breaking news
Roger Moore
-
ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడి కన్నుమూత
ఉత్తమ జేమ్స్ బాండ్ సినిమాలు తెరకెక్కించి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకున్న ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు గాయ్ హమిల్టన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 94 ఏళ్లు. 'బాండ్' హీరో సీన్ కానరీతో 'గోల్డ్ ఫింగర్', 'డైమండ్స్ ఆర్ ఫరెవర్' సినిమాలను రూపొందించిన ఆయన రోజర్ మూర్తో కలిసి 'లివ్ అండ్ లెట్ డై', 'ద మ్యాన్ విత్ గోల్డెన్ గన్' వంటి జేమ్స్ బాండ్ సినిమాలను అందించాడు. హమిల్టన్ మృతిపై బాండ్ హీరో రోజర్ మూర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వండర్ ఫుల్ డైరెక్టర్ అయిన హమిల్టన్ చనిపోవడం ఎంతో బాధ కలిగిస్తున్నదని, అత్యద్భుతమైన చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారని ఆయన అన్నారు. బాండ్ సినిమాలతోపాటు పలు ప్రముఖ బ్రిటిష్ చిత్రాలకు హమిల్టన్ దర్శకత్వం వహించాడు. 'బ్యాటల్ ఆఫ్ బ్రిటన్', 'ఫునెరల్ ఇన్ బెర్లిన్', ఫోర్స్ 10'తోపాటు అగాథా క్రిస్టీ రచనల ఆధారంగా తీసిన 'ద మిర్రర్ క్రాక్డ్', 'ఈవిల్ అండర్ ద సన్' చిత్రాలను తెరకెక్కించాడు. -
జేమ్స్ బాండ్‌గా చేసేకన్నా చచ్చిపోవడం బెటర్!
‘బాండ్.. జేమ్స్ బాండ్.. నేను జేమ్స్ బాండ్ 007’ అంటూ తమ ధైర్యసాహసాలను ప్రదర్శించడానికి ఆ పాత్రతో తమను పోల్చుకుంటారు పిల్లలు. అంతలా ఈ క్యారెక్టర్ పిల్లలకు దగ్గరైపోయింది. ఇక, పెద్దల సంగతి సరే సరి. తెరపై ఈ సీక్రెట్ ఏజెంట్ చేసే విన్యాసాలు వారినీ ఆకట్టుకుంటాయి. అలా ఇంటిల్లిపాదికీ దగ్గరైన ఈ పాత్ర చేయడం అంటే చిన్న విషయం కాదు. జంపింగులూ, రన్నింగులూ, చాకచక్యంగా తుపాకీ పేల్చడం.. వాట్ నాట్.. బోల్డన్ని చేయాలి. అందుకే, ఈ పాత్ర చేసేవాళ్లను అద్భుతమైన నటులుగా కితాబులిస్తారు. ఇప్పటివరకూ సీన్ కానరీ, రోజర్ మూర్.. ఇలా పలువురు నటులు జేమ్స్ బాండ్‌గా అలరించారు. ఆ తర్వాత డేనియల్ క్రెగ్ ఈ పాత్రను పోషించడం మొదలుపెట్టారు. 2006లో ‘కాసినో రాయల్’, 2008లో ‘క్వాంటమ్ ఆఫ్ సోలెస్’, 2012లో ‘స్కైఫాల్’ చిత్రాల్లో జేమ్స్ బాండ్‌గా నటించారాయన. త్వరలో విడుదల కానున్న ‘స్పెక్టర్’లో నాలుగో సారి ఈ పాత్ర చేశారు. ఐదో సారి మాత్రం ఈ పాత్ర చేయడానికి ఆయన సిద్ధంగా లేరు. ‘మళ్లీ జేమ్స్ బాండ్‌గా నటించేకన్నా చచ్చిపోవడం బెటర్. ఒకవేళ నటించాల్సిన పరిస్థితి వస్తే ఏదైనా గాజు ముక్కతో నా మణికట్టుని కోసేసుకుంటా’ అంటున్నారు డేనియల్. దీన్నిబట్టి జేమ్స్ బాండ్ పాత్ర పోషణ పరంగా ఆయన ఎంత అలసిపోయారో ఊహించవచ్చు. ఎవరైనా మరీ బలవంతం చేస్తే, కనీసం మరో రెండేళ్లు ఆగమంటానని ఆయన పేర్కొన్నారు. రెండేళ్ల తర్వాత ఒకవేళ ఒప్పుకోవాలనిపిస్తే, అది డబ్బు కోసమే తప్ప వేరే కారణాలేవీ ఉండవని కూడా స్పష్టం చేశారు.