Retiered
-
మైక్రో రిటైర్మెంట్: ఉద్యోగుల్లో కొత్త ట్రెండ్
ప్రస్తుతం ఉద్యోగాలు మాత్రమే కాదు, ఉద్యోగుల ట్రెండింగ్ కూడా మారుతోంది. కొంతమంది ఉద్యోగులు కొన్ని రోజులు జాబ్ చేసిన తరువాత విశ్రాంతి తీసుకోవడం కోసం ఉద్యోగాలు వదిలేస్తున్నారు. దీన్నే 'మైక్రో రిటైర్మెంట్' (Micro Retirement) అంటున్నారు. దీని గురించి మరిన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.సాధారణంగా ఎవరైనా 60 ఏళ్లకు ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ తీసుకుంటుంటారు. కొంత ఓపిక ఉన్నవాళ్లయితే.. ఇంకో నాలుగైదు సంవత్సరాలు ఉద్యోగం చేస్తారు. మరికొందరు.. ఇంట్లో ఖాళీగా ఉండలేక ఓ పార్ట్ టైమ్ ఉద్యోగమైనా చేస్తుంటారు. అయితే ఈ విధానానికి జెన్ జెడ్ లేదా జనరేషన్ జెడ్ ఉద్యోగులు మంగళం పాడేస్తున్నారు.కెరీర్లో కొంత బ్రేక్ తీసుకుని.. జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించిన తరువాత మళ్ళీ ఉద్యోగంలో చేరుతున్నారు. దీన్నే మైక్రో రిటైర్మెంట్ అంటున్నారు. ఈ విధానంలో ఉద్యోగానికి గ్యారెంటీ ఉండదు. ఒక ఉద్యోగి చాలా ఏళ్ళు పనిచేసినప్పుడు కొంత విరామం కావాలనుకుంటే.. ఒక నెల లేదా ఆరు నెలలు సెలవు తీసుకుంటాడు. దీనిని కంపెనీలు కూడా అంగీకరిస్తాయి. కానీ ఈ మైక్రో రిటైర్మెంట్ అనేది మాత్రం భిన్నం.ఇదీ చదవండి: నెలకు 10 రోజులు: టెక్ కంపెనీ కొత్త రూల్! మైక్రో రిటైర్మెంట్ కాలాన్ని కొందరు జీవితాన్ని ఆస్వాదించడానికి ఉపయోగిస్తే.. మరికొందరు కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. పరుగెడుతున్న టెక్నాలజీలో తమను తాము నిరూపించుకోవడానికి.. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి జెన్ జెడ్ ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగానే మైక్రో రిటర్మెంట్ తీసుకుంటున్నారు. ఉద్యోగాల్లో ఒత్తిడిని అధిగమించడానికి కూడా కొందరు ఈ విధానం అవలంబిస్తున్నట్లు సమాచారం. -
స్మగ్లర్లు హీరోలు కాదు..పుష్ప 2పై మాజీ ఐజి ఫైర్
-
విశ్రాంత లోకో పైలెట్ల ఆత్మీయ కలయిక
విజయవాడ: విశ్రాంత లోకో పైలెట్ల ఆత్మీయ కలయిక కార్యక్రమం కొత్త సంఘ్ కార్యాలయంలో ఆదివారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతి«థిగా సంఘ్ డివిజనల్ కార్యదర్శి బండ్రెడ్డి వెంకట చలపతిరావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ లోకో పైలెట్ విధులు నిర్వహించడం కత్తి మీదసాము లాంటిదన్నారు. పదవీ విరమణ చేసి నేడు వారంతా ఆత్మీయంగా కలవడం శుభపరిణామమన్నారు. ఈ సందర్భంగా లోకోపైలెట్గా విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన 80 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారిని ఈ సందర్భంగా సంఘ్ డివిజనల్కార్యదర్శి చలపతిరావు సన్మానించారు. కార్యక్రమంలో సంఘ్కేంద్ర కమిటీ సభ్యుడు యడ్ల నాగేంద్రబాబు, ఆరోగ్య కార్యదర్శి బి.సత్యనారాయణ, తిరుమలరావు, ప్రకాశ్ పాల్గొన్నారు.