breaking news
RDO venkatachari
-
‘డేరా’ భూములు స్వాధీనం చేసుకుంటాం
నల్లగొండ ఆర్డీవో వెంకటాచారి చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మం డలం వెలిమినేడులోని గుర్మిత్ రామ్ రహీం సింగ్ డేరా సచ్చా సౌదాలోని అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుంటామని ఆర్డీవో వెంకటాచారి తెలిపారు. వెలిమినేడు లోని జాతీయ రహదారి వెంట గల డేరా సచ్చా సౌదాను ఆదివారం ఆయన సంద ర్శించారు. భూముల వివరాలను ఆ సంస్థ నిర్వాహకుడు శ్యాంలాల్ను అడిగి తెలుసు కున్నారు. ఆర్డీఓ మాట్లాడుతూ డేరా సచ్చా సౌదాలోని 56 ఎకరాల భూముల్లో 9 ఎక రాల 20 గుంటలు అసైన్డ్ భూములుగా ఉన్నాయని తేలిందని, వాటిని స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. -
వికారుద్దీన్ ఎన్కౌంటర్పై ఆర్డీవో విచారణ
నల్లగొండ: గత నెల 7న నల్లగొండ జిల్లా ఆలేరులోని కందిగడ్డతండా శివారులో తీవ్రవాది వికారుద్దీన్, అతని అనుచరుల ఎన్కౌంటర్పై గురువారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో నల్లగొండ ఆర్డీవో వెంకటాచారి విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించి 22 మందికి నోటీసులు జారీ చేయగా గురువారం విచారణకు 8 మంది హాజరయ్యారు. హాజరైన వారిలో నలుగురు వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లు ఉన్నారు. కాగా, మిగతా నలుగురు పోలీసు సిబ్బంది. ఆర్డీవో వెంకటాచారి వారి నుంచి వాంగ్ములాలను తీసుకున్నారు. ఉదయం 10.30 గంటలకు ఆలేరుకు చేరుకున్న ఆర్డీవో సాయంత్రం 5 గంటల వరకు తహశీల్దార్ కార్యాలయంలోనే ఉన్నారు. శుక్రవారం కూడా విచారణ కొనసాగుతుందని ఆయన తెలిపారు. (ఆలేరు)