breaking news
rooftop solar plant
-
ఇంటిపైనే కరెంటు.. వాడుకోవచ్చు.. అమ్ముకోవచ్చు
హైదరాబాద్‌లోనే అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీగా గుర్తింపు పొందిన మాదాపూర్‌లోని ఫార్చూన్ టవర్స్‌పై నిర్వాహకులు 250 కిలోవాట్స్ సోలార్ రూఫ్ టాప్ పలకను ఏర్పాటు చేసుకున్నారు. రోజుకు సగటున వెయ్యి యూనిట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. నెలకు సగటున రూ.3 లక్షల వరకు విద్యుత్ బిల్లు ఆదా అవుతోంది. ఈ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్వాహకులు పెట్టిన పెట్టుబడి అంతా మరో ఐదేళ్లలో తీరిపోతోంది. ఆ తర్వాత వారికి పూర్తిగా సోలార్ విద్యుత్ ఉచితంగా అందనుంది. ఇలా వీరొక్కరే కాదు గ్రేటర్లో సుమారు 3,500 మంది వినియోగదారులు తమ ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ పలకలను ఏర్పాటు చేసుకుని, సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నారు.ఇంటిపై ఉత్పత్తి అయిన విద్యుత్‌తో సొంత అవసరాలు తీర్చుకుంటూ.. మిగిలిన విద్యుత్‌ను డిస్కంకు విక్రయిస్తున్నారు. దేశవ్యాప్తంగా కోటి ఇళ్లలో సౌర విద్యుత్ వెలుగులు నింపే లక్ష్యంతో తాజాగా కేంద్రం ‘పీఎం సూర్య ఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన’ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. రేషన్‌కార్డు ఉన్న ప్రతి లబ్ధిదారుడికి నెలకు సగటున 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ఉచితంగా అందించే కార్యక్రమంలో భాగంగా కొత్తగా రూఫ్‌టాప్ సోలార్ పలకలు ఏర్పాటు చేసుకోవాలని భావించే వారికి పలు ప్రోత్సాహకాలు అందజేస్తుంది. –సాక్షి, సిటీబ్యూరోఇంటిపై మూడు కిలోవాట్ల సౌరపలకలు ఏర్పాటు చేయాలంటే 225 చదరపు అడుగుల విస్తీర్ణం అవసరం. ఒక కిలోవాట్ సౌరపలక రోజుకు సగటున 4 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. మూడు కిలోవాట్ల సామర్థ్యం ఉన్న పలకలు ఏర్పాటు చేసుకుంటే నెలకు సగటున 360 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. ఏడాదికి 4,320 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. ఇంటి అవసరాలు నెలకు 200 యూనిట్లు పోగా మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించుకోవచ్చు. ఇందుకు ప్రస్తుత ధర ప్రకారం యూనిట్‌కు రూ.5.05 చెల్లిస్తుంది. మూడు కిలోవాట్లకు రూ.1.80 లక్షలు ఖర్చవుతుంది. గతంలో రాయితీ కిలోవాట్‌కు రూ.14 వేల చొప్పున మూడు కిలోవాట్లకు రూ.42 వేలు లభించేది. దీంతో చాలామంది విముఖత చూపేవారు. ప్రస్తుతం ఈ సబ్సిడీని రూ.78 వేలకు పెంచింది.అంతేకాదు మిగిలిన మొత్తం చెల్లింపునకు రాయితీపై బ్యాంకుల నుంచి రుణాలు పొందేలా కేంద్రం ఏర్పాటు చేసింది. ఒక రకంగా చెప్పాలంటే పైసా ఖర్చు లేకుండా యూనిట్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఉత్పిత్తి అయిన విద్యుత్‌లో ఇంటి అవసరాలు పోగా, మిగిలిన విద్యుత్‌ను నెట్‌మీటరింగ్ ద్వారా డిస్కంకు విక్రయించడం ద్వారా వచ్చే సొమ్ముతో బ్యాంకు రుణం తీర్చవచ్చు. 40 మందికిపైగా దరఖాస్తు సౌరపలకల జీవితకాలం 25 ఏళ్లను పరిగణలోకి తీసుకుంటే 5.32 సంవత్సరాల్లోనే పెట్టిన పెట్టుబడి అంతా తిరిగి వస్తుందని చెబుతున్నారు. మిగిలిన కాలానికి ఉచితంగా విద్యుత్‌ను వినియోగించుకోవచ్చు. సౌర విద్యుత్‌తో పర్యావరణ ప్రయోజనాలు లేకపోలేదు. మూడు కిలోవాట్ల సోలార్ ప్యానల్ల ఏర్పాటుతో 25 ఏళ్లలో 85 టన్నుల కార్బన్‌డైయాక్సైడ్‌ను తగ్గించిన వారవుతారు. ఇదిలా ఉంటే సోలార్ విద్యుత్ ఉత్పత్తిదారులను ప్రోత్సహించేందుకు కేంద్రం జాతీయ స్థాయిలో ‘పీఎం సూర్య ఘర్’ పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే గ్రేటర్ జిల్లాల నుంచి 40 మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. ఔత్సాహికులు టీఎస్ఎస్పీడీపీఎల్ వెబ్సైట్లోకి వెళ్లి డిస్కం పేరు, కరెంట్ కనెక్షన్, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ, ఆధార్ నంబర్ వంటి వివరాలను పీఎం సూర్యఘర్ పోర్టల్‌లో నమోదు చేస్తే సరిపోతుంది. ఎంపిక చేసిన కంపెనీల సోలార్ పలకలు, రాయితీపై రుణాలు ఇచ్చే బ్యాంకులు, టెక్నిషియన్ల్ల వివరాలు ఉంటాయి. పలకల ఇన్స్టాలేషన్ తర్వాత నెట్‌మీటరింగ్ ద్వారా గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు. -
PM Surya Ghar Muft Bijli Yojna: రూఫ్‌టాప్ సోలార్ రాయితీ 78 వేలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రూఫ్‌టాప్ సౌర విద్యుత్ పథకం ‘పీఎం–సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన’కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని అధ్యక్షతన మంత్రివర్గం గురువారం సమావేశమైంది. రూ.75,021 కోట్లతో అమలు చేసే ఈ పథకం కింద దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నారు. ఇళ్లపై సౌర ఫలకాల ఏర్పాటుకు లబి్ధదారులకు రూ.78,000 వరకు రాయితీ ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలియజేశారు. కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. జిల్లాకో మోడల్ సోలార్ గ్రామం రూప్‌టాప్ సౌర విద్యుత్ పథకాన్ని ప్రధాని మోదీ ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన ప్రారంభించారు. పథకం అమలులో భాగంగా 2 కిలోవాట్ల సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం ఆర్థిక సాయం అందిస్తుంది. 2 కిలోవాట్ల నుంచి 3 కిలోవాట్ల సోలార్ పవర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి అదనంగా మరికొంత ఆర్థిక సాయం అందజేస్తుంది. 3 కిలోవాట్ల వరకే పరిమితి విధించారు. ఒక కిలో వాట్ వ్యవస్థకు రూ.30 వేలు, 2 కిలోవాట్ల వ్యవస్థకు రూ.60 వేలు, 3 కిలోవాట్ల వ్యవస్థకు రూ.78 వేల చొప్పున కేంద్రం నుంచి రాయితీ లభిస్తుంది. లబ్ధిదారులు రాయితీ సొమ్ము కోసం నేషనల్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసే కంపెనీని పోర్టల్ ద్వారా ఎంపిక చేసుకోవచ్చు. కేంద్రం ఇచ్చే రాయితీ మినహా మిగిలిన పెట్టుబడి కోసం ఎలాంటి పూచీకత్తు లేకుండానే తక్కువ వడ్డీకే రుణం తీసుకొనే అవకాశం కలి్పంచారు. సౌర విద్యుత్‌పై గ్రామీణ ప్రజలకు అవగాహన కలి్పంచడానికి ప్రతి జిల్లాలో ఒక మోడల్ సోలార్ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూఫ్‌టాప్ సోలార్ పథకాన్ని ప్రమోట్ చేసే పట్టణ స్థానిక సంస్థలకు, పంచాయతీరాజ్ సంస్థలకు కేంద్రం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. 2025 నాటికి అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. 3 కిలోవాట్ల సౌర విద్యుత్ వ్యవస్థ నెలకు 300 యూనిట్లకుపైగా కరెంటును ఉత్పత్తి చేస్తుంది. 300 యూనిట్లు ఉచితంగా ఉపయోగించుకొని, మిగిలిన కరెంటును డిస్కమ్‌లకు విక్రయించి ఆదాయం పొందవచ్చు. పీఎం–సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన కింద సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి, రాయితీ పొందడానికి https:// pmsuryaghar.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పథకం ద్వారా కొత్తగా 17 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని కేంద్రం అంచనా వేస్తోంది. -
అతిపెద్ద రూఫ్ టాప్ సొలార్ ప్లాంట్
బియాస్: ప్రపంచంలోనే అతిపెద్ద రూఫ్ టాప్ సొలార్ ప్లాంట్ పంజాబ్ లో ఏర్పాటైంది. 11.5 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్ ను పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ మంగళవారం ప్రారంభించారు. అమృతసర్ కు 45 కిలోమీటర్ల దూరంలో రూ. 139 కోట్ల వ్యయంతో దీన్ని ఏర్పాటు చేశారు. 82 ఎకరాల విస్తీర్ణంలో రాధా సౌమీ సత్సంగ్ బియాస్(ఆర్ఎస్ఎస్ బీ) దీన్ని నిర్మించింది. పర్యావరణ హిత విధానాలతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేశారు. అతిపెద్ద రూఫ్ టాప్ సొలార్ ప్లాంట్ ఏర్పాటు చేసిన ఆర్ఎస్ఎస్ బీను సీఎం బాదల్ అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా సొలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటును తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పునర్వినియోగ ఇంధన వనరుల శాఖ మంత్రి బిక్రం సింగ్ తెలిపారు. ఇందుకోసం పలు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్టు వెల్లడించారు.