‌కు చురకలు!
ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనలతో పాటు ఆసియా గేమ్స్‌కు సంబంధించి టీమిండియాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే జట్టులో ఆటగాళ్ల ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్‌కు ముందు గాయానికి గురైన పేసర్ హర్షిత్ రాణా అప్పటినుంచి ఒక్క మ్యాచ్ ఆడకపోయినప్పటికీ మూడు జట్లలోనూ చోటు దక్కించుకున్నాడు. హర్షిత్ రాణా ఎంపికపై భారత మాజీ క్రికెటర్ శఠగోపన్ రమేశ్ అసహనం వ్యక్తం చేశాడు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఏ ప్రాతిపాదికన హర్షిత్ రాణాను ఎంపిక చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. ఇలాంటి ఎంపికల వల్ల మహ్మద్ షమీ, భువనేశ్వర్ వంటి సీనియర్ ఆటగాళ్లకు తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుందని పేర్కొన్నారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా మాట్లాడుతూ..‘హర్షిత్ రాణాను ఎలా ఎంపిక చేశారు? మోకాలి శస్త్రచికిత్స అనంతరం దేశవాలీలో అతడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయినా ఇప్పుడు మూడు జట్లకు ఎంపిక చేయడం పట్ల సమాధానం మాత్రం ఉండదు. కొన్నాళ్లుగా స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్న షమీ లాంటి క్రికెటర్లకు ఏం చెప్పాలనుకుంటున్నారు. దేశవాలీ క్రికెట్లో ఆటగాళ్లు తమ ఫిట్నెస్ను నిరూపించుకోవాలనే నిబంధనను హర్షిత్ రాణా విషయంలో సెలెక్షన్ కమిటీ గాలికొదిలేసింది. కోహ్లీ, రోహిత్ ఇలా ఎవరైనా ఫిట్నెస్ నిరూపించుకుంటూనే జట్టులో చోటు ఉంటుందని బీసీసీఐ పేర్కొంది. పాండ్యా గాయపడినప్పుడు కూడా జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలంటే ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిందేనని అల్టీమేటం జారీ చేశారు. ప్రస్తుతం టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఎంపికైన శ్రేయస్ అయ్యర్‌ను కూడా న్యూజిలాండ్‌తో వన్డేలకు ముందు విజయ్ హజారే ట్రోఫీ ఆడి ఫిట్నెస్ నిరూపించుకోవాలని కోరారు. ఇలాంటి ఉదాహరణలు ఇంకా చాలానే ఉన్నాయి. కానీ హర్షిత్ రాణా విషయంలో మాత్రం అలా జరగలేదు. అతడికి ఈ షరతులు ఎందుకు వర్తించవనేది అగార్కర్ సమాధానం చెప్పాలి.’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. ఇక హర్షిత్ రాణా 2026 టీ20 ప్రపంచకప్‌కు టీమిండియాకు ఎంపికయ్యాడు. కానీ వార్మప్ మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తుండగా మోకాలికి గాయమైంది. మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న హర్షిత్ రాణా ఐపీఎల్ 2026 సీజన్‌కు కూడా దూరంగా ఉన్నాడు.చదవండి: ఫూటుగా తాగి ఇంగ్లండ్ ప్లేయర్ల వీరంగం.. జట్టు నుంచి నిషేధం! -
పిచ్చి ప్రయోగాలు ఆపండి: సూర్య, గంభీర్‌పై మాజీ క్రికెటర్ ఫైర్
ఆస్ట్రేలియాతో రెండో టీ20లో టీమిండియా (IND vs AUS 2nd T20) యాజమాన్యం అనుసరించిన వ్యూహాలపై విమర్శలు వస్తున్నాయి. బ్యాటింగ్ ఆర్డర్లో ఇష్టారీతిన మార్పులు చేయడం వల్లే భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఆసీస్‌తో టీ20 సిరీస్‌ను కూడా టీమిండియా ఓటమితో మొదలు పెట్టింది. కాన్బెర్రాలో జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. శుక్రవారం నాటి రెండో టీ20లో నెగ్గిన ఆసీస్ సిరీస్‌లో 1–0తో ముందంజ వేసింది. 125 పరుగులకే ఆలౌట్మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆసీస్ 4 వికెట్లతో టీమిండియాపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 18.4 ఓవర్లలో 125 పరుగులకే కుప్పకూలింది. అభిషేక్ శర్మ (Abhishek Sharma- 37 బంతుల్లో 68; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) తనదైన శైలిలో దూకుడుగా ఆడి అర్ధ సెంచరీ సాధించగా, హర్షిత్ రాణా (33 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 47 బంతుల్లో 56 పరుగులు జోడించారు.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జోష్ హాజిల్‌వుడ్ (3/13) మూడు కీలక వికెట్లు తీసి భారత్‌ను దెబ్బ తీశాడు. అనంతరం ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో 6 వికెట్లకు 126 పరుగులు చేసి విజయాన్నందుకుంది.GOOD GRIEF JOSH INGLIS 🤩 #AUSvIND | #PlayoftheDay | @BKTtires pic.twitter.com/g2Qb2CW7Pj— cricket.com.au (@cricketcomau) October 31, 2025 ఆసీస్ అలవోకగాఓపెనర్లు మిచెల్ మార్ష్ (26 బంతుల్లో 46; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), ట్రవిస్ హెడ్ (15 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 28 బంతుల్లోనే 51 పరుగులు జోడించి ఆసీస్ గెలుపునకు పునాది వేశారు. జోష్ ఇంగ్లిస్ (20), మిచెల్ ఓవెన్ (14) ఓ మోస్తరుగా రాణించగా.. మార్స్ స్టొయినిస్ (6 నాటౌట్) పని పూర్తి చేశాడు.పిచ్చి ప్రయోగాలు ఆపండిఈ నేపథ్యంలో టీమిండియా ఓటమిపై భారత మాజీ క్రికెటర్ సదగోపన్ రమేశ్ స్పందించాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ఇష్టం వచ్చినట్లుగా మార్పులు చేయడాన్ని తప్పుబట్టాడు. ‘‘ఇప్పటికైనా బ్యాటింగ్ ఆర్డర్లో పిచ్చి ప్రయోగాలకు టీమిండియా స్వస్తి పలకాలి.ఈ మ్యాచ్‌లో 160- 170 పరుగులు స్కోరు చేసి గెలవగల సత్తా టీమిండియాకు ఉంది. గత మ్యాచ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో వచ్చి అదరగొట్టాడు. నాటౌట్‌గా నిలిచాడు.కానీ ఈ మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో సంజూను ఎందుకు తీసుకువచ్చారు?.. సంజూను ఓపెనింగ్ స్థానం నుంచి మిడిలార్డర్‌కు పంపారు. మళ్లీ ఇప్పుడు ఐదు నుంచి మూడో స్థానానికి మార్చారు. ఇలాంటి పనుల వల్ల ఎవరు ఎప్పుడు బ్యాటింగ్‌కు రావాలో తెలియని గందరగోళం నెలకొంటుంది.తిలక వర్మ ఆసియా కప్ ఫైనల్లో నాలుగో స్థానంలో వచ్చి గెలిపించాడు. కానీ ఇప్పుడు అతడిని ఐదో స్థానానికి మార్చారు’’ అని కెప్టెన్ సూర్య, హెడ్‌కోచ్ గౌతం గంభీర్ తీరును సదగోపన్ రమేశ్ విమర్శించాడు.ఎవరి పని వాళ్లే చేస్తే బాగుంటుందిఅదే విధంగా.. శివం దూబేను కాదని హర్షిత్ రాణాను ఏడో స్థానంలో ఆడించడాన్ని కూడా సదగోపన్ రమేశ్ తీవ్ర స్థాయిలో తప్పుబట్టాడు. ‘‘ఎవరి పని వాళ్లే చేస్తే బాగుంటుంది. గొప్ప వంటకాడు గొప్ప డ్రైవర్ కాలేడు. అదే విధంగా మంచి డ్రైవర్ గొప్పగా వంట చేయలేడు.ఆటగాళ్ల బలాలపై దృష్టి పెట్టి మేనేజ్మెంట్ వారికి తగిన పాత్ర ఇవ్వాలి. వారిలోని అత్యుత్తమ ప్రతిభ బయటకు వచ్చేలా ప్రోత్సహించాలి. అంతేగానీ బౌలర్‌ను బ్యాటర్‌గా మారుస్తాం.. బ్యాటర్‌తో బౌలింగ్ చేయిస్తాం అంటే ప్రతికూల ఫలితాలు రావచ్చు. ఈ విషయంలో యాజమాన్యం ఇప్పటికైనా పొరపాట్లు సరిచేసుకుంటే బాగుంటుంది’’ అంటూ సదగోపన్ రమేశ్.. టీమిండియా నాయకత్వ బృందానికి సూచించాడు.మార్పులు ఇవేకాగా మెల్బోర్న్లో ఆసీస్‌తో రెండో టీ20లో సంజూ శాంసన్ (2) మూడో స్థానంలో రాగా.. సూర్య (1) నాలుగో నంబర్ బ్యాటర్‌గా వచ్చి విఫలమయ్యాడు. ఇక తిలక్ వర్మ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి డకౌట్ అయ్యాడు. మరోవైపు.. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ శివం దూబే (4)ను ఎనిమిదో స్థానానికి డిమోట్ చేసి.. పేసర్ హర్షిత్ రాణా (35)ను ఏడో స్థానంలో ఆడించారు.చదవండి: అతడే మా ఓటమిని శాసించాడు.. అభిషేక్ మాత్రం అద్భుతం: భారత కెప్టెన్


