breaking news
roaming crossly
-
పెన్ గంగ కాలువ వద్ద పులుల సంచారం.. టెన్షన్లో గ్రామస్తులు
సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని పెన్‌గంగ కాలువలో పెద్ద పులులు సంచరించడం చుట్టుపక్కల గ్రామాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. జైనత్ మండలంలోని గూడ గ్రామ శివారులో ఉన్న పెన్‌గంగ కాలువలో మంగళవారం ఉదయం రెండు పెద్ద పులులు కనిపించాయి. కాలువ మధ్యలో పెద్ద పులులు నడుచుకుంటూ వెళ్లడం స్థానికులు గమనించారు. ఈ సందర్భంగా కొందరు యువకులు పులులు తిరుగుతుండటాన్ని తమ సెల్ఫోన్లతో వీడియో తీశారు. అయితే, ఈ పులులు మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ వైల్డ్ లైఫ్ సంక్చూరీ నుంచి వచ్చి ఉంటాయని అనుమానిస్తున్నారు. పులుల సంచారంపై ప్రాజెక్టు ఇంజనీర్లు.. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పులి సంచారం నేపథ్యంలో చుట్టపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు వారిని అప్రమత్తం చేశారు. కాగా, ఇటీవలి కాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో పెద్ద పులుల సంచారం పెరిగింది. పలుచోట్ల పశువులపై దాడి చేసిన ఘటనలు స్థానికంగా కలకలం సృష్టించాయి. -
భూపాలపల్లి అడవుల్లో మగ పులి
సాక్షి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడవుల్లో పులి సంచరిస్తోంది. నాలుగు రోజులుగా జిల్లాలోని అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పులిని.. మగపులిగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. తాడోబా లేదా ఇంద్రావతి అడవుల నుంచి రావొచ్చని అంచనా వేశారు. పులికి ఎటువంటి హాని జరగకుండా అటవీశాఖ అధికారులు అప్రమత్తం అవుతుండగా.. అటవీ గ్రామాల ప్రజలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. 17 ఏళ్ల తర్వాత దట్టమైన అడవులు కలిగిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ సమీప అడవుల్లో 2003లో ఏడు పులులు ఉన్నట్లుగా అప్పటి అటవీశాఖ అధికారులు గుర్తించారు. అనంతరం 2009లో పాకాల సమీపంలోని రాంపూర్ అడవుల్లో ఒక పులి కనిపించింది. ఆ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడా పులుల జాడ కనిపించలేదు. కాగా గత నెల 30న మహాముత్తారం మండలం యామన్‌పల్లి అడవుల్లో పులి అడుగులను జిల్లా అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే నిమ్మగూడెంకు చెందిన ఓ రైతు తన ఆవు మేతకు వెళ్లి అడవిలో మృత్యువాత పడినట్లుగా గుర్తించాడు. మృతి చెందిన ఆవుపై పులి గాట్లు స్పష్టంగా కనిపించాయి. సోమవారం అదే పులి మహాముత్తారం మండలంలోని మహబూబ్‌పల్లి సమీపంలో గల బంగారుబాట మీదుగా, ఈ నెల 1న రాత్రి మరోమారు యామన్‌పల్లి–ఆజంనగర్ అడవుల్లో సంచరించినట్లుగా బుధవారం అటవీశాఖ అధికారులు గుర్తించారు. అయితే బుధవారం సాయంత్రం మళ్లీ అదే పులి అడుగులు మల్హర్ మండలంలోని కిషన్‌రావుపల్లి సమీప అటవీ ప్రాంతంలో కనిపించడంతో అటవీశాఖ అధికారులతో పాటు అటవీ గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జిల్లా అడవుల్లో పులి నాలుగు రోజులుగా సంచరిస్తుందనే వార్త దావనంలా వ్యాపించింది. అప్రమత్తంగా ఉండండి: డీఎఫ్ఓ జిల్లా అడవుల్లోకి పులి రావడం సంతోషకరమని డీఎఫ్ఓ పురుషోత్తం అన్నారు. కొత్తగా ఎక్కడ అడుగు జాడలు కనిపించినా తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. అటవీ గ్రామాల ప్రజలు ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒకరిద్దరు అడవుల్లోకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదని, వేట కోసం విద్యుత్ తీగలు, ఉచ్చులు ఎవరూ అమర్చకూడదన్నారు. చదవండి: బొగతా జలపాతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గల్లంతు -
పమ్మరాజుపల్లిలో పిచ్చికుక్క స్వైర విహారం
పాణ్యం(కర్నూలు): పాణ్యం మండలం పమ్మరాజుపల్లి గ్రామంలో ఆదివారం ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. కండ ఊడేలా నలుగురిని కరిచింది. గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.