breaking news
Russia Athletics
-
రష్యా-ఉక్రెయిన్ యుద్దంపై స్పందించిన దలైలామా.. ఏమన్నారంటే..
సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా వైఖరిపై ఇప్పటికే పలువురు ప్రముఖులు స్పందించారు. యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలంటూ పలు దేశాలు సైతం రష్యాను కోరాయి. తాజాగా టిబెటియన్ ఆధ్యాత్యిక నేత దలైలామా.. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై స్పందించారు. దలైలామా సోమవారం మాట్లాడుతూ.. యుద్ధాలకు కాలం చెల్లిందని, అహింస ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. కాగా, రెండు దేశాల మధ్య హింసాత్మక ఘటనలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మానవులంతా ఒక్కటే అన్న భావాన్ని పెంపొందించుకోవాలని రెండు దేశాలకు సూచించారు. అహింస మాత్రమే సమస్యలను త్వరిగతిన పరిష్కరిస్తుందని పేర్కొన్నారు. అప్పుడే శాంతియుత ప్రపంచాన్ని నిర్మించే అవకాశం ఉంటుందని సూచించారు. ఈ క్రమంలోనే.. మనం ఆశ కోల్పోకూడదు. 20వ శతాబ్దమంతా యుద్ధం, రక్తపాతమయమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక 21వ శతాబ్దం చర్చల శతాబ్దంగా ఉండాలని కోరారు. అందరి మధ్య పరస్పర అవగాహన కలిగి ఉండటం, ఒకరినొకరు గౌరవించుకోవడం ద్వారానే నిజమైన శాంతి ఏర్పడుతుందని పేర్కొన్నారు. -
రష్యాపై నిషేధం పొడిగింపు
లండన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌కు దూరం పారిస్: డోపింగ్ కారణంగా రష్యా అథ్లెటిక్స్ సమాఖ్యపై కొనసాగుతున్న నిషేధాన్ని అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) పొడిగించింది. ఈమేరకు ఐఏఏఎఫ్ చేసిన ప్రతిపాదనను పాలక మండలి కౌన్సిల్ ఆమోదించింది. దీంతో ఆగస్టులో లండన్‌లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు రష్యా అథ్లెట్లు దూరం కానున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రష్యా అథ్లెట్లు డోపింగ్‌కు పాల్పడుతున్నారని తేలడంతో 2015 నవంబర్ నుంచి అంతర్జాతీయ ఈవెంట్స్‌లో పాల్గొనకుండా ఆ దేశాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. అయితే గత డిసెంబర్లో జరిగిన పాలక మండలి సమావేశం అనంతరం మరికొంత అనుమానాస్పద సంఘటనలు జరిగాయని అందుకే వారి సభ్యత్వ పునరుద్ధరణపై వెనక్కి తగ్గామని ఐఏఏఎఫ్ కౌన్సిల్ పేర్కొంది.