పద్మభూషణ్‌కు సుశీల్ పేరు సిఫారసు
న్యూఢిల్లీ: స్టార్ రెజ్లర్, రెండు ఒలింపిక్ పతకాల విజేత సుశీల్ కుమార్‌కు పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అలాగే సుశీల్ కోచ్ యశ్వీస్ సింగ్‌కు, మహిళా రెజ్లర్ అల్కా తోమర్‌కు పద్మశ్రీ అవార్డులు బహూకరించాలని కేంద్ర క్రీడల శాఖను కోరింది.
సుశీల్ బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం, లండన్ గేమ్స్‌లో రజతం సాధించిన సంగతి తెలిసిందే. ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ ఈవెంట్లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత క్రీడాకారుడిగా సుశీల్ చరిత్ర సృష్టించాడు. 15 సార్లు ప్రపంచ బిలియర్డ్స్, స్నూకర్ చాంపియన్ పంకజ్ అద్వానీ పేరును పద్మభూషణ్ అవార్డుకు ప్రతిపాదించారు. ఇటీవల ఖేల్ రత్న అవార్డు అందుకున్న షూర్ జూతూరాయ్తో పాటు టేబుల్ టెన్నిస్ ఆటగాడు ఆచంట శరత్ కమల్ పేర్లను పద్మశ్రీకి ప్రదిపాదించారు.