breaking news
in RTC
-
ఆర్టీసీలో కానరాని ఫస్ట్ ఎయిడ్
ప్రమాదాలు జరిగితే ప్రథమ చికిత్స లేనట్లే! పట్టించుకోని ఆర్టీసీ అధికారులు రాయవరం : ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం.. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం ప్రమాదకరం. ఇలా ప్రకటనలు గుప్పిస్తున్న రాష్ట రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో ప్రథమ చికిత్స బాక్సుల ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తోంది. బస్సు ప్రమాదానికి గురైతే అప్పటికప్పుడు తాత్కాలిక వైద్య సేవలు పొందేందుకు ప్రతి ఆర్టీసీ బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి. ప్రస్తుతం అటువంటివి బస్సుల్లో కానవరావడం లేదు. బస్సు షడన్ బ్రెక్ వేసినప్పుడు ప్రయాణికులకు చిన్నపాటి గాయాలపాలైతే వారు ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాల్సిందే. 3.23 లక్షల కిలోమీటర్ల ప్రయాణం జిల్లాలో కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, రావులపాలెం, రాజోలు, రామచంద్రపురం, ఏలేశ్వరం, తుని, గోకవరంలో ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ఈ డిపోల పరిధిలో మొత్తం 840 బస్సులు వివిధ మార్గాల్లో ప్రతి రోజు 3.23 లక్షల కిలోమీటర్ల పరిధిలోని ప్రయాణికులను చేరవేస్తున్నాయి. ఆర్టీసీలో ఉద్యోగంలో చేరే కొత్త డ్రైవర్లకు, కండక్టర్లకు తొలుత ఫస్ట్ ఎయిడ్ ధ్రువపత్రం ఇచ్చిన తర్వాతనే ఉద్యోగాలిస్తారు. ప్రయాణికులు గాయపడితే.. వారికి అత్యవసర చికిత్స చేసే సామర్థ్యం సంబంధిత బస్సు డ్రైవర్, కండక్టర్లకు ఉంటుంది. కాని ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురై ప్రయాణికులకు గాయాలైతే 108 వాహనం వచ్చే వరకూ ఆగాల్సిందే. అప్పటి వరకు క్షతగాత్రులు నొప్పితో బాధపడాల్సిందే. ప్రథమ చికిత్స అందక పోవడం వలన కొన్ని సందర్భాల్లో ప్రాణాప్రాయం కూడా కలుగుతుంది. ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లో... ఫస్ట్ ఎయిడ్ బాక్సులో రెండు బ్యాండేజ్ కట్టలు, టించర్ అయోడిన్, గ్లాస్ బ్యాండేజ్, నొప్పి తగ్గించే ఆయింట్మెంట్, అత్యవసర మందులు ఉంటాయి. పట్టించుకోని అధికారులు.. బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌ల్లో మందులను ఏర్పాటు చేయక పోతే బస్సులను సీజ్ చేసే అధికారం ఆర్టీవో స్థాయి అధికారులకు ఉంటుంది. అయినప్పటికీ ప్రభుత్వ బస్సులేనన్న భావనతో సంబంధిత అధికారులు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలున్నాయి. -
ఆర్టీసీలో ఎన్నికల కోలాహలం
ఇంటింటా ప్రచారం.. క్రాస్ ఓటింగ్‌పైనే దృష్టి సత్తుపల్లి టౌన్: ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం కోలాహలంగా సాగుతోంది. ఎన్నికలకు ఇంకా ఒక్కరోజే గడువు ఉండటంతో నాయకులు, కార్మికులు ముమ్మరంగా ప్రచారం చేపడుతున్నారు. ఇప్పటికే డిపోల వారీగా జనరల్‌బాడీ సమావేశాలు, ఖమ్మం, మణుగూరులో బహిరంగ సభలు నిర్వహించారు. ఆ సభలకు స్థానిక డిపోల నుంచి ముఖ్య నాయకులను తరలించి తమ ఓటు బ్యాంక్ చెదిరిపోకుండా జాగ్రత్త పడాలని సూచించారు. జిల్లాలో కూటమి బలంగా ఉండటంతో రాష్ట్ర స్థాయిలో తమ సంఘాన్ని బలపరిచే విధంగా కార్మికులను క్రాస్ ఓటింగ్ చేయించే పనిలో నిమగ్నమయ్యారు. అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న టీఎంయూకు గత ఎన్నికల్లో ప్రస్తుత నీటిపారుదల శాఖామంత్రి తన్నీరు హరీష్‌రావు జిల్లాలో ప్రచారం నిర్వహించారు. కానీ ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు దూరంగానే ఉండటం ఆ కార్మిక వర్గంలో నైరాశ్యం కలిగిస్తోంది. కనీసం స్థానిక పార్టీ శ్రేణులైన తమకు సంఘీభావం తెలపక పోవటం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ అధినేత కేసీఆర్ అండ అన్ని విధాలా ఉంటుందని, భవిష్యత్‌తో కార్మికులకు తమ సంఘం వల్లే ప్రయోజనాలు చేకూరుతాయని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నెల 19న ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఇతర సంఘాలలోని కార్మికులతో క్రాస్ ఓటింగ్ ద్వారా రాష్ట్ర స్థాయిలో సంఘాన్ని బలపరిచే విధంగా ఓటింగ్ కోసం ఇంటింటా ప్రచారాన్ని కూడా చేపట్టారు. పోటీలో ఉన్న సంఘాలు విందు రాజకీయాలతో కార్మికులను ప్రసన్నం చేసుకునేందుకు సన్నద్ధమౌతున్నారు.