breaking news
robot-assisted surgeries
-
ఈ రిమోట్ ‘ఆపరేషన్’ అద్భుతం!
వైద్య రంగంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రపంచ ప్రఖ్యాత కార్డియాలజిస్టు, గుజరాత్‌కు చెందిన డాక్టర్ తేజస్ పటేల్ అత్యాధునిక టెక్నాలజీతో గుండె ఆపరేషన్ చేసి చరిత్ర సృష్టించారు. 32 కి.మీ. దూరంలో ఉన్న ఒక మహిళా రోగి గుండెకు రోబోటిక్ టెక్నాలజీ వినియోగించి స్టెంట్ వేశారు. ఇలా రోగికి అంత దూరం నుంచి కూడా సర్జరీ చేయడం, దానికి రోబోటిక్ మొబైల్ టెక్నాలజీ వినియో గించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. ఈ అరుదైన సర్జరీకి గుజరాత్ గాంధీనగర్‌లోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం అక్షర్ధామ్ వేదికైంది. సర్జరీ ఎలా చేశారంటే.. గుజరాత్‌కు చెందిన ఒక మహిళా రోగి గుండెకి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో అవరోధాల్ని తొలగించి, స్టెంట్ వేసే ఆపరేషన్‌ను డాక్టర్ తేజస్ పటేల్ తానున్న చోటు నుంచి కదలకుండానే చేశారు. అహ్మదాబాద్‌లో ఒక ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్‌కి ఆ రోగిని తీసుకువచ్చారు. ఆపరేషన్ థియేటర్లోని కాథ్ ల్యాబ్‌లో ఉన్న రోబో చెయ్యిని.. అక్షర్‌ధామ్‌లో డాక్టర్ వద్ద ఉన్న కంప్యూటర్‌తో అనుసంధానం చేశారు. ఎదురుగా ఒక స్క్రీన్‌పై రోబో చెయ్యి, మరో స్క్రీన్‌పై పేషెంట్, ఇంకో స్క్రీన్ మీద రోగి బ్లడ్ ప్రెషర్, హార్ట్ బీట్ వంటి వివరాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంటర్నెట్ ద్వారా రోబో చెయ్యిని ఆపరేట్ చేస్తూ ఆ రోగి గుండెకి విజయవంతంగా స్టెంట్ వేశారు. ఈ టెక్నాలజీని టెలీ రోబోటిక్స్ అని పిలుస్తారు. టెలిమెడిసన్, రోబోటిక్స్ టెక్నాలజీని కలగలిపి వినియోగించడం వల్ల నిపుణులైన డాక్టర్లు మారుమూల గ్రామాలకు వెళ్లకుండానే ఇలాంటి సర్జరీలు చేసే అవకాశం ఉంటుంది. ఈ సర్జరీని చూడడానికి అక్షరధామ్‌కు వచ్చిన గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్‌రూపాని ఇలాంటి అరుదైన శస్త్రచికిత్స గుజరాత్‌కు గర్వకారణమని వ్యాఖ్యానించారు. డాక్టర్ తేజస్ వంటి అనుభవజ్ఞుల సేవల్ని ఈ టెక్నాలజీ ద్వారా మారుమూల ప్రాంతాలకు చేరేలా చర్యలు చేపడతామని చెప్పారు. భవిష్యత్ టెలి రోబోటిక్స్‌దే.. అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్సలకు రోబోటిక్ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఆపరేషన్‌ను 100 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్‌ను వినియోగించి నిర్వహించారు. ఇక 5జీ టెలికామ్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ఈ తరహా ఆపరేషన్లు ఎక్కువగా జరిగే అవకాశముంది. సాధారణంగా గుండెలో స్టెంట్ వేయడానికి అయ్యే ఖర్చు కంటే, ఇలా టెలీ రోబోటిక్స్ విధానం ద్వారా చేసే ఆపరేషన్‌కు ప్రస్తుతానికైతే 40 నుంచి 50 వేలు ఖర్చు ఎక్కువ అవుతుంది. ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వస్తే ఖర్చు తగ్గే అవకాశముంది. ‘ఇవాళ ఆపరేషన్ 32 కి.మీ. దూరం నుంచి చేశాం. భవిష్యత్‌లో ఇదే టెక్నాలజీ వినియోగించుకొని దేశంలో ఏ మారుమూల ఉన్నా, ప్రపంచంలో ఎక్కడున్నా చేయొచ్చు’ అని డాక్టర్ తేజస్ పటేల్ అన్నారు. క్యాథ్ ల్యాబ్, రోబో చెయ్యి, నిరంతరాయంగా ఇంటర్నెట్ సౌకర్యం ఉంటే ఇలాంటి ఆపరేషన్లు ఎక్కడ నుంచి అయినా చేయొచ్చని, యువ సర్జన్లకి ఇందులో శిక్షణ ఇస్తానని తెలిపారు. డాక్టర్ తేజస్ పటేల్ ఇప్పటికే 300కి పైగా రోబోటిక్ సర్జరీలు నిర్వహించారు. అయితే, ఇలా కిలోమీటర్ల దూరంగా ఉన్న పేషెంట్‌కు సర్జరీ చేయడం లైవ్ ఆపరేషన్ చేయడం ఇదే ప్రథమం. ఈ ఆపరేషన్‌కు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అమెరికాకు చెందిన కొరిండస్ వాస్క్యు లర్ రోబోటిక్స్ కంపెనీ అందించింది. నిపుణులైన డాక్టర్లు ఎక్కడ ఉన్నప్పటికీ వారి సేవలు ప్రపంచవ్యాప్తంగా ఎవరికైనా అందుబాటులోకి రావడం ఈ టెక్నాలజీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఆ కంపెనీ సీఈవో మార్క్ టోలండ్ -
రోబో సర్జరీలకు భారత్ దే అగ్రస్థానం
న్యూఢిల్లీ: ప్రాణాపాయమైన కేన్సర్లకు రోబోల సహాయంతో అత్యాధునిక చికిత్స అందించడంలో భారత్ కేంద్రబిందువుగా మారింది. మన దేశంలో రోబో సర్జరీలు.. చౌక ధర కావచ్చు, చికిత్స సమయంలో తక్కువ నొప్పి ఉండటం, శస్త్రచికిత్స అనంతరం తొందరగా కోలుకోవడం.. అవగాహన పెరగడం ఇలా ఏమైనా కావచ్చు.. భారత్‌ను మాత్రం ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలబెట్టిందని కొందరు రోబో శస్త్రచికిత్స నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇటీవల నమోదైన తాజా సమాచారం ప్రకారం.. 2015 ముంబైలో 70వేల రోబొటిక్ సర్జరీలు జరిగినట్టు అంచనా. అయితే సర్జరీలు చేయించుకున్న వారిలో ఎక్కువమంది విదేశీయులే ఉండటం గమనార్హం. ఇక దేశ రాజధాని ఢిల్లీ, ముంబైలలో 20 నుంచి 25 వేల వరకు రోబో శస్త్రచికిత్సలు జరిగినట్టు రికార్డుల్లో వెల్లడయ్యాయి. ప్రత్యేకంగా.. రోగుల్లో దాదాపు చాలామంది మధ్య తూర్పు ఆఫ్రికా దేశీయులే భారత్‌లో సర్జరీలు చేయించుకున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వారి స్వదేశాల్లో అడ్వాన్స్ రోబో సర్జీరీలు అందుబాటులో లేకపోవడం, ఒకవేళ ఉన్నా, చాలా ఖర్చుతో కూడినవి అయి ఉండవచ్చునని వారు అభిప్రాయపడుతున్నారు. ముంబైలోని షఫీ ఆస్పత్రి, బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి కన్సల్టెంట్ రోబొటిక్ సర్జన్ డాక్టర్ అనూప్ రమణి ఐఏఎన్ఎస్తో మాట్లాడుతూ.. తాను ప్రతివారం కనీసం ఒకటి నుంచి రెండు రోబో సర్జరీ రోగులను పరీక్షిస్తాననీ, వచ్చే వారిలో మధ్య తూర్పు ఆఫ్రికా నుంచి ఎక్కువ మంది వస్తున్నారని చెప్పారు. గత రెండునెలల క్రితం ప్రోస్టేట్ గ్రంథి కేన్సర్‌తో బాధపడుతున్న ఏడుగురు విదేశీయులకు తాను ఒంటిరిగా రోబో సర్జరీ చేశాననీ పేర్కొన్నారు. ప్రారంభ దశలో ఉన్న ప్రోస్టేట్ గ్రంథి కేన్సర్‌కు రోబో సర్జరీ ద్వారా శస్త్రచికిత్స చేయించుకోవడం ఉత్తమమైనదిగా చెప్పారు. భారత్‌లో ప్రోస్టేట్ కేన్సర్.. పేద, ధనికుల్లో ఎక్కువ పెరిగిపోయిందన్నారు. కావునా 50 సంవత్సరాల వయస్సు దాటిన ప్రతి ఒక్కరు సంవత్సరంలో ఒక్కసారైనా ప్రోస్టేట్ నిర్దిష్ట యాంటిజెన్(పీఎస్ఏ) పరీక్ష చేయించుకోవాలని రమణి సూచించారు.