breaking news
rasheed alvi
-
'అవేం మాటలు.. నిషేధం విధించండి'
న్యూఢిల్లీ: శివసేన పార్టీపై నిషేధం విధించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఆ పార్టీ రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తుందని, రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తుందని మండిపడింది. శివసేన పార్టీ అధినేత ఉద్దవ్ ఠాక్రే భారత్ ను హిందూ రాజ్యంగా ప్రకటించాలని డిమాండ్ చేయడంపట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత దేశం లౌకిక దేశం, రాజ్యాంగం కూడా లౌకికమనదే. అది ఎప్పటికీ మార్చలేం. ఉద్దవ్ ఠాక్రే మాటలు మొతతం కూడా దేశ రాజ్యాంగానికి విరుద్ధమైనవి. ఎన్నికల కమిషన్ వెంటనే ఈ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకొని దానిపై వెంటనే నిషేధం విధించాలి' అని కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్రమోదీ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. గురువారం 45 నిమిషాలపాటు చేసిన ప్రసంగంలో ఉద్దవ్ ఠాక్రే ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
ఎన్డీయేకు మద్దతివ్వం: డీఎంకే
న్యూఢిల్లీ: కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వాలని ఇతర పార్టీలను బీజేపీ ఆహ్వానించిన నేపథ ్యంలో పొత్తులపై చర్చ తీవ్రమైంది. ఎన్డీయేకు మద్దతిచ్చే విషయంలో బీజేడీ, అన్నాడీఎంకే బాటలోనే టీఆర్ఎస్ సాగుతోంది. ఫలితాలను బట్టి నిర్ణయం తీసుకోవడానికి వీలుగా అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. తెలంగాణ అభివృద్ధికి సహకరించే కూటమికే మద్దతిస్తామని, ఈ విషయంలో ఇప్పుడే ఏం చెప్పలేమని ఆ పార్టీ నేత కేటీఆర్ పేర్కొన్నారు. ఫలితాలను బట్టి ఎన్డీయేకు మద్దతుపై పార్టీలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు చెందిన డీఎంకే మాత్రం తాము ఎన్డీయే పక్షాన నిలిచేది లేదని తేల్చి చెప్పింది. గుజరాత్ అల్లర్లతో మచ్చ తెచ్చుకున్న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతు తెలిపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. తమిళనాడులో మైనారిటీలు తమకు అండగా ఉన్నారని, రాష్ర్ట ప్రయోజనాల దృష్ట్యా తాము ఎన్డీయేకు మద్దతివ్వలేమని ఆ పార్టీ నేత ఇలంగోవన్ తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ ఓ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. బీజేపీకి అధికారం దక్కకుండా చూసేందుకు లౌకికవాద పార్టీలన్నీ తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో ఏకం కావాలని పిలుపునిచ్చారు. బీజేపీకి ఈశాన్య పార్టీల కూటమి మద్దతు: కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడబోతోందని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ఆ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు వివిధ పక్షాలు ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా గురువారం ఈశాన్యరాష్ట్రాలకు చెందిన పదిపార్టీల ప్రాంతీయ కూటమి (ఎన్ఈఆర్పీఎఫ్) బీజేపీకి మద్దతు ప్రకటించింది. కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వంకోసం తమ కూటమి బీజేపీకి మద్దతు ఇస్తుందని నాగాలాండ్ ముఖ్యమంత్రి నైఫూ రియో తెలిపారు.