breaking news
regular posts
-
‘గెస్టు’కు రెగ్యులర్ గుబులు
సాక్షి, అమరావతి: అడ్డగోలు నిర్ణయాలతో అభాసుపాలవడం బీసీ సంక్షేమ శాఖ బాధ్యులకు పరిపాటిగా మారింది. కాంట్రాక్ట్ స్కూల్స్‌లో తాజాగా మంజూరైన కాంట్రాక్ట్ టీచర్స్ పోస్టులను రెగ్యులర్ పోస్టులుగా మార్చేందుకు గట్టి యత్నాలే జరుగుతున్నాయి. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సంజీవరెడ్డిగారి సవిత అధ్యక్షతన సోమవారం నిర్వహిస్తున్న బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ (బీఓజీ) సమావేశంలో కాంట్రాక్ట్ స్కూళ్లలోని 715 కాంట్రాక్ట్ పోస్టులను రెగ్యులర్ పోస్టులుగా మార్చేందుకు ప్రతిపాదించారు. దీనిని ఆ సమావేశ అజెండాలోని 13వ అంశంగా ఆమోదించేందుకు ముందస్తు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఏళ్ల తరబడి సేవలందిస్తున్నా.. మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకులాల పరిధిలో 2019లో కొత్తగా 65 బీసీ గురుకులాలు ఏర్పాటు చేశారు. వాటిలో 65 రెగ్యులర్ ప్రిన్సిపాల్స్, 715 మంది టీచర్లను కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయాలని అప్పట్లో జారీ చేసిన జీవో నంబర్ 23లో స్పష్టం చేశారు. అప్పటినుంచి వాటిలో కాంట్రాక్ట్ టీచర్స్ నియామకం లేకపోవడంతో గెస్ట్ ఫ్యాకల్టీ లతో నిర్వహిస్తున్నారు. కాంట్రాక్ట్ స్కూల్స్‌లోని 715 పోస్టులతోపాటు మరికొన్ని గురుకులాలతో కలిపి మొత్తం 1,253 మంది గెస్ట్ టీచర్స్ 5 నుంచి 10 ఏళ్లుగా పనిచేస్తున్నారు. జీవో నంబర్ 23లో పేర్కొన్న నిబంధనలను కాదని.. కూటమి ప్రభుత్వం ఇష్టానుసారం కాంట్రాక్ట్ స్కూల్స్‌లోని పోస్టులను రెగ్యులర్‌గా మారిస్తే గెస్ట్ టీచర్స్ రోడ్డున పడే ప్రమాదం ఉంది. కూటమి ప్రభుత్వం తక్షణం కాంట్రాక్ట్ స్థానంలో రెగ్యులర్ టీచర్స్‌ను పెట్టే ప్రతిపాదన విరమించుకుని కాంట్రాక్ట్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి గెస్ట్ టీచర్లకు వెయిటేజీ ఇచ్చి భర్తీ చేయాలని కోరుతున్నారు. జగన్ మేలు చేస్తే.. కూటమి కక్ష కట్టింది వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తమకు మేలు జరగ్గా.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కక్ష గట్టిందని గెస్ట్ టీచర్లు వాపోతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2022లో మోడల్ స్కూల్స్‌లో 282 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. గెస్ట్ టీచర్లకు 20 మార్కుల వెయిటేజీ ఇచ్చి భర్తీ చేసింది. రాష్ట్రంలో 106 బీసీ గురుకులాల్లో టెన్త్ విద్యార్థులు 2023–24లో 98.8 శాతం, 2024–25లో 95 శాతం ఉత్తీర్ణత సాధించడంలో గెస్ట్ టీచర్స్ పాత్ర కీలకం. కనీసం వారు డీఎస్సీకి ప్రిపేర్ అయ్యేందుకూ కూటమి ప్రభుత్వం సెలవు ఇవ్వలేదు. డీఎస్సీ కోచింగ్‌కు వెళ్లిన వారిని బీసీ గురుకుల సొసైటీకి రానిచ్చేది లేదంటూ ఇటీవల సర్క్యులర్ కూడా జారీ చేసింది. అటు డీఎస్సీ కోచింగ్ తీసుకునే అవకాశం లేకుండా చేసి.. ఇటు ఉన్న పోస్టులకే ఎసరు పెడితే తాము ఉద్యోగం కోల్పోయి రోడ్డున పడతామని గెస్ట్ టీచర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
హే.. ‘మహాత్మా’!
ఎంజీయూలో రెగ్యులర్ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీ ♦ యూనివర్సిటీ ప్రారంభం నుంచీ ఇదే పరిస్థితి ♦ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీతోనే నెట్టుకొస్తున్న వైనం ♦ పదేళ్లయినా పోస్టుల భర్తీపై మీనమేషాలు ♦ పూర్తిస్థాయిలో ల్యాబ్స్ లేక విద్యార్థుల అవస్థలు ♦ రెండేళ్లయినా అతీగతీ లేని ఇంజనీరింగ్ కళాశాల యూనివర్శిటీ ప్రారంభమై పదేళ్లు అవుతున్నా రెగ్యులర్ ప్రొఫెసర్ల నియామకాలపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. ఎంజీయూకు మొత్తం 70 ప్రొఫెసర్ల పోస్టులు మంజూరై తే ఇప్పటివరకు భర్తీ చేసింది కేవలం 36 మాత్రమే. ఇంకా 34 రెగ్యులర్ పోస్టులు ఖాళీ గానే ఉన్నాయి. విద్యార్థుల బోధనకు సంబంధించి 52 మంది కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ, 10 మంది పార్ట్‌టైమ్ ఫ్యాకల్టీని తీసుకున్నారు. ఒక్కో సంవ త్సరం కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు కూడా లేకపోవడంతో ఇబ్బం దులు ఎదురవుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. నల్లగొండ నుంచి బొల్లం శ్రీనివాస్: మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యా బోధన మిథ్యగా మారుతోంది. యూనివర్సిటీ ప్రారంభమై పదేళ్ల యినా ఇప్పటికీ రెగ్యులర్ ప్రొఫెసర్ల నియామకాలు లేవు. కాంట్రాక్ట్ అధ్యాపకులతోనే బోధన చేయిస్తున్నారు. యూనివ ర్సిటీకి 70 రెగ్యులర్ పోస్టులు మంజూరైతే కేవలం 36 పోస్టు లను మాత్రమే భర్తీ చేశారు. మిగతావన్నీ కాంట్రాక్ట్ పద్ధతిన తీసుకుని నెట్టుకొస్తున్నారు. విద్యార్థులకు వసతుల విషయం లోనూ ఇదే పరిస్థితి ఉంది. నల్లగొండ జిల్లా కేంద్రానికి సమీపంలోని అన్నెపర్తి గ్రామం వద్ద 2007లో యూనివర్శిటీని మంజూరు చేశారు. ఆ తర్వాత దీనికి మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ)గా పేరు పెట్టారు. మన యూనివర్సిటీలు ⇔ మొత్తం మంజూరైన పోస్టులు70 ⇔ బోధనా విభాగంలో ఖాళీలు34 ⇔ అసోసియేట్ ప్రొఫెసర్లు 15ఖాళీలు ⇔ ప్రొఫెసర్లు 10ఖాళీలు ⇔ అసిస్టెంట్ ప్రొఫెసర్లు 09ఖాళీలు ⇔ ‘మహాత్మాగాంధీ’లో సగం పోస్టులు ఖాళీ18 కోర్సులు, 2,300 మంది విద్యార్థులున్న ఈ యూనివర్శిటీలో రెగ్యులర్ అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది. 50% మందికే హాస్టల్.. యూనివర్సిటీలో సీట్లు సాధిం చిన విద్యార్థుల్లో ఎక్కువ మంది హాస్టల్ వసతి కావాలని అడుగుతున్నా.. ఒక్కో కోర్సు లో కేవలం 50 శాతం మందికే హాస్టల్ వసతి కల్పిస్తున్నారు. అది కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు రిజర్వేషన్ పద్ధతి ప్రకారం. 650 మంది విద్యార్థులు, 250 మంది విద్యార్థినులు వసతి పొందుతున్నారు. ఇవీ సమస్యలు.. ఇవీ కోర్సులు.. యూనివర్సిటీ పరిధిలో పీహెచ్‌డీతోపాటు బీఈడీ, ఎంఈడీ కోర్సులు పెట్టాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా సైన్స్ ల్యాబ్స్ లేవు. క్రీడా మైదానం లేదు. యూనివర్సిటీ ప్రాంగణంలో ఇంజినీరింగ్ కళాశాల మంజూరై రెండేళ్లవుతున్నా ఇటీవలే నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. యూనివర్సిటీలో మొత్తం 18 కోర్సులు... ఎంఏ ఇంగ్లిష్, ఎకనామిక్స్, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంకామ్, ఎంబీఏ, ఎంబీఏ టూరిజం, ఐదేళ్ల ఎంబీఏ, ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ, బయో టెక్నా లజీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జియాలజీ, ఐదేళ్ల కెమిస్ట్రీ, ఇంజినీరింగ్‌లో ఈసీఈ, ఈఈ ఈ, సీఎస్ఈ, ఎంసీఏ కొనసాగుతున్నాయి. రిజిస్ట్రార్ పోస్టులో కూడా నాలుగేళ్లుగా ‘ఇన్చార్జే’ కొనసాగుతున్నారు..