breaking news
Reservation BC
-
11 గురుకులాలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నూతన గురుకులాలు ప్రారంభం కానున్నాయి. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పూర్తిస్థాయిలో ఉన్న 11 నియోజకవర్గాల్లో 11 గురుకులాలను జూన్ 1వ తేదీన ప్రారంభించనున్నారు. అయితే కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి కడ్తాల(రంగారెడ్డి జిల్లా)లో ఏర్పాటు చేయనున్నారు. కొడంగల్, షాద్‌నగర్ రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వెళ్లాయి. కొత్తవాటి ఏర్పాటుతో ఉమ్మడి జిల్లాలో గురుకులాల సంఖ్య 26కి పెరగనుంది. ఒక్కో గురుకులంలో 240 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చే అవకాశం. తెలంగాణరాష్ట్ర ఏర్పాటు కాకముందు నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, చిట్యాల్‌లో మాత్రమే గురుకులాలు ఉండేవి. అయితే 2017–18 విద్యాసంవత్సరంలో ప్రభుత్వం 12 గురుకులాలను ఏర్పాటు చేసింది. ఇక ఈ విద్యాసంవత్సరంలో కూడా 11 గురుకులాలను ఏర్పాటు చేయడంతో మొత్తం సంఖ్య 26కు చేరనుంది. ఇది వరకు ఆయా నియోజకవర్గాల్లో బాలుర గురుకులం ఉంటే కొత్తగా బాలికలకు సంబంధించి, బాలికల గురుకులం ఉంటే బాలురులకు సంబంధించి ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఉమ్మడి జిల్లాలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో అందే అవకాశం. విద్యార్థులకు నాణ్యమైన విద్య.. విద్యాపరంగా వెనుకబడిన పాలమూరు జిల్లాలో నూతన గురుకులాల ఏర్పాటు పేద విద్యార్థులకు వరంగా మారనుంది. ఏటేటా గురుకులాల్లో ఫలితాలు చాలా మెరుగుపడడంతో వాటిలోనే విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. విద్యతో పాటు నాణ్యమైన భోజనం, పుస్తకాలు, దుస్తులు వంటి అనేకం ఉచితంగా లభించడంతో కార్పొరేట్ స్థాయి విద్యను ప్రభుత్వం అందించే అవకాశాలు మొండుగా ఉన్నాయి. సీట్ల భర్తీ ఇలా.. బీసీ గురుకులాల్లో సీట్ల భర్తీ ప్రక్రియ కోసం ప్రభుత్వం బీసీ గురుకులాలకు ప్రవేశాలకు సంబంధించి గతనెల ప్రవేశ పరీక్ష నిర్వహించింది. వీటితో పాటు అన్ని గురుకులాలకు కామన్ ప్రవేశ పరీక్ష కూడా నిర్వహించారు. వీటిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సీట్లును కేటాయిస్తారు. బీసీ గురుకుల్లాలో మొదటి ప్రాధానత్య కింద 70శాతం సీట్లను బీసీ వర్గాలకు చెందిన వారికి కేటాయిస్తారు. మిగిలిన వాటిని వివిధ వర్గాల వారి రిజర్వేషన్ల ఆధారంగా కేటాయిస్తారు. ప్రస్తుతం ప్రారంభమయ్యే గురుకులాల్లో మొదటగా 5, 6, 7 తరగతులకు సంబంధించి అడ్మిషన్లు తీసుకోనున్నారు. వీటిలో ఒక్కో తరగతికి రెండు సెక్షన్ల చొప్పున విభజిస్తారు. ఒక్కో సెక్షన్లో 40 మంది విద్యార్థులను చేరిస్తారు. ఇలా రెండో సెక్షన్లలు కలిపి 80 మంది విద్యార్థులు, మూడు తరగతులు కలిపి మొత్తం ఒక్క గురుకులాల్లో 240 మందిని చేర్పిస్తారు. వీటితో పాటు నూతన గురుకులాల్లో బోధన, బోధనేతర సిబ్బంది కూడా పెద్ద ఎత్తున భర్తీ చేసేందుకు ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. గతంలో గురుకులా టీఆర్టీ ద్వారా భర్తీ చేసిన అధ్యాపకులతో పాటు, గతంలో వివిధ గురుకులాల్లో పనిచేసిన గెస్టు, ఔట్ సోర్సింగ్ అధ్యాపకులు, బోధనేతర సిబ్బందిని విధుల్లోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా జిల్లా లో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంది. -
'చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలి'
జహీరాబాద్: జనాభా ప్రాతిపదికన బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మెదక్ జిల్లా జహీరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్లో బిల్లు పెట్టాలని కోరుతూ ఈనెల 13న బీసీ నేతలంతా ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు. చట్ట సభల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత లభించకపోతే కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ప్రజల నుంచి ఒత్తిడి వస్తోందన్నారు. రూ.50 వేల కోట్లతో కేంద్రం, రూ.10 వేల కోట్లతో రాష్ట్రం బీసీలకు ఉప ప్రణాళికలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీలకు కూడా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నారు. -
బీసీ రిజర్వేషన్ కల్పించకుంటే ఉద్యమిస్తాం
తెలగ, బలిజ, కాపు జేఏసీ రాష్ట్ర కన్వీనర్ దాసరి రాము గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెం. 30 మేరకు కాపులను వెంటనే బీసీ జాబితాలో చేర్చి ఎన్నికల హామీ నిలబెట్టుకోవాలని టీబీకే (తెలగ, బలిజ, కాపు) జేఏసీ రాష్ట్ర కన్వీనర్ దాసరి రాము డిమాండ్ చేశారు. గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మంది రంలో బుధవారం తెలగ, బలిజ, కాపు ఐక్య కార్యాచరణ వేదిక, కాపు రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర స్థాయి 4వ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రాము మాట్లాడుతూ టీడీపీ గత ప్రభుత్వాల్లాగా కాపులను వాడుకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఐక్యత ద్వారానే రిజర్వేషన్ సాధ్యం: అంబటి వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ కాపుల బీసీ రిజర్వేషన్ జీవో ఎడారిలో ఒయాసిస్ లాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాపుల ఐక్యత ద్వారానే రిజర్వేషన్ సాధ్యమవుతుందని చెప్పారు. కాపులకు రెండు వాగ్దానాలు చేసి టీడీపీ అధికారంలోకి వచ్చిందని, రెండవ వాగ్దానమైన బీసీ రిజర్వేషన్ కోసం వెంటనే చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డితో మాట్లాడి కాపుల బీసీ రిజర్వేషన్‌కు మద్దతు తెలియ చేస్తామన్నారు. మాజీ మంత్రి శాసన మండలిలో విపక్షనేత సీ రామచంద్రయ్య మాట్లాడుతూ కాపు కుల సంఘాలు ఎక్కువయ్యాయని అనేక మంది తమ స్వార్థం కోసం కులాన్ని వాడుకుంటున్నారని, దీన్ని అందరూ ఖండించాలన్నారు. టీడీపీ ప్రభుత్వం వెంటనే బీసీ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి దాకా ఉద్యమాలు నిర్వహించిన టీబీకే-జేఏసీని వ్యవస్థాపక సంఘంగా స్థాపించి కార్యవర్గాన్ని నియమించాలని తీర్మానించారు. ఈ సమావేశంలో జీడీఎం ఎస్ చైర్మన్ ఇక్కుర్తి సాంబశివరావు, కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షుడు పీఎల్వీ ప్రసాదరావు, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఎస్.ఎల్.వి.నారాయణ, తులసీ గ్రూప్ అధినేత తులసీ రామచంద్ర ప్రభు, వివిధ జిల్లాలకు చెందిన జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు.