Ration distribution bandh
-
రేషన్ పంపిణీ వాహనాల ఆపరేటర్ల ఆందోళన
సాక్షి, పాడేరు/నరసరావుపేట: ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తున్న ఎండీయూ వ్యవస్థను రద్దుచేయడంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవస్థను కొనసాగించాలంటూ ఎండీయూ ఆపరేటర్లు, హెల్పర్లు శుక్రవారం పలుచోట్ల తమ వాహనాలతో ధర్నా చేశారు. తమ సేవలను కొనసాగించాలని నినాదాలు చేశారు. అధికారులకు వినతిపత్రాలిచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో ఎండీయూ ఆపరేటర్లు ర్యాలీ చేశారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడకు వినతిపత్రమిచ్చారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జిల్లాలో 221 వాహనాల ద్వారా 72 నెలల సేవలకు ఒప్పందం కుదుర్చుకుందని, ఇంకా 20 నెలల గడువు ఉండగానే ఎండీయూ వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దుచేయడం దారుణమన్నారు. పల్నాడు జిల్లాలోని ఆపరేటర్లు, హెల్పర్లు నరసరావుపేటలోని కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి, జేసీ సూరజ్ గనోరేకు వినతిపత్రమిచ్చారు. గుంటూరులో ఎండీయూ ఆపరేటర్లు అర్ధనగ్నంగా రోడ్డుపై కూర్చోని నిరసన తెలిపారు.ఇంటింటికి రేషన్ వ్యవస్థ రద్దు ఇకపై చౌక ధరల దుకాణాల్లోనే రేషన్ పంపిణీ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేసే ఎండీయూ వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. పేదలకు సార్టెక్స్ బియ్యం పంపిణీకి కోసం వినియోగించిన ఎండీయూలతో ఇప్పటివరకు రూ.1,801 కోట్లు ప్రభుత్వంపై భారం పడినట్లు తెలిపింది. ఈ ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఎండీయూ వ్యవస్థను తొలగిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ ఎక్స్అఫిషియో కార్యదర్శి సౌరభ్ గౌర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ నుంచి చౌక ధరల దుకాణాల్లోనే పేదలకు బియ్యం పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. రేషన్ డోర్ డెలివరీలో ఎండీయూలు విఫలమయ్యాయని, వీధి చివర్లో మాత్రమే రేషన్ పంపిణీ చేస్తున్న కారణంగా ఈ వ్యవస్థతో ఉపయోగం లేదని పేర్కొన్నారు. 2021 ఫిబ్రవరి నుంచి 2027 వరకు నిత్యావసరాల పంపిణీకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా 9,260 ఎండీయూ ఆపరేటర్లకు 90% సబ్సిడీకి వాహనాలను అప్పగించినట్లు చెప్పారు. ఇందులో పౌరసరఫరాల సంస్థ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆయా కార్పొరేషన్లతో ట్రైపార్టీ ఒప్పందం చేసుకోగా ఆ సమయంలో ఎండీయూ ఆపరేటర్లు ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయానికైనా తాము కట్టుబడి ఉంటామని అండర్టేకింగ్ సమర్పించారని చెప్పారు. ఎండీయూ వ్యవస్థ లబ్దిదారులకు సక్రమంగా బియ్యం పంపిణీ చేయని కారణంగా రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
కటాఫ్ డేట్తో సరుకుల కోత
♦ సరఫరా చేసింది 68 శాతమే ♦ 5శాతం మందికి వేలిముద్రల నిరాకరణ ♦ స్వయం సహాయక సంఘం సభ్యులతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ♦ నేటితో రేషన్ పంపిణీ బంద్ కర్నూలు : పౌర సరఫరా శాఖలో కొత్తగా తెచ్చిన బయోమెట్రిక్ విధానం కార్డుదారులకు ఓ పరీక్షగా మారింది. వేలిముద్రల ఆధారంగా సరుకుల పంపిణీ సమస్యగా మారిన నేపథ్యంలో రేషన్ పంపిణీకి కటాఫ్ తేదీ నిర్ణయించి కార్డుదారులకు ప్రభుత్వం శఠగోపం పెడుతోంది. గత నెల 15వ తేదీని రేషన్ సరఫరాకు కటాఫ్గా నిర్ణయించి 35 శాతం మందికి సరుకులు ఎగ్గొట్టింది. జూన్లో కూడా 18వ తేదీతో రేషన్ పంపిణీ నిలిపివేయాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ-పాస్ అమలవుతున్న కర్నూలు కార్పొరేషన్తో పాటు 9 మున్సిపాల్టీల పరిధిలో 458 చౌక డిపోలు, 2,61,487 కార్డుదారులున్నారు. అందులో 1,78,123 మంది కార్డుదారులకు మాత్రమే(68 శాతం) సరుకులు సరఫరా చేశారు. మిగిలిన 83,364(32 శాతం) మందిలో చౌక డిపోకు వచ్చి ఈ-పాస్ యంత్రంలో వేలిముద్రలు వేసినప్పటికీ వివిధ కారణాల చేత 13,468 మందికి(5 శాతం) సరుకులు అందలేదు. ఒక్కొక్క చౌక డిపోకు ఇద్దరు స్వయం సహాయక సభ్యులతో వారికి సరుకులు అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు జేసీ హరికిరణ్ వెల్లడించారు. 69,892 మంది కార్డుదారులు(27 శాతం) సరుకుల కోసం రెండు నెలలుగా రావడం లేదని అధికారులు తేల్చారు. వారు అసలైన లబ్దిదారులా లేక బోగస్ కార్డులా అనే విషయంపై అధికారులు పరిశీలిస్తున్నారు. పనిచేయని సర్వర్: ఈ-పాస్ విధానంలో సర్వర్ సరిగా పనిచేయక రేషన్ అందడం లేదని కార్డుదారులు వాపోతున్నారు. మే నెలలో సర్వర్ సక్రమంగా పనిచేయక రేష న్ పంపిణీ సక్రమంగా జరగలేదు. 66.57 శాతం మంది లబ్దిదారులు మాత్రమే ఈ-పాస్ మిషన్ల ద్వారా సరుకు లు తీసుకున్నారు. 87,320 మంది కార్డుదారులు వివిధ కారణాలతో మే నెల కోటా సరుకులు తీసుకోకుండానే అధికారులు క్లోజింగ్ బ్యాలెన్స్ చూపించారు. సరుకుల కోసం కార్డుదారులు చౌక డిపోల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే అధికారులు ఈ-పాస్ విధానం వల్ల రేషన్ మిగిలిందని ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నారు. ఐదు శాతం మంది వేలిముద్రల నిరాకరణ: చౌక దుకాణాల్లో వీకర్సెక్షన్ కాలనీలకు చెందిన ప్రజలే సరుకులు పొందలేకపోతున్నారు. పనులకు వెళ్తున్న వీరి వేలిముద్రలు ఈ-పాస్ మిషన్ నిరాకరిస్తుండటంతో సమస్యగా మారింది. జూన్ కు సంబంధించి 13,468 కార్డుదారుల వేలిముద్రలను ఈ-పాస్ మిషన్లు నిరాకరించడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. అయితే అందుకు 20వ తేదీ వరకు మాత్రమే గడువు విధించడం సరికాదని కార్డుదారులు వాపోతున్నారు.