breaking news
Relations suspect
-
ఇమ్రాన్‌కు ఆర్మీ అండదండలు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మిలటరీ, ఐఎస్ఐ మద్దతుతో ప్రధాని గద్దెనెక్కనున్న ఇమ్రాన్ ఖాన్ కారణంగా.. భారత్‌తో సత్సంబంధాల్లో మార్పు ఉంటుందని ఆశలేమీ పెట్టుకోవద్దని రాజకీయ, మిలటరీ నిపుణులు హెచ్చరించారు. ‘ఆయన ఆర్మీ మనిషి. పాక్ ఆర్మీ చెప్పింది చేయడమే ఆయన పని’ అని పాకిస్తాన్లో భారత మాజీ దౌత్యవేత్త జి. పార్థసారథి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ సమర్థించారు. ఇమ్రాన్ నాయకత్వంలో పాకిస్తాన్ ఆలోచనాధోరణిలో మార్పు ఉండబోదన్నారు. భారత్‌లోనూ మరో 10 నెలల్లో ఎన్నికలున్నందున మోదీ ప్రభుత్వం కూడా పాకిస్తాన్‌తో దోస్తీకి పాకులాడే ప్రయత్నం చేయకపోవచ్చని మరో మాజీ దౌత్యవేత్త కేసీ సింగ్ అభిప్రాయపడ్డారు. ఇమ్రాన్ నాయకత్వంలో భారత్–పాక్ ఉద్రిక్త పరిస్థితుల్లో పెద్దగా తేడా ఉండకపోవచ్చని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ దీపక్ కపూర్ పేర్కొన్నారు. పాకిస్తాన్ తన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు పరోక్షయుద్ధాన్ని కొనసాగిస్తుందన్నారు. -
మాకు ప్రాణ హాని ఉంది..
భార్య చేతిలో హతమైన రవి పిల్లలు, బంధువు పొన్నూరు : మండల పరిధిలోని మన్నవ గ్రామంలో భర్తను హత్యచేసి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన భార్య రేగులగడ్డ జ్యోతి కేసుకు సంబంధించి పలువురు నిందితులు పరారీలో ఉన్నారని, వారివల్ల తమకు ప్రాణహాని ఉందని హతుడు రేగులగడ్డ రవి పిల్లలు, బంధువులు ఆరోపిస్తున్నారు. హతుడు రవి కుమారుడు రాజేష్, కుమార్తె ప్రసన్న, తమ్ముడు వరసైన వాసు ఆదివారం మీడియాను కలిసి తమగోడు వెళ్ళబోసుకున్నారు. వారు చెప్పిన వివరాల ప్రకారం... జ్యోతి, గ్రామానికి చెందిన పి. పాపారావుకు అక్రమ సంబంధం ఉందన్న విషయం హతుడు రవికి తెలుసన్నారు.ఈ విషయంపైనే తరచూ వారి మధ్య గొడవలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. రవి కష్టార్జితం లక్ష రూపాయిలు పాపారావు అప్పుగా తీసుకొని డబ్బులు అడిగిన సందర్భంలో రాసిచ్చిన ప్రామిసరీ నోటును కూడా చించేసి దుర్భాషలాడారన్నారు. ఈ క్రమంలోనే రవిని పథకం ప్రకారమే హత్య చేశారని, ఈ పథకంలో జ్యోతి, పాపారావుతో పాటు మరికొందరి హస్తం ఉందని కూడా వారు ఆరోపిస్తున్నారు. రవిని హత్య చేసిన అనంతరం మన్నవ దొప్పలపూడి గ్రామానికి మధ్య కొంతమంది వ్యక్తులు శవాన్ని పూడ్చిపెట్టడానికి గొయ్య తీశారని, శవాన్ని మాయం చేయలేక జ్యోతి పోలీసులకు లొంగిపోవడంతో హత్యకు సహకరించిన నిందితులు పరారయ్యారని చెపుతున్నారు. పోలీసుల అదుపులో ఉన్న జ్యోతి, పాపారావులను కోర్టుకు హాజరుపరచగా వారికి రిమాండ్ విధించారని, అయితే బయట ఉన్న వారివల్ల తమకు ప్రాణహాని ఉందని, ఆదివారం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో తమ గోడు వెళ్ళబోసుకున్నామని వారు వివరించారు.