breaking news
Russian Ministry of Health and Education
-
రష్యా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్
మాస్కో: రష్యా కరోనా టీకా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ భద్రతపై అనుమానాలు నెలకొ న్నాయి. టీకా డోసులు తీసుకున్న ప్రతీ ఏడుగురు వలంటీర్లలో ఒకరికి సైడ్ ఎఫెక్ట్లు వచ్చినట్టుగా రష్యా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మూడో దశ ప్రయోగాల్లో భాగంగా 40 వేల మందికి టీకా డోసులు ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. వారిలో ఇప్పటివరకు 300 మందికి వ్యాక్సిన్ ఇస్తే వారిలో 14 శాతం మందిలో సైడ్ ఎఫెక్ట్లు కనిపించాయి. మొదటి డోసు తీసుకున్న వారిలో 14శాతం మందికి నిస్సత్తువ, కండరాల నొప్పులు వంటివి వచ్చాయని, జ్వరం కూడా ఎక్కువగానే వచ్చినట్టుగా ఆరోగ్య మంత్రి మురాషఖో తెలిపారు. 21 రోజుల తర్వాత వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి రెండో డోసు టీకా ఇస్తామని చెప్పారు. స్పుత్నిక్ వీ కరోనా వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలు ఇంకా పూర్తి కాకముందే రష్యా ప్రభుత్వం వ్యాక్సిన్‌ని హడావుడిగా మార్కెట్లో విడుదల చేసింది. ప్రపంచంలోనే మొదటి వ్యాక్సిన్ తెచ్చిన దేశంగా నిలవాలన్న ఉద్దేశంతో త్వరితగతిన అనుమతులు మంజూరు చేసినట్టుగా విమర్శలు వచ్చాయి. మాస్కోలో సెప్టెంబర్ మొదట్లో తుది దశ ప్రయోగాలు మొదలు పెట్టారు. టీకా భద్రత, నాణ్యతపై పూర్తి స్థాయిలో పరిశోధనలు జరగకుండా మార్కెట్లోకి విడుదల చేయ డంపై ఇప్పటికే చాలామంది శాస్త్రవేత్తలు అభ్యంతరాలు హెచ్చరికలు జారీ చేశారు. భా రత్కి కోటి డోసులు ఇవ్వడానికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌తో రష్యా ఒప్పందం కుదుర్చుకుంది. డీజీసీఐ అనుమతులు రావాల్సిన నేపథ్యంలో సైడ్ ఎఫెక్ట్లు రావడం ఆందోళన కలిగిస్తోంది. -
రష్యాలో తక్కువకే ఎంబీబీఎస్ కోర్సు
తక్కువ ఖర్చుతో ఎంబీబీఎస్ కోర్సు కొరుక్కుపేట: తక్కువ ఖర్చుతో వైద్య విద్యనభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు రష్యాలో విశ్వవిద్యాలయాలు ఆహ్వానం పలుకుతున్నట్లు ఆ దేశానికి చెందిన రష్యన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ప్రతినిధులు తెలిపారు. పశ్చిమ దేశాలతో పోల్చుకుంటే తమ దేశంలో ఎంబీబీఎస్ విద్యకు అయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉంటుందని వారు తెలిపారు. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో వారు మట్లాడుతూ ప్రపంచస్థాయి విద్యకు పేరుగాంచిన రష్యాలో ఎంబీబీఎస్ కోర్సు చేసిన విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా వైద్యసేవలందిస్తున్నట్లు తెలిపారు. అతి తక్కువ ఖర్చుతో కూడిన ఎంబీబీఎస్ కోర్సు కోసం చాలామంది భారతీయ విద్యార్థులు రష్యన్ వైద్య విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసుకుంటున్నారని పేర్కొన్నారు. రష్యాలో 57 మెడికల్ వర్సిటీలు ఉన్నాయని నాణ్యమైన విద్యకు ప్రామాణికంగా నిలిచాయని తెలిపారు. పన్నెండు వర్సిటీల్లో ఆంగ్లంలో ఎంబీబీఎస్ విద్యా బోధన అందజేస్తున్నట్టు వెల్లడించారు. అన్ని వర్సిటీలు డబ్ల్యూహెచ్ఓ, యూఎస్ఏ, యూకే, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, భారత్, కెనడాలకు చెందిన మెడికల్ కౌన్సిల్ గుర్తింపు పొందినాయన్నారు. రష్యన్ మీడియంలోనూ విద్యార్థులు కోర్సు చేయవచ్చని వివరించారు. కోర్సు పూర్తయిన తర్వాత ఇండియన్ ఎంబీబీఎస్‌కు సమానమైన ఎండీ డిగ్రీని ప్రదానం చేస్తారని తెలిపారు. అర్హతగల విద్యార్థులకు ఉచిత ట్యూషన్, వసతితోపాటు స్కాలర్షిప్ అందజేస్తామన్నారు. విద్యార్థులు ప్లస్‌టూలో కనీసం 50 శాతం మార్కులు సంబంధిత సబ్జెక్టుల్లో పొందినవారు అర్హులని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులు కనీసం 40శాతం మార్కులతో పాసై ఉండాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు రష్యా ఎడ్యుకేషన్, 38 ఫస్ట్ ఫ్లోర్, 113/52 అంకుర్ ప్లాజా, జీఎన్‌చెట్టి రోడ్డు, టీనగర్, చెన్నైను సంప్రదించవచ్చన్నారు.