తండ్రికి తగ్గ తనయుడు.. టీమిండియాపై వీరోచిత పోరాటం! సెంచరీ మిస్
ఇంగ్లండ్ యువ సంచలనం, అండర్-19 ఆటగాడు రాకీ ఫ్లింటాఫ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. ఇంగ్లండ్ దిగ్గజం ఆండ్రూ ఫ్లింటాప్ తనయుడైన రాకీ.. బెకెన్హామ్ వేదికగా భారత అండర్-19తో జరుగుతున్న తొలి టెస్టులో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఈ సమయంలో రాకీ ఫ్లింటాప్ తన వయసుకు మించిన పరిణతిని ప్రదర్శించాడు. కెప్టెన్ హమ్జా షేక్ తో కలిసి అతను 154 పరుగుల కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఓ దశలో సునాయసంగా తన సెంచరీ మార్క్‌ను అందుకునేలా కన్పించిన రాకీ.. 93 పరుగుల వద్ద దీపేష్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.అతడి ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ యువ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. క్రీజులో అల్బర్ట్(18),ఏకాన్ష్ సింగ్(59) ఉన్నారు. ఇంగ్లండ్ ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కంటే 202 పరుగుల వెనకంజలో ఉంది.అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 540 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ ఆయుశ్ మాత్రే (102) సూపర్ సెంచరీతో చెలరేగగా.. విహాన్ మల్హోత్రా (67), అభిగ్యాన్ కుందు (90), రాహుల్ కుమార్ (85), ఆర్ఎస్ అంబరీష్ (70) అర్ద సెంచరీలతో రాణించారు.చదవండి: ఇదేం పద్ధతి?.. ఎవరి కోసం ఇదంతా?!: సునిల్ గావస్కర్ ఫైర్