breaking news
Raraju
-
భార్యతో కలిసి నటించిన యశ్ సినిమా.. ట్రైలర్ రిలీజ్
Yash Raraju Movie Trailer Launched By VV Vinayak: ‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్ హీరోగా నటించిన కన్నడ చిత్రం ‘సంతు: స్ట్రయిట్ ఫార్వార్డ్’. మహేశ్ రావు దర్శకుడు. ఈ సినిమాను సుబ్బారావు తెలుగులో ‘రారాజు’గా జూన్ ద్వితీయార్ధంలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను దర్శకుడు వీవీ వినాయక్ రిలీజ్ చేశారు. అనంతరం మాట్లాడుతూ – ‘‘పాతికేళ్లుగా పద్మావతి పిక్చర్స్‌పై సుబ్బారావుగారు ఎన్నో సినిమాలను రిలీజ్ చేశారు. ఇప్పుడు యశ్ కేజీఎఫ్‌కు ముందు చేసిన ఈ సినిమాను తెలుగులో 'రారాజు' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అని పేర్కొన్నారు. ‘‘యాక్షన్ ప్రధానాంగా సాగే చిత్రమిది. యశ్, ఆయన భార్య రాధిక పండిట్ కలిసి నటించారు. కన్నడంలో హిట్ సాధించినట్లే తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు నిర్మాత వీఎస్ సుబ్బారావు. ఈ చిత్రంలో కిక్ శ్యామ్, సీత, రవిశంకర్ తదితరులు నటించారు. ఈ మూవీ హరికృష్ణ సంగీతం అందించగా, ఆండ్రూ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. చదవండి: అలా ప్రచారం చేయడం సరి కాదు: కమెడియన్ అలీ నేను సింగిల్, కాదు మింగిల్.. ఏం చెప్పాలో తెలియట్లేదు: అనుపమ పరమేశ్వరన్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రారాజుగా తారక్?
రారాజు సుయోధన సార్వభౌముడు అనగానే... మన కళ్లల్లో తళుక్కున మెరిసే రూపం ‘ఎన్టీఆర్’. మూర్తీభవించిన రాజసంతో మదగజంపై రారాజుగా ఆ మహానటుడు వస్తోంటే... ప్రేక్షకులు పులకించిపోయారు. ‘ఆచార్యదేవా... ఏమంటివి ఏమంటివి...’ అంటూ ‘దానవీరశూర కర్ణ’లో అన్నగారు డైలాగులు చెబుతుంటే... వేదమంత్రాలు విన్నట్టు విన్నారు. తన అసమాన అభినయ కౌశలంతో దుర్యోధనుణ్ణి కూడా హీరోని చేసిన ఘనుడు ఎన్టీఆర్. రారాజుగా ఎన్టీఆర్ రూపం జన హృదయాల్లో నేటికీ స్థిరంగా నిలిచే ఉంది. అందుకే ఆ గెటప్‌లో కనిపించడానికి కూడా ఏ హీరో సాహసించడు. అప్పుడెప్పుడో ‘దేశోద్ధారకుడు’ సినిమాలో బాలకృష్ణ కాసేపు రారాజుగా కనిపించారు. అప్పుడు బాలయ్యలో కూడా ఎన్టీఆర్‌నే చూసుకున్నారు ప్రేక్షకులు. మళ్లీ ఇప్పుడు అలాంటి సాహసమే తారక్ చేస్తున్నాడని సమాచారం. ‘రామయ్యా వస్తావయ్యా’లో ఓ కీలక సన్నివేశంలో తారక్ రారాజుగా ఎన్టీఆర్ గెటప్‌లో కనిపిస్తారట. ‘యమదొంగ’లో అన్నగారి డైలాగు చెప్పి భేష్ అనిపించుకున్నాడు తారక్. మరి ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ గెటప్‌లోనే కనిపించబోతున్నాడు. ఆ సన్నివేశం మినహా ‘రామయ్యా వస్తావయ్యా’ షూటింగ్ మొత్తం పూర్తయింది. త్వరలోనే ఆ ఎపిసోడ్‌ని చిత్రీకరించడానికి దర్శకుడు హరీష్ శంకర్ సన్నాహాలు చేస్తున్నారట.