breaking news
Regional Executive Director
-
ఎన్టీపీసీ ఆర్‌ఈడీగా నరేశ్ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నరేశ్ ఆనంద్ సోమవారం కవాడిగూడలోని సంస్థ ప్రాంతీయ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. రామగుండంలోని ఎన్టీపీసీ థర్మల్ ప్లాంట్లతో పాటు దక్షిణ భాతర దేశంలోని సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. ట్రైనీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా 1984లో చేరిన ఆయన.. 37 ఏళ్ల సర్వీసు కాలంలో పలు హోదాల్లో పనిచేశారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) సభ్యుడిగా కూడా వ్యవహరించారు. -
ఎన్టీపీసీ రీజినల్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ గా వి.బి.ఫడ్నవిస్
హైదరాబాద్: ప్రభుత్వ రంగ దిగ్గజ సంస్థ ఎన్టీపీసీ రీజినల్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (దక్షిణ ప్రాంత)గా వి.బి.ఫడ్నవిస్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈయన ఇండోర్‌లోని దేవీ అహల్య విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. అలాగే న్యూఢిల్లీ ఐఐటీలో థర్మల్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ పూర్తిచేశారు. ఎన్టీపీసీలో ఫడ్నవిస్ కెరీర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ స్థాయి నుంచి (1979) ప్రారంభమైంది. తర్వాత ఆయన ఎన్టీపీసీలో పలు రకాల ఉన్నత పదవుల్లో బాధ్యతలు నిర్వర్తించారు.