breaking news
rare problem
-
బర్త్‌డే స్పెషల్..అభిషేక్ బచ్చన్ గురించి ఈ విషయాలు తెలుసా?
-
ఆరోగ్యశ్రీతో బాలుడికి పునర్జన్మ
కడప రూరల్: ఎంతో మందికి పునర్జన్మను ప్రసాదిస్తున్న డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ తాజాగా ఓ పేద కుటుంబానికి చెందిన చిన్నారికి అండగా నిలిచింది. వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం బీరాన్ఖాన్పల్లెకు చెందిన షేక్ నూర్‌బాషా, చాందిని దంపతుల కుమారుడు హబీబ్(2)కు పుట్టుకతో మల విసర్జన ద్వారం ఏర్పడలేదు. ఈ సమస్య 5 వేల మంది చిన్నారుల్లో ఒకరికి వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో.. హబీబ్ తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఏరోజుకారోజు పనికి వెళ్తే గానీ జీవితం గడవని పరిస్థితుల్లో కుమారుడికి వైద్యమెలా చేయించాలా అని తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఇంతలో ఈ జబ్బుకు కూడా ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని వైద్యులు చెప్పడంతో.. ఎంతో సంతోషించిన వారు వెంటనే తమ కుమారుడిని కర్నూలుకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు మొదటి దశ సర్జరీ చేసి.. పెద్ద పేగును తీసి బయటకు పెట్టారు. ఆ తర్వాత కడపలోని కేసీహెచ్ ఆస్పత్రిలో కూడా దీనికి చికిత్స చేస్తారని తెలియడంతో అందులో చేర్పించారు. అక్కడి పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ సుకుమార్ పర్యవేక్షణలో వైద్య సిబ్బంది ఇటీవల రెండో సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. రూ.5 లక్షల వరకు ఖర్చయ్యే ఈ చికిత్స.. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా పూర్తవ్వడంతో హబీబ్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా తమ కుమారుడికి పునర్జన్మ లభించిందని.. వైఎస్ జగన్ ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటామంటూ వారు కృతజ్ఞతలు తెలిపారు. -
విచిత్ర శబ్దాల వింత జబ్బు
మనకు అప్పుడప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం వినిపిస్తుంది లేదా అలా అనిపిస్తుంది. ఆమెకు మాత్రం స్టెతస్కోప్ పెట్టుకొని వింటున్నట్టు లబ్ డబ్ అంటూ గుండె కొట్టుకోవడం చెవులకు నేరుగా వినిపించేది. అంతే కాదు తన అడుగుల శబ్దం తనకు కవాతు చేస్తున్న సైనికుల పదఘట్టనలా ఉండేది. తిన్న తిండి కడుపులోకి వెళ్లాక అక్కడి జీర్ణ వ్యవస్థలో జరిగే క్రియ పెద్ద బాయిలర్ చేసే శబ్దాల్లా వినిపించేవి. కనుగుడ్లు అటూ ఇటూ తిప్పితే నీళ్ల తొట్టిలో చెంబు పెట్టి గిలకొట్టినట్టు ఉండేది. తలలో ఎవరో వస్త్రాలు నేస్తున్నట్టుగా అనిపించేది. ఫలితంగా నిద్ర పట్టేది కాదు. ఇదంతా ఇండియానాకు చెందిన రాచెల్ పైన్ అనే 27 ఏళ్ల యువతి పరిస్థితి. గతేడాది మార్చి నెల నుంచి ఆమెకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇండియానాలోని మెరిల్విల్లీలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న రాచెల్ స్థానికంగా ఎంతోమంది వైద్యుల వద్దకు వెళ్లింది. ఇదో మానసికమైన జబ్బని వారు మందులు రాసిచ్చారు. అవి ఎంతకాలం వాడినా ఆమె పరిస్థితిలో మార్పు రాలేదు. అమెరికాలో సరైన వైద్యం దొరుకుతుందనే ఉద్దేశంతో ఇక్కడకు వచ్చింది. పలు ఆస్పత్రులకు వెళ్లింది. 9 మంది స్పెషలిస్టులను కలసింది. ఆమె జబ్బేమిటో ఏ డాక్టరూ కనిపెట్టలేక పోయారు. కొంతమంది మానసిక జబ్బని చెబితే, మరికొంత మంది 'మైగ్రేన్' వల్ల అలా అవుతుందని చెప్పారు. మందులిచ్చారు. అయినా ఏమీ మార్పులేదు. ఇక బతుకంతా అంతే.. చేయగలిగింది ఏమీ లేదంటూ కొంతమంది డాక్టర్లు పెదవి విరిచారు. ఏడు నెలల తర్వాత ఎక్కడైనా వైద్యం ఉండకపోతుందా అన్న విశ్వాసంతో రాచెల్ 'రోనాల్డ్ రీగన్ యూసీఎల్ఏ మెడికల్ సెంటర్' లోని హెడ్ అండ్ నెక్ సర్జరీ విభాగం అధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ క్వింటన్ గోపెన్ వద్దకు వెళ్లారు. ఆమె జబ్బుకు అక్కడ సమాధానం దొరికింది. 15 నిమిషాల్లోనే ఆ డాక్టర్ జబ్బేమిటో కనుక్కొన్నారు. చెవి అంతర్భాగానికి, మెదడుకు మధ్య రంధ్రం ఏర్పడడం వల్ల శరీరంలో జరిగే ప్రతి క్రియ, వాటికి సంబంధించిన శబ్దాలు చెవి ద్వారా మెదడుకు చేరుతాయని ఆయన వివరించారు. ఈ జబ్బును 'సిండ్రోమ్ సుపీరియర్ సెమీసర్క్యులర్ కెనాల్ డెహిసెన్స్ (ఎస్ఎస్సీడీ)' అని పిలుస్తారని చెప్పారు. ప్రతి ఐదు లక్షల మందిలో ఒక్కరికి ఇలాంటి సమస్య వస్తుందని, తమ ఆస్పత్రి గత ఐదేళ్లలో ఇలాంటి సమస్యతో బాధపడుతున్న దాదాపు 60 మందికి శస్త్ర చికిత్సలు చేసి నయం చేశామని తెలిపారు. డాక్టర్ ఇసాక్ యాంగ్ సహకారంతో డాక్టర్ గోపెన్ రాచెల్ పుర్రెను ఓపెన్ చేసి, మెదడును పక్కకు జరిపి అక్కడ ఏర్పడిన రంధ్రాన్ని 'బోన్ వ్యాక్స్'తో పూడ్చారు. రాచెల్ ఇప్పుడు అందరిలాగే హాయిగా ఉన్నారు. ఎలాంటి భయంకర శబ్దాలు ఆమెకు వినిపించడం లేదు. తన జబ్బేమిటో గుర్తించి సరైన చికిత్స అందించిన ఇద్దరు డాక్టర్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వైద్య చరిత్రలో 1998లో ఎస్ఎస్సీడీ అనే ఈ సిండ్రోమ్‌ను తొలిసారి కనుగొన్నారు.