breaking news
Ram niwas goel
-
ఢిల్లీ అసెంబ్లీ నుంచి ఎర్రకోటకు రహస్య సొరంగం
Secret Tunnel In Delhi: ఢిల్లీ శాసనసభ వద్ద రహస్యం సొరంగాన్ని గుర్తించారు. ఈ సొరంగం శాసనసభ నుండి ఎర్రకోటను కలుపుతుందని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ వెల్లడించారు. స్వాతంత్య్ర సమర యోధులను తరలించేందుకు అప్పట్లో బ్రిటీస్ పాలకులు దీన్ని వినియోగించేవారని తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో ఈ ప్రదేశం చాలా గొప్ప చరిత్రను కలిగి ఉన్న దీన్ని పర్యాటకులు ,సందర్శకుల కోసం దీనిని పునరుద్ధరించాలని భావిస్తున్నామని ఆయన చెప్పారు. 1993లో తాను ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలో ఎర్రకోట వరకు వెళ్లే సొరంగం ఉందని వార్తలు వినిపించాయి. దాని చరిత్రను వెతకడానికి ప్రయత్నించాను. కానీ దానిపై ఎటువంటి స్పష్టత లభించలేదని గోయల్ తెలిపారు. అయితే ఆ సొరంగ ద్వారం ఇప్పుడు బయటపడిందని, మెట్రో ప్రాజెక్టులు, మురుగు నీటి వ్యవస్థల కారణంగా ఈ సొరంగ మార్గాన్ని మరింత తవ్వే ఉద్దేశం లేదని అన్నారు. 1912లో కోల్‌కతా నుండి దేశ రాజధానిని ఢిల్లీకి మార్చిన తర్వాత, అక్కడ అసెంబ్లీని 1926లో కోర్టుగా మార్చారని, స్వాతంత్య సమర యోధులను కోర్టుకు తీసుకువచ్చేందుకు బ్రిటీషర్లు ఈ సొరంగాన్నే వినియోగించేవారని చెప్పారు. ఉరిశిక్షలకు ఉపయోగించే గది ఉందని తెలుసు కానీ దాన్నేప్పుడూ తెరవలేదన్నారు. 75 వసంతాల స్వాతంత్ర్య ఉత్సవాల సందర్భంగా వారికి నివాళిగా ఆ గదిని స్వాతంత్య్ర సమరయోధుల మందిరంగా మార్చాలని తాము భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ఢిల్లీ శాసన సభకు చరిత్ర ఉన్న నేపథ్యంలో వచ్చే ఏడాది స్వతంత్య్ర దినోత్సవ వేడుకల నాటికి ఈ గదిని పర్యాటకుల కోసం తెరచి ఉంచాలని భావిస్తున్నానని చెప్పారు. ఇప్పటికే సంబంధిత పనులను ప్రారంభించినట్టు ఆయన వెల్లడించారు. A tunnel-like structure discovered at the Delhi Legislative Assembly. "It connects to the Red Fort. There is no clarity over its history, but it was used by Britishers to avoid reprisal while moving freedom fighters," said Delhi Assembly Speaker Ram Niwas Goel (2.09) pic.twitter.com/OESlRYik69 — ANI (@ANI) September 2, 2021 -
అసెంబ్లీ స్పీకర్‌కు బెయిలబుల్ వారెంట్
న్యూఢిల్లీ: అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్‌కు స్థానిక కోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2008లో అప్పటి బీజేపీ నేత అయిన గోయల్ అప్పడు జరిగిన నిరసన కార్య క్రమంలో భాగంగా ఢిల్లీలోని సీపీఐ(ఎమ్) కార్యాలయం ఆస్తుల ధ్వంసం కేసులో కోర్టుకు హాజరుకాకపోవడంతో ఈ వారెంటు జారీ చేశారు. ఈ అల్లర్లుకు సంబంధించి పోలీసులు గోయల్, కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌తోపాటు 21 మంది పేర్లు పేర్కొంటూ చార్జీషీట్ దాఖలు చేశారు. ఈ కేసుపై కోర్టులో హాజరుకావాల్సిందిగా గోయల్‌ను జడ్జీ ఆదేశించినా గైర్హాజరవడంతో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ శర్మ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. తదుపరి విచారణ మే 30కి వాయిదా వేశారు. -
న్యూఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రాంనివాస్ గోయల్ !
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనున్న నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్‌గా రాంనివాస్ గోయల్‌ను ఆప్ పార్టీ అగ్రనాయకత్వం ఎంపిక చేసినట్లు సమాచారం. అలాగే డిఫ్యూటీ స్పీకర్ పదవికి బంధనా కుమారికి కట్టబెట్టాలని నిర్ణయించారు. రాంనివాస్ గోయల్ షహద్రా, బంధనా కుమారి షాలిమార్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎంపికైయ్యారు. ఫిబ్రవరి 14న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా రామలీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ దిశగా ఇప్పటికే పనుల చకచకా సాగిపోతున్నాయి. ఫిబ్రవరి 7వ తేదీన 70 స్థానాలు గల హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో 67 స్థానాలను ఆప్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తన మంత్రి వర్గంలో ఎవరికి చోటు కల్పించాలన్న అంశంపై కూడా ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలలో ఆరవింద్ కేజ్రీవాల్ భేటీ అయి.. చర్చించిన విషయం విదితమే.