breaking news
Registered voters
-
భారత్‌లో భారీగా పెరిగిన ఓటర్లు..
న్యూఢిల్లీ: మన దేశంలో ఓటర్ల సంఖ్య ఏడాదికేడాది పెరిగిపోతోంది. 1951 నుంచి ఇప్పటి వరకు చూస్తే ఓటర్ల సంఖ్య ఆరు రెట్లు పెరిగింది. ఈ ఏడాది జనవరి 1 నాటికి మన దేశంలో రిజిస్టర్ ఓటర్లు 94.50 కోట్లు అని కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడింది. అయితే ఈ ఓటర్లలో దాదాపుగా మూడో వంతు మంది ఓటుకి దూరంగా ఉండడం ప్రజాస్వామ్యంలోనే విషాదకరం. ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు ఉండడంతో ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఇప్పట్నుంచే కేంద్ర ఎన్నికల సంఘం వ్యూహాలు పన్నుతోంది. మొట్టమొదటిసారి 1951లో ఓటర్ల జాబితాను రూపొందించినప్పుడు 17.32 కోట్ల మంది తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 45.67% ఓటింగ్ నమోదైంది. 1957 సార్వత్రిక ఎన్నికల సమయానికి ఓటర్ల సంఖ్య 19.37 కోట్లు ఉంటే 47.44% మంది ఓటు వేశారు. 2009 నాటికి ఓటర్ల సంఖ్య భారీగా 71.7 కోట్లకు పెరిగినప్పటికీ ఓటింగ్ శాతం 58.21 మాత్రమే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 91.20 రిజిస్టర్డ్ ఓటర్లు ఉంటే 67.40శాతం మంది తమ ఓటు హక్కు -
పార్టీల ముసుగులో మనీలాండరింగ్..
సాక్షి, అమరావతి: ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ప్రతీ రాజకీయ పార్టీ కూడా ఎన్నికల కమిషన్ వద్ద రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఇప్పటికి దేశవ్యాప్తంగా దాదాపు 2,099 పార్టీలు రిజిష్టర్ చేసుకున్నాయి. ఇందులో 97 శాతం పార్టీలకు ఎన్నికల సంఘం గుర్తింపు లేదు. ఏడు జాతీయ పార్టీలు కాగా, 58 రాష్ట్ర పార్టీలు. ఈ 97 శాతం పార్టీల్లో అత్యధిక పార్టీలు మనీలాండరింగ్‌కు, పన్నుల ఎగవేతకు ఉపయోగపడుతున్నాయనే ఆరోపణలున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇదే అభిప్రాయంతో ఉంది. ఎందుకంటే రిజిస్టర్ అయిన పార్టీల్లో అత్యధిక శాతం ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు నిర్వర్తించడం లేదు. ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే అధికారం తమకు ఇవ్వాలని ఎంతో కాలంగా ఎన్నికల సంఘం డిమాండ్ చేస్తూ వస్తోంది. కొన్ని పార్టీల విషయంలో పన్నుల ఎగవేత ఆరోపణలు నిరూపితమయ్యాయి. బంద్‌లు, రాస్తారోకోలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకుని, రాస్తారోకోలు నిర్వహించిన సీపీఎంకు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు ఇచ్చింది. పార్టీ రిజిస్ట్రేషన్(డీ రిజిస్టర్) ఎందుకు చేయరాదో తెలిపాలని ఆదేశించింది. దీనిపై ఆ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు 2002లో తీర్పునిస్తూ పార్టీల రిజిస్టర్‌కు ఎన్నికల సంఘానికి అధికారం ఉందని, అయితే డీ రిజిస్టర్ చేసేందుకు మాత్రం అధికారం లేదని స్పష్టం చేసింది. ఒక పార్టీని రిజిస్టర్ చేసిన తర్వాత, తిరిగి దానిని పునఃసమీక్షించే అధికారం చట్టంలో ఎక్కడా లేదని పేర్కొంది. ఓ రాజకీయ పార్టీని డీ రిజిస్టర్ చేయడమన్నది చాలా తీవ్రమైన విషయమని స్పష్టం చేసింది. 2010లో ఎన్నికల సంఘం మరోసారి పార్టీల డీ రిజిస్టర్ విషయంలో తమకు అధికారాలు ఇవ్వాలని కోరింది. ఆ మేర చట్ట సవరణ చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. గత ఏడాది ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు నుంచి నోటీసులు అందుకున్న ఎన్నికల సంఘం, పార్టీల డీ రిజిస్టర్‌కు తమకు అధికారాన్ని ఇవ్వాలని లిఖితపూర్వకంగా కోరింది. అయితే దీనిని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. -
నత్తే నయం
యూనివర్సిటీక్యాంపస్: ఎంఎల్సీ ఎన్నికల గడువు శనివారంతో ముగియనుంది. చాలా తక్కువ సంఖ్యమంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. పట్టభధ్రులు, ఉపాధ్యాయ నియోజక వర్గాలకు వచ్చే యేడాది మార్చిలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో కూడిన పట్టభధ్రుల నియోజక వర్గ పరిధిలోకి వస్తుంది. గత ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ రద్దు చేసింది. అందరూ తాజాగా ఓటు నమోదు చేయాలని ప్రకటించింది. ఓటరు నమోదుకు శనివారంతో గడువు ముగియనుంది. చాలా మంది ఓటును నమోదు చేయించుకోలేదు. శుక్రవారం సాయంత్రానికి కొద్ది శాతం కూడా నమోదు చేసుకోలేదని తెలిసింది. పట్టభద్రుల నియోజకవర్గంలో గతేడాది చిత్తూరు జిల్లా నుంచి 67వేల మంది నమోదు చేసుకున్నారు. ఆరేళ్ల తర్వాత జరుగుతున్నందున ఇప్పుడీ సంఖ్య పెరగాలి. కానీ ఇప్పటివరకూ 30వేలకు పైగా నమోదు చేసుకున్నారు. ంటే సగం మంది కూడా నమోదు చేసుకోలేకపోయారు. ఆన్లైన్ ద్వారా ఓటు నమోదుకు పట్టభద్రులు మూడు రోజులుగా ప్రయత్నిస్తున్నారు. తరచు సర్వర్ మొరాయిస్తోంది. అంతేకాకుండా దరఖాస్తు పూర్తి చేశాక అప్లోడ్ చేసే సమయంలో సర్వర్ అకస్మాత్తుగా డౌన్ అవుతోంది. దీంతో చాలా మంది ఓటు నమోదు చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. నమోదు గడువును పెంచాలని పట్టభధ్రులు కోరుతున్నారు. ఈ అంశాన్ని వైఎస్సార్సీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు వినతి పత్రం ఇచ్చారు. గడువును ఇప్పటివరకు పెంచలేదు. -
అమెరికన్ ఓటర్లు రికార్డు బ్రేక్ చేశారు!
వాషింగ్టన్ : అమెరికా చరిత్రలో మొదటిసారి అధ్యక్ష ఎన్నికల కోసం రికార్డు స్థాయిలో రిజిస్టర్ ఓటర్లు పెరిగారు. 200 మిలియన్లకు పైగా అమెరికన్లు ఈ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు రిజిస్టర్ చేపించుకున్నట్టు డెమొక్రాటిక్ పొలిటికల్ డేటా సంస్థ టార్గెట్స్మార్ట్ తెలిపింది. నేషనల్ రిజిస్ట్రేషన్ ప్రకారం అమెరికా ప్రస్తుతం 200,081,377 మంది రిజిస్ట్రర్ ఓటర్లు కలిగి ఉన్నట్టు టార్గెట్స్మార్ట్ సీఈవో టామ్ బోనియర్ చెప్పారు. గత ఎనిమిదేళ్లలో దాదాపు 50 మిలియన్‌కు పైగా కొత్త రిజిస్ట్రర్ ఓటర్లు పెరిగినట్టు ఈ డేటాలో వెల్లడైనట్టు జిన్హువా ఏజెన్సీ రిపోర్టు చేసింది. ప్రస్తుత అధ్యక్షుడు ఒరాక్ ఒబామా మొదటిసారి వైట్హోస్కు గెలిచినప్పుడు అంటే 2008లో కేవలం 146.3 మిలియన్ రిజిస్ట్రర్ ఓటర్లు మాత్రమే అమెరికా కలిగి ఉంది. డెమొక్రాటిక్కు మద్దతుగా 42.6 శాతం కొత్త ఓటర్లు రిజిస్ట్రర్ చేయించుకోగా, రిపబ్లికన్ పార్టీకి మద్దతు తెలుపుతూ 29 శాతం, స్వతంత్ర అభ్యర్థులకు సపోర్టుగా మరో 28.4శాతం కొత్త ఓటర్లు నమోదైనట్టు టార్గెట్స్మార్ట్ వెల్లడించింది. మొదటిసారి 200 మిలియన్ ఓటర్ల మైలురాయిని చేధించామని బోనియర్ తెలిపారు. వీరిలో ఎక్కువ శాతం మంది డెమొక్రాటిక్ అభ్యర్థికి మొగ్గుచూపుతున్నట్టు ఆయన తెలిపారు. అయితే ఈ ఏడాది మొదట్లో ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం ప్రకారం 2016 ఎలక్టోరేట్ ఎక్కువగా జాతి, సాంస్కృతిపరంగా వైవిధ్యభరితంగా సాగనుందని పేర్కొంది. 31 శాతం ఓట్లు అల్పసంఖ్యాక వర్గాల నుంచి వస్తాయని ఆ సంస్థ అంచనావేసింది. 2012లో ఆ ఓట్లు 21శాతంగా ఉన్నాయి. అయితే నవంబర్ 8న జరిగే ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరుగుతుందా అనేది చెప్పడంలో కొంచెం కష్టతరమైతున్నట్టు పేర్కొంది. అధ్యక్ష ఎన్నికల చరిత్రలో 2008లో మొదటిసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. 131.4 మిలియన్ ప్రజలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. అదే 2012కి వచ్చేసరికి ఓటర్లు శాతం 129.2 మిలియన్లకు పడిపోయింది. రెండు దశాబ్దాల క్రితం వరకు కనీసం 200 మిలయన్ ఓటింగ్ వయసు జనాభానే అమెరికాలో లేరు. కానీ ప్రస్తుతం రిజిస్ట్రర్ యూజర్లే 200 మిలియన్ గరిష్ట స్థాయికు ఎగబాకారు. -
రెండు రాష్ట్రాల్లో 13 నుంచి ఓటర్ల నమోదు
డిసెంబర్ 8 వరకు అవకాశం జనవరి 15న తుది జాబితా హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వచ్చే నెల 13వ తేదీ నుంచి ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రెండు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. సాధారణంగా నవంబర్ 1వ తేదీ నుంచి ఓటర్ల నమోదు కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో తుఫాను కారణంగా, తెలంగాణలో పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ పూర్తి కానుందున ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని వచ్చే నెల 13వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు భన్వర్‌లాల్ చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండే యువతీ యువకులందరూ ఓటర్లగా నమోదుకు అర్హులన్నారు. డిసెంబర్ 8 వరకు ఓటర్లుగా నమోదుకు అవకాశం కల్పిస్తారు. ఓటర్ల తుది జాబితాను జనవరి 15న ప్రకటిస్తారు. ఓటర్ల నమోదు, జాబితా సవరణ షెడ్యూల్ ఈ విధంగా ఉంది... ముసాయిదా జాబితా ప్రకటన : 13-11-2014 ఓటర్లుగా నమోదు, అభ్యంతరాలు, సవరణలు: 13-11-2014 నుంచి 08-12-2014 గ్రామసభల్లో, స్థానిక సంస్థల్లో పేర్లు చదువుతారు: 19-11-2014, 26-11-2014 పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి ఆఫీసర్లు, పార్టీల ఏజెంట్లు కూర్చుని దరఖాస్తుల స్వీకరణ: 16-11-2014, 23-11-2014, 30-11-2014, 07-12-2014 దరఖాస్తుల పరిష్కారం: 22-12-2014 సప్లమెంటరీ జాబితా ప్రచురణ, ఫొటోలు, పేర్లు నమోదు: 05-01-2015 ఓటర్ల తుది జాబితా ప్రకటన: 15-01-2015


