breaking news
rich village
-
పేరుకే పల్లెటూరు.. చూస్తే సిటీ లెవల్!
పల్లెటూరు అనగానే మననందరికీ గుర్తుకు వచ్చేది పచ్చని పొలాలు, పొందికైన ఇళ్లు, నినాదంగా గడిచే జీవితం. కానీ ఆ ఊరు అలా ఉండదు. పేరుకే పల్లెటూరు, దాని తీరు చూస్తే నగరానికి ఏమాత్రం తీసిపోదు. ఎందుకంటే ఆ ఊరు ఆసియాలోనే సంపన్న గ్రామం. ఇంతకీ ఇది ఎక్కడుందనేగా మీ డౌటు. ఇంకెక్కడ మన ఇండియాలోనే. ఏంటి ఏషియా రిచెస్ట్ విలేజ్ మనదేశంలో ఉందా అని ఆశ్చర్యపోతున్నారా! మరి ఇంకేందుకు ఆలస్యం.. ఆ ఊరు ఎక్కడ ఉందో, దాని విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.గుజరాత్లోని కచ్ జిల్లాలో ఉన్న మాధపర్ గ్రామం.. ఆసియాలోనే ధనిక గ్రామంగా ప్రసిద్ధికెక్కింది. ఎటు చూసినా కాంక్రీట్ బిల్డింగ్లు, ఆధునాతన సౌకర్యాలతో అలరారుతూ ఉంటుంది ఈ విలేజ్. ఈ ఊర్లోని బ్యాంకుల్లో రూ. 7 వేల కోట్లు పైగా డిపాజిట్లు ఉన్నాయంటేనే అర్థమవుతుంది ఈ ఊరు రేంజ్. దేశంలోని మిగతా పల్లెటూళ్లకు భిన్నంగా ఉంటుంది మాధపర్ (Madhapar). ఈ గ్రామంలో 20 వేల ఇళ్లు ఉండగా.. దాదాపు 32,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన ఈ ఊర్లో 17 బ్యాంకులు ఉన్నాయి. మరికొన్ని బ్యాంకులు తమ శాఖలను తెరిచేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ ఊరు సంపన్న గ్రామంగా ఎలా ఎదిగింది, ఇక్కడివారు ఏం చేస్తారనే తెలుసుకోవాలనుకుంటున్నారా?గ్లోబల్ రూట్స్, లోకల్ గ్రోత్మాధపర్ విజయ రహస్యం అక్కడి ప్రజలే. ఇక్కడి కుటుంబాల్లోని చాలా మంది అమెరికా, బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్, ఆఫ్రికా, గల్ఫ్ దేశాల్లో స్థిరపడ్డారు. వీరంతా స్వగ్రామానికి దండిగా డబ్బులు పంపిస్తుంటారు. తాము ఉంటున్న దేశంలో కంటే మాధపర్ బ్యాంకుల్లో డబ్బును దాచుకోవడానికి ఇష్టపడతారు. ఇంటికి డబ్బు పంపడమే కాకుండా గ్రామంలో విద్య, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలలో కూడా పెట్టుబడి పెడుతున్నారు. ఫలితంగా స్థిరమైన వృద్ధితో ఆర్థిక స్వావలంబన సాధించి సంపన్న గ్రామంగా ఎదిగింది మాధపర్ గ్రామం.ప్రవాసంలో ఉంటున్నా.. దేవాలయాలు, వారసత్వ కట్టడాలను సృష్టించడంలో సిద్ధహస్తులైన మిస్త్రి కమ్యునిటికి చెందిన వారు 12వ శతాబ్దంలో ఈ గ్రామాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. కాలక్రమేణా విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ స్థిరపడ్డారు. ప్రస్తుతం పటేల్ కమ్యునిటికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం విదేశాలకు ఇక్కడి నుంచి చాలా మంది వలస వెళ్లడంలో మాధపర్ గ్రామం రూపురేఖలు మారిపోయాయి. ప్రవాసంలో ఉంటున్నా మూలాలను మరిచిపోకుండా సొంతూరిపై ఎన్నారైలు మమకారం చూపడంతో మాధపర్ ధనిక గ్రామంగా ఎదిగింది. పట్టణాలకు దీటుగా సౌకర్యాలు సమకూర్చుకుంది. విశాలమైన రోడ్లు, నాణ్యమైన పాఠశాలలు, కాలేజీలతో పాటు ఆధునిక వైద్యాన్ని అందించే ఆస్పత్రులు కూడా ఉన్నాయి.చదవండి: డిబ్బి డబ్బులతో కాలేజీ ఫీజులు కట్టేస్తున్న స్కూల్ పిల్లలు!దేశానికి నమూనా మాధపర్ విజయగాథ కేవలం సంపదకు సంబంధించినది మాత్రమే కాదు. ఐక్యత, దార్శనికత, తిరిగి ఇవ్వడం అనే మూడు అంశాల ఆధారంగా మాధపర్ గ్రామం స్వావలంబన సాధించింది. అంతేకాదు ప్రజల మధ్య బలమైన సమాజ సంబంధాలు ఉంటే గ్రామీణ జీవితాన్ని కూడా అసాధారణంగా మార్చవచ్చని ఈ ఊరు నిరూపించింది. గ్రామీణ జీవిత సౌందర్యాన్ని ఆధునిక జీవన సౌకర్యాలతో మిళితం చేసి దేశానికి నమూనాగా నిలిచింది. -
ప్రపంచంలో అత్యంత సంపన్నమైన గ్రామం ఎక్కడుందో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన గ్రామం ఎక్కడుందో మీకు తెలుసా?. చాలా మంది అమెరికా లేదా వేరొక దేశం పేరు చెబుతారు కానీ, అది అబద్దం. మన దేశంలోనే ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన గ్రామం ఉంది. ఈ గ్రామంలో 7,600 ఇల్లు ఉన్నాయి. ఈ గ్రామలోని ప్రజలు డబ్బు దాచుకోవడానికి ఆ గ్రామంలో 17కి పైగా బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకులో వారు 5,000 కోట్ల రూపాయల డిపాజిట్ చేశారు. మనం మాట్లాడుతున్న గ్రామం పేరు మాధపర్. ఈ గ్రామం గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఉంది. అంచనాల ప్రకారం గ్రామంలో సగటు తలసరి డిపాజిట్ సుమారు 15 లక్షల రూపాయలు. ఈ గ్రామంలో 17 బ్యాంకులు మాత్రమే కాకుండా పాఠశాలలు, కళాశాలలు, సరస్సులు, పచ్చదనం, ఆనకట్టలు, ఆరోగ్య కేంద్రాలు, దేవాలయాలు ఉన్నాయి. ఈ గ్రామంలో అత్యాధునిక గౌశాల కూడా ఉంది. కానీ ఈ గ్రామం, మన దేశంలోని సంప్రదాయ గ్రామాల కంటే ఎందుకు భిన్నంగా ఉంది అంటే?. దీనికి ప్రధాన కారణం గ్రామస్థుల కుటుంబ సభ్యులు, బంధువులలో ఎక్కువ మంది యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆఫ్రికా, గల్ఫ్ దేశాలు వంటి విదేశాలలో నివసిస్తున్నారు. 65% కంటే ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు వారు దేశం వెలుపల నుంచి తమ కుటుంబాలకు భారీ మొత్తంలో డబ్బును పంపుతున్నారు. ఆ గ్రామ ఎన్ఆర్ఐలలో చాలా మంది డబ్బు సంపాదించిన తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి గ్రామంలో తమ వెంచర్లను ప్రారంభించారు. కొన్ని నివేదికల ప్రకారం, మాధపర్ విలేజ్ అసోసియేషన్ అనే సంస్థను 1968లో లండన్ లో ఏర్పాటు చేశారు. విదేశాల్లో నివసిస్తున్న మాధపర్ ప్రజల మధ్య సమావేశాలను సులభతరం చేయడమే దీని ప్రధాన లక్ష్యం. ప్రజల మధ్య మంచి సంబందాన్ని ఏర్పాటు చేయడానికి గ్రామంలో కూడా ఇలాంటి ఒక కార్యాలయాన్ని ప్రారంభించారు. చాలామంది గ్రామస్థులు విదేశాల్లో స్థిరపడినప్పటికీ వారు తమ మూలాలను ఎన్నడూ మారిచిపోలేదు. వారు నివసిస్తున్న దేశం కంటే గ్రామ బ్యాంకుల్లో తమ డబ్బును ఆదా చేయడానికి ఇష్టపడతారు. వ్యవసాయం ఇప్పటికీ ఇక్కడ ప్రధాన వృత్తిగా ఉంది. -
ఆశ్రయానికి నో.. రెండు కోట్లు ఇచ్చేందుకు ఓకే!
లండన్: శరణార్థులను తమ గ్రామంలోకి అనుమతివ్వకుండా అందుకు ప్రతిగా కోట్ల రూపాయల ఫైన్ చెల్లించేందుకు స్విట్జర్లాండ్ లోని ఓ గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు రూ.1,96,17,606 వారికి చెల్లిస్తామని ప్రకటించారు. డబ్బు అయితే, వారి జీవనోపాధికి పనికొస్తుందని ఆ గ్రామ అధికారి ప్రకటించాడు. మొత్తం 50 వేల మంది సిరియా ప్రాంతానికి చెందిన శరణార్థులను తమ దేశంలోకి అనుమతించేందుకు స్విట్జర్లాండ్ నిర్ణయించింది. అందులో భాగంగా ఆయా గ్రామాల్లో వారిని సర్దేందుకు గ్రామానికి పదిమంది చొప్పున నిర్ణయించారు. అంతకంటే ముందు ఆ గ్రామంలో శరణార్ధులపై అభిప్రాయ సేకరణ చేస్తారు. అందులో భాగంగా దాదాపు 300మంది మిలియనీర్లు, 20,000మంది జనాభాతో ఉన్న స్విట్జర్లాండ్ లోని ''లీలి' అనే గ్రామంలో అభిప్రాయ సేకరణ చేపట్టగా వారు శరణార్థులకు ఆశ్రయం ఇచ్చేందుకు నిరాకరించి డబ్బు సహాయం చేస్తామని చెప్పారు. ఒక వేళ తాము ఆశ్రయం ఇస్తే అలాగే ఇతరులు కూడా ఆశపడి తమ గ్రామానికి వస్తారని, అలా కాకుండా డబ్బు సహాయం చేయడం ద్వారా శరణార్థి శిబిరాల్లో ఉంటున్న వారికి భవిష్యత్ అందించినట్లవుతుందని అభిప్రాయపడ్డారు. వారి భాష తీరు కూడా వేరని, పిల్లల చదువులు వంటి సమస్యలు వస్తాయని తెలిపారు.