breaking news
reprimanded
-
ఇంగ్లండ్ బౌలర్‌కు షాకిచ్చిన ఐసీసీ
ఇంగ్లండ్ మహిళా ఫాస్ట్ బౌలర్ కేథరిన్ బ్రంట్‌కు ఐసీసీ షాకిచ్చింది. మ్యాచ్ సమయంలో అసభ్య పదజాలం ఉపయోగించి ఐసీసీ నియమావళి లెవెల్-1 నిబంధనను ఉల్లంఘించినందుకు గానూ కేథరిన్‌ను హెచ్చరించడమే గాక మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించింది. ఇక డిసిప్లీనరి యాక్ట్ కింద ఒక పాయింట్ కోత విధించింది. ఏడాది కాలంలో కేథరిన్ బ్రంట్ ఐసీసీ నిబంధన ఉల్లఘించడం ఇది రెండోసారి. ఇప్పటికే రెండు డీమెరిట్ పాయింట్లు ఉండడంతో.. మరోసారి నిబంధన ఉల్లంఘిస్తే మాత్రం ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కొనే అవకాశం ఉంది. విషయంలోకి వెళితే.. శనివారం ఇంగ్లండ్, టీమిండియా మహిళల మధ్య కామన్వెల్త్ గేమ్స్ సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. భారత బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 17వ ఓవర్ కేథరిన్ బ్రంట్ వేసింది. దీప్తి శర్మ ఇచ్చిన క్యాచ్‌ను ఫీల్డర్ విడిచిపెట్టడంతో కేథరిన్ అసభ్య పదజాలం ఉపయోగిస్తూ కోపంగా అరిచింది. ఆమె వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. దీంతో మ్యాచ్ అనంతరం ఐసీసీ నిబంధనల ప్రకారం ఆర్టికల్ 2.3 నిబంధన ఉల్లఘించిన కేథరిన్ బ్రంట్‌కు హెచ్చరిస్తూ ఒక డీమెరిట్ పాయింట్ విధిస్తున్నట్లు మ్యాచ్ రిఫరీ స్పష్టం చేశారు. తొలిసారిగా కామన్వెల్త్ క్రీడల్లో ప్రవేశపెట్టిన మహిళల టి20 క్రికెట్లో భారత జట్టు సత్తా చాటింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరుస్తూ హర్మన్‌ప్రీత్ బృందం ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఫలితంగా స్వర్ణం లేదా రజత పతకం గెలుచుకోవడం ఖాయమైంది. శనివారం ఆసక్తికరంగా జరిగిన తొలి సెమీఫైనల్లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుపై భారత్ 4 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. స్మృతి మంధాన (32 బంతుల్లో 61; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో చెలరేగగా, జెమీమా రోడ్రిగ్స్ (31 బంతుల్లో 44 నాటౌట్; 7 ఫోర్లు) రాణించింది. మహిళల అంతర్జాతీయ టి20ల్లో భారత్ తరఫున వేగవంతమైన అర్ధ సెంచరీ (23 బంతుల్లో)ని స్మృతి నమోదు చేయడం విశేషం. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులే చేయగలిగింది. ఆఖరి ఓవర్లో గెలుపు కోసం 14 పరుగులు చేసే ప్రయత్నంలో ఇంగ్లండ్ 9 పరుగులు మాత్రమే రాబట్టగలిగింది. స్పిన్నర్లు స్నేహ్ రాణా (2/28), దీప్తి శర్మ (1/18) ప్రత్యర్థిని కట్టడి చేయడంలో సఫలమయ్యారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో తుది పోరులో భారత తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం నేడు రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ఫైనల్ మొదలవుతుంది. కాంస్య పతక మ్యాచ్ మధ్యాహ్నం గం. 3:30 నుంచి జరుగుతుంది. చదవండి: Commonwealth Games 2022: క్రికెట్లో కనకంపై గురి మంధాన ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు -
సెల్ ఫోన్లో గేమ్స్ ఆడొద్దని మందలించడంతో..
జామి: సెల్ ఫోన్లో ఆటలాడొద్దని తండ్రి మందలించాడని కుమారుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం జామిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. జామి మంగలవీధికి చెందిన లగుడు సింహాచలంనాయుడు(14) విద్యార్థి స్థానిక జెడ్పీ ఉన్నతపాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. సెల్ఫోన్లో ఆటలాడొద్దని తండ్రి కృష్ణ మందలించి పొలం పనులకు వెళ్లాడు. దీంతో సింహాచలంనాయుడు ఇంటివద్ద ఉన్న పురుగుల మందు తాగాడు. నోటిలో నుంచి నురగలు రావడంతో తల్లి కేకలు వేసి భర్తకు సమాచారం అందించింది. విద్యారి్థని స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఘటనపై జామి ఏఎస్సై గోపి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
అంపైర్ వైపు బ్యాట్ చూపించినందుకు..
-
అంపైర్ వైపు బ్యాట్ చూపించినందుకు..
ముంబై: ఐపీఎల్-10లో ముంబై ఇండియన్స్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ మందలింపుకు గురయ్యాడు. అంపైర్ నిర్ణయం పట్ల అసంతృఫ్తి వ్యక్తం చేయడంతో మ్యాచ్ రిఫరీ అతడిని తీవ్రంగా మందలించారు. ‘ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని రోహిత్ శర్మ ఉల్లంఘించాడు. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న అతడి ప్రవర్తన నియమావళిలో లెవల్–1 నేరం కిందకు వస్తుండటంతో మ్యాచ్ రిఫరీ మందలించార’ని ఐపీఎల్ నిర్వాహక కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో ముంబై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆట పదో ఓవర్ లో సునీల్ నరైన్ బౌలింగ్ లో రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. అంపైర్ సీకే నందన్ నిర్ణయంపై రోహిత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంపైర్ వైపు బ్యాటు చూపిస్తూ అసంతృప్తిగా మైదానం వీడాడు. కాగా, గురువారం ముంబయి ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఎంఎస్ ధోని ‘డీఆర్ఎస్’ సైగలు చేసి మందలింపుకు గురయ్యాడు. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడన్న ఆరోపణతో ధోనిని మ్యాచ్ రిఫరీ మనూ నాయర్ తీవ్రంగా మందలించారు.