breaking news
Rupe
-
రూపాయి మళ్లీ ఢమాల్
సాక్షి, ముంబై: కరెన్సీ మార్కెట్లో దేశీయ కరెన్సీ రూపాయి మరింత బలహీనపడింది. మంగళవారం కొద్దిగా పుంజుకున్న రుపీ బుధవారం మరోసారి ఢమాల్ అంది. ఆరంభ నష్టాలనుంచి ఏమాత్రం కోలుకుండా.. మరింత దిగజారి తాజాగా మరోసారి మూడునెలల కనిష్టాన్ని నమోదు చేసింది. అంతేకాదు డాలర్ మారకంలో రూపాయి 67 మార్క్‌కు పడిపోవడానికి దగ్గరలో ఉంది. 0.41పైసలు క్షీణించి 66.80 వద్దకు చేరింది. దిగుమతిదారుల నుంచి నెలవారీ డిమాండ్ తగ్గుముఖం పట్టడంతో అమెరికా డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి బలహీనపడింది. ద్రవ్యలోటు పెరగడంతో రూపాయిపై ఒత్తిడి ఇప్పటికే కొనసాగుతోందని డీలర్లు చెప్పారు. ఎఫ్ఐఐ అమ్మకాలు కొనసాగడంతో, బలహీనమైన స్టాక్ మార్కెట్ల ప్రభావం కూడా రూపాయి విలువను ప్రభావితం చేస్తోందన్నారు. -
ప్రశ్నార్థకంగా నగదు రహిత లావాదేవీల నిర్వహణ
► అందుబాటులో లేని స్వైపింగ్ మిషన్లు ► ప్రశ్నార్థకంగా మారిన నగదు రహిత లావాదేవీల నిర్వహణ కడప అగ్రికల్చర్: నగదు రహిత లావాదేవీలు నిర్వహించుకోవాలంటే ప్రతి ఒక్కరికీ బ్యాంకుల్లో ఖాతా ఉండాలి. తప్పని సరిగా రూపే,డెబిట్ కార్డులు ఉండాలి. జిల్లాలో 75 శాతం మందికి ఖాతాలు ఉన్నా అందులో 30 శాతం మందికి కూడా డెబిట్, రూపే, ఏటీఎం కార్డులు లేవు. ఈ పరిస్థితిలో దుకాణాలు, పెట్రోలు బంకుల్లో పాయింట్ ఆఫ్ స్కేల్ మిషన్లు(పీఓఎస్ఎం) పెట్టి నగదు రహిత లావాదేవీలు చేయలేమని వ్యాపారులు అంటున్నారు. . జిల్లాలో రిజిస్టర్ చేసుకున్న షాపులు 3100, చౌకదుకాణాలు 1740 ఉన్నాయి. ఇందులో 2437 పీఓఎస్‌ఎంలు ఉన్నాయి. జిల్లాకు 10 వేల స్వైపింగ్ మిషన్లు కావాలని ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం నివేదికలు పంపింది. కిరాణా, మెడికల్ షాపులు, వస్త్ర, బంగారు, తదితర దుకాణాల్లో తప్పని సరిగా పీఓఎస్‌ఎంలు ఏర్పాటు చేసుకుని డెబిట్, రూపే కార్డుల ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. ఆ దిశగా ఇప్పటికే అవగాహన సదస్సులు నిర్వహించింది. అయితే ఆయా షాపుల నిర్వాహకుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. కార్మిక, వాణిజ్య పన్నుల శాఖ వద్ద ఉన్న అంచనా ప్రకారం షాపులు దాదాపు 20 వేల దాకా ఉన్నట్లు సమాచారం. పీఓఎస్ఎంల కోసం వచ్చిన దరఖాస్తులు 150 దాకా ఉన్నట్లు బ్యాంకర్లు తెలిపారు. దీనిబట్టి చూస్తే నగదు రహిత లావాదేవీలపై వ్యాపార వర్గాలు అంతగా ఆసక్తి చూపడంలేదని తేటతెల్లమవుతోంది. బ్యాంకు ఖాతాలు ఉన్నా... డెబిట్ కార్డులు లేవు జిల్లాలో 29 లక్షలకు పైగా జనాభా ఉంది. జిల్లా మొత్తం 33 బ్యాంకులకు సంబంధించి 330 బ్రాంచీలు పనిచేస్తున్నాయి. ఇందులో పట్టణాల్లో 1,86,092, గ్రామీణ ప్రాంతాల్లో 1,97,658 ఖాతాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అన్ని రకాల కార్డులు 3,51,547 అందజేశారు.గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 70 శాతం మందికి డెబిట్ కార్డులు లేవు. దీనిని బట్టి చూస్తే జిల్లా వ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించడం సాధ్యమైన పని కాదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. కేవలం పెట్రోలు బంకులు, షాపింగ్ మాల్స్ల్లో మాత్రమే వీటిని వాడుకోవడానికి అవకాశం ఉంటుందని, చిన్న దుకాణాల్లో ఈ విధానం అమలు చేసే పరిస్థితి లేదని చిరువ్యాపారులు చెబుతున్నారు. చౌక దుకాణాల్లో కనిపించని మినీ ఏటీఎంలు, స్వైపింగ్ మిషన్లు జిల్లాలో 1740 రేష¯ŒSషాపులు ఉన్నాయి. ఈ షాపుల డీలర్లను బిజినెస్ కరస్పాండెట్లుగా నియమించి, మినీ ఏటీఎంలు, డెబిట్ కార్డులు అందజేసి నగదు రహిత లావేదేవీలు నిర్వహిస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పినా ఎక్కడ కూడా అది అమలు కావడం లేదు. స్వైపింగ్ మిషన్లు అందజేయకపోవడంతో నగదు రహితం అమలుకు నోచుకోలేదు. -
73 పైసలు బలపడిన రూపాయి
ముంబై: అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడిన నేపథ్యంలో డాలర్‌తో రూపాయి మారకం గురువారం 73 పైసలు (1.17 శాతం) పుంజుకొని రూ.61.73 వద్ద ముగిసింది. ఇది దాదాపు ఏడు వారాల గరిష్టస్థాయి. అమెరికా షట్‌డౌన్ నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ ఉద్దీపన ప్యాకేజీని కొనసాగిస్తుందన్న అంచనాలతో డాలర్ క్షీణించి, రూపాయి బలపడిందని నిపుణులంటున్నారు. ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడం, స్టాక్ మార్కెట్లు పరుగులెత్తడం కూడా రూపాయి పుంజుకోవడానికి దోహదపడ్డాయి. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లో బుధవారం ముగింపు 62.46 నుంచి గురువారం డాలర్‌తో రూపాయి మారకం రూ.62.15 వద్ద ప్రారంభమైంది. 62.22 వద్ద కనిష్ట స్థాయికి పడిపోయింది. మళ్లీ 61.65 గరిష్ట స్థాయికి ఎగసి చివరకు 73 పైసలు బలపడి 61.73 వద్ద ముగిసింది. ఆగస్టు 16 తర్వాత ఇదే గరిష్ట స్థాయి. రూపాయి రూ.61.00-రూ.62.80 రేంజ్‌లోనే ట్రేడవుతుందని అల్పరి ఫైనాన్షియల్ సర్వీసెస్(ఇండియా) సీఈవో ప్రమిట్ బ్రహ్మభట్ అంచనా వేస్తున్నారు.