Revenue receipts
-
అప్పుల్లో నెల నెలాభివృద్ధి!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం ఓ వైపు నెల నెలా అప్పులు చేయడంలో భారీ వృద్ధి నమోదు చేస్తూ, మరో వైపు రెవెన్యూ రాబడుల్లో నెల నెలా అథమ స్థాయికి దిగజారిపోతోంది. అప్పులు చేయడంపై చూపిస్తున్న శ్రద్ధ రెవెన్యూ రాబడులు పెంచడం ద్వారా సంపద సృష్టిపై చూపించడం లేదు. ప్రస్తుత ఆర్థిక ఏడాది ఫిబ్రవరి వరకు బడ్జెట్ కీలక సూచికలపై కాగ్ విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. ప్రస్తుత ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికే బడ్జెట్ అంచనాలను మించి అప్పులు చేసినట్లు కాగ్ నివేదిక స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక ఏడాది అంటే మార్చి ఆఖరు నాటికి రూ.79,926 కోట్ల అప్పు చేయనున్నట్లు బడ్జెట్ అంచనాల్లో పేర్కొనగా, ఫిబ్రవరి నాటికే ఏకంగా రూ.94,393 కోట్లు అప్పు చేసింది. అంటే బడ్జెట్ అంచనాలను మించి రూ.14,467 కోట్లు అప్పు చేసింది. మరో పక్క రెవెన్యూ రాబడుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తిరోగమనంలో పయనిస్తోంది. 2023–24 ఆర్థిక ఏడాదిలో ఫిబ్రవరి నాటికి వచ్చిన రెవెన్యూ రాబడులు కూడా ఈ ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి రాకపోవడం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. రెవెన్యూ రాబడులు 2023–24 ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.1,52,820 కోట్లు రాగా, ప్రస్తుత ఆర్థిక ఏడాది (2025–26) ఫిబ్రవరి నాటికి రూ.1,49,546 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే రెవెన్యూ రాబడుల్లో రూ.3,274 కోట్లు తగ్గిపోయాయి. సాధారణంగా ఏటా ఎంతో కొంత మేర రెవెన్యూ రాబడులు పెరుగుతాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఆర్థికంగా దిగజారిపోతున్న రాష్ట్రం రెవెన్యూ రాబడులు తగ్గడం అంటే రాష్ట్రం ఆర్థికంగా దిగజారిపోతోందని స్పష్టం అవుతోంది. చంద్రబాబు అధికారంలోకి వచి్చన నాటి నుంచి ప్రతి నెలా అమ్మకం పన్ను రాబడితో పాటు పన్నేతర ఆదాయం, ఇతర పన్నులు, డ్యూటీలు రాబడితో పాటు కేంద్ర గ్రాంట్లు తిరోగమనమే తప్ప పురోగమనం లేదు. అమ్మకం పన్ను రాబడి 2023–24 ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.16,860 కోట్లు ఉంటే, 2025–26 ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.16,304 కోట్లు మాత్రమే. అంటే రూ.556 కోట్లు తగ్గిపోయింది. ఇతర పన్నులు, డ్యూటీల రూపంలో రాబడి 2023–24 ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.6,549 కోట్లు వస్తే, 2025–26లో అదే సమయానికి రూ.4,955 కోట్లే వచ్చాయి. అంటే రూ.1,594 కోట్ల రాబడి తగ్గిపోయింది. పన్నేతర రాబడి 2023–24 ఫిబ్రవరి నాటికి రూ.6,740 కోట్లు వస్తే, 2025–26 ఫిబ్రవరి నాటికి రూ.5,067 కోట్లే వచ్చాయి. రూ.1,673 కోట్లు రాబడి తగ్గిపోయింది. కేంద్ర గ్రాంట్లలోనూ విఫలంకేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వం బాగస్వామిగా ఉన్నప్పటికీ, కేంద్ర గ్రాంట్లను రాబట్టడంలో విఫలమైంది. 2023–24 ఫిబ్రవరి నాటికి కేంద్ర గ్రాంట్ల రూపంలో రూ.29,589 కోట్లు రాగా, 2025–26 ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి అవి రూ.14,737 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే రూ.14,852 కోట్లు తగ్గిపోయాయి. విద్య, వైద్య, సంక్షేమ రంగాలకు చెందిన సామాజిక రంగ వ్యయం కూడా చంద్రబాబు హయాంలో తగ్గిపోయింది. 2023–24 ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి సామాజిక రంగ వ్యయం రూ.1,16,413 కోట్లు ఉంటే, 2025–26 ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.1,02,423 కోట్లే ఉంది. అంటే సామాజిక రంగ వ్యయం రూ.13,990 కోట్లు తగ్గిపోయింది. మరో పక్క రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు భారీగా పెరిగినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. ఈ ఆర్థిక ఏడాది ఫిబ్రవరి నాటికి రెవెన్యూ లోటు రూ.60,812 కోట్లకు, ద్రవ్యలోటు రూ.91,310 కోట్లకు చేరినట్లు కాగ్ తెలిపింది. -
జమా ‘బందీ’
ఖమ్మం జెడ్పీసెంటర్: ప్రభుత్వ శాఖలకు మార్గదర్శకంగా ఉండాల్సిన రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ప్రతి ఏటా ప్రభుత్వానికి ఆ శాఖ నుంచి కోట్ల రూపాయాల ఆదాయం రావాల్సి ఉన్నా అధికారుల మాయాజాలంతో లక్షల్లోనే సరిపెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. రెవెన్యూ శాఖకు ఆయువుపట్టుగా ఉన్న గ్రామీణ గణాంక పుస్తకాలను సిబ్బంది పట్టించుకున్న దాఖలాలు లేవు. వీటి నమోదును పరిశీలించేందుకు ప్రభుత్వం రెవెన్యూ శాఖలో జమాబంది విధానాన్ని ఏర్పాటు చేసింది. ప్రతి ఏటా నిర్వహించాల్సిన జమాబంది గత ఆరేళ్లుగా అధికారుల చేతుల్లో ‘బందీ’ అవుతోంది. 2009లో నాటి కలెక్టర్ ఉషారాణి హయాంలో జమాబంది నిర్వహించారు. తర్వాత వచ్చిన కలెక్టర్లు దీని జోలికి వెళ్లకపోవడంతో రెవెన్యూ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయం తగ్గింది. సమీకృత గ్రామీణ గణాంకాల్లో తలెత్తుతున్న అంశాలిలా ఉన్నాయి.. రిజిస్టర్ ఆఫ్ ల్యాండ్స్.. రెవెన్యూ గ్రామ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు, వ్యవసాయ, ఇళ్ల స్థలాలకు అనువైన భూములను గుర్తించి వాటి నమోదు రికార్డు చేయాల్సి ఉంటుంది, కానీ జిల్లాలో ఎక్కడా కూడా దకల్(రిజిష్టర్) దస్తావేజలకు రికార్డుల్లో భూమి సరిపోవడం లేదు. లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు పలుకుబడి కలిగిన, రాజకీయ నేతల కబంధ హస్తాల్లో కూరుకుపోయాయి. ఎన్నెస్పీ భూముల్లో అనేక రకాలైన అనితర సాధ్యం కాని కొత్త జీవోలు, కొర్రీలు, మెలికలతో బడాబాబుల చేతుల్లోకి వెళ్తున్నాయి. వీటిలో అటవీ, ఇనాంభూములు, సర్ఫక్రాస్, భూదాన్ భూములు ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. మ్యూటేషన్ రిజిష్టర్.. వ ంశపారపర్యంగా సంక్రమించిన భూములకు పేరు మార్పిడి చేయడానికి ఉపయోగించాల్సిన మ్యూటేషన్ ప్రక్రియ అనర్హులకు వరంలా మారింది. అసలైన వంశీకులు రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోని రెవెన్యూ సిబ్బంది.. భూముల ధరలు పెరగడంతో భూ బకాసురులకు, అనర్హులకు, జీపీఏ(జనరల్ పవర్ ఆఫ్ అటార్ని), మధ్యవర్తులకు పేరుమార్పిడి చేస్తున్నారు. ప్రభుత్వానికి నిజంగా రావాల్సిన కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ రుసుం సాదా బైనామా పేరుతో ఎగవేతకు గురవుతోంది. నిజమైన రైతులకు ఉయోగించాల్సిన సెక్షన్లు రియల్ మాఫియాకు అధికారులు తాకట్టు పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పహణీలు.. భూ యాజమానులను గుర్తించి వారికి సంబంధిత పహణీలు అందించాల్సిన రెవెన్యూ అధికారులు.. దళారుల వద్ద డబ్బు తీసుకుని ఒకే భూమికి చెందిన పహణీలను ఇద్దరు, ముగ్గురు రైతులకు ఇస్తున్నారనే విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ గ్రామంలో ఉన్న భూముల కంటే పహణీల్లో రెట్టింపు భూములు నమోదవుతున్నాయి. బందోబస్తు కాలాలను తాజా పరచడం, ప్రభుత్వ భూముల వివరాలు(ఎర్రసిరాతో) పహణీల్లో రాయాల్సి ఉంటుంది. అయితే పహణీల్లో వారసుల పేర్లు కాస్తు, పట్టాదారుల వివరాలు నమోదు చేయక అనేక ఏళ్లు గడుస్తోంది. వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు, చెరువులు, వాగులు, వంకలు, సడక్(కాలిబాట), పొలిమేర హద్దులు, మతక భూములు కబ్జాకోరల్లో నలుగుతున్నాయి. జిల్లాలో అనేక చెరువులు, శ్మశాన వాటికలు దురాక్రమణకు గురయ్యాయి. ఖమ్మం మున్సిపాలిటి అయినా ఇప్పటివరకు అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రస్తావన లేకుండా పోయింది. జిల్లాలో సీలింగ్ యాక్టు ఎక్కడా అమలు కావడం లేదు. నెలవారీ సాగు నమోదు... 3ఏ ద్వారా జిల్లాలోని రెవెన్యూ గ్రామ పరిధిలో నెల వారీ వ్యవసాయ సాగు రిజిష్టర్ తప్పని సరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ గ్రామంలో ఎంతమంది రైతులు ఉన్నారు.. ఎన్ని ఎకరాల భూమి సాగు అవుతోంది.. అందులో ఏఏ పంటలు సాగవుతున్నాయో రికార్డుల్లో పొందుపరచాలని రెవెన్యూ సెక్షన్లో ఉంటుంది. సాగు మొత్తానికి సంబంధించి అంచనాలు రూపొం దిం చాలి. అయితే ఏ గ్రామంలో ఏ పంటలు పండుతున్నాయో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. నీటి ఆయకట్టు భూముల గుర్తింపు... 8ఏ ప్రకారం నీటి ఆయకట్టు కలిగిన భూములను గుర్తించడం, అక్కడ వ్యవసాయానికి అనుకూలం గా ఉన్న నీటి వనరులు ఎమి ఉన్నాయో గుర్తించి నమోదు చేయాలి. కానీ రెవెన్యూ అధికారులు వ్యవసాయ భూములను రియల్ భూములుగా మార్చేందుకు ఆసక్తి చూపుతున్నారు తప్ప నీటి వసతిగల భూములను గుర్తించడం లేదు. భూమి శిస్తు రశీదు.. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రెవెన్యూ అధికారులకు వరంగా మారింది. భూముల డిమాండ్, కలెక్షన్, బ్యాలెన్స్ విధానంలో భూమి శిస్తులను రెవెన్యూ ఉద్యోగులు వసూలు చేసి రికార్డులు నమోదు చేయాలి. కానీ జిల్లాలో శిస్తు రశీదు పుస్తకాల్లో కార్బన్ పేపర్ మాయాజాలం కనబరుస్తున్నారు. ఒరిజనల్ రశీదుపై తీసుకున్న డబ్బును నమోదు చేస్తూ, రెవెన్యూ శాఖకు పంపే రశీదుపై కొద్ది మొత్తం నగదు చూపుతూ ప్రభుత్వ కళ్లు గప్పి ఏడాదికి లక్షల్లో సిబ్బంది ఆదాయం గడిస్తున్నారు. ఇలా ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. జనవరి నుంచి జమాబంది చేపడతాం జమాబంది లెక్కల నిర్వహణను జనవరి నెలలో చేపట్టేందుకు ప్రణాళిక చేపడుతున్నాం. జిల్లా కలెక్టర్ ఇలంబరితి ఈ విషయంపై చర్చించారు. పహ ణీలు, రికార్డులు అన్నీ అప్డేట్ చేసేలా చూస్తాం. తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, ఆర్ఐ, వీఆర్వోలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఈ కార్యక్రమం చేపడతాం. జమాబందితో రెవెన్యూకు సంబంధించిన ఆన్ని రికార్డులు పటిష్టం అవుతాయి. ప్రసుత్తం పింఛన్లు, ఆహారభద్రత కార్డుల దరఖాస్తుల పరిశీలన, జారీ కార్యక్రమం చేపడుతున్నందున జమాబందీని జనవరిలో చేపట్టాలని నిర్ణయించాం. - కె.సురేంద్రమోహన్, జాయింట్ కలెక్టర్


