breaking news
Rajkumar (40)
-
'అతడు సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.. వరల్డ్‌కప్ టోర్నీకి రెడీ'
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీ తరపున విజయ్ హజారే ట్రోఫీ బరిలోకి దిగిన కోహ్లి.. తను ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగాడు.బుధవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆంధ్ర జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి శతక్కొట్టాడు. 299 పరుగుల భారీ లక్ష్య చేధనలో కింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ ఢిల్లీ బాయ్ కేవలం 101 బంతుల్లోనే 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 131 పరుగులు చేశాడు. కోహ్లికి ఇది 58వ లిస్ట్-ఎ సెంచరీ. అదేవిధంగా ఇదే మ్యాచ్‌లో16,000 లిస్ట్-ఏ పరుగుల మైలురాయిని కూడా కోహ్లి అధిగమించాడు. ఇప్పటికే టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన కోహ్లి.. ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్లలో మాత్రమే కొనసాగుతున్నాడు. అయినప్పటికి తనలో ఏ మాత్రం జోరు తగ్గలేదని కింగ్ నిరూపించుకుంటున్నాడు. వన్డే వరల్డ్‌కప్-2027కు తాను సిద్దంగా ఉన్నానని తన ప్రదర్శనలతోనే సాటిచెబుతున్నాడు. 2025లో కోహ్లి 13 వన్డేల్లో 65.10 సగటుతో 651 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. "విరాట్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో కనబరిన జోరునే విజయ్ హాజారే ట్రోఫీలోనూ కొనసాగిస్తున్నాడు.. తన అసాధారణ ప్రదర్శనతో ఢిల్లీకి విజయాన్ని అందించాడు. చాలా కాలం తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడినప్పటికి.. ఎక్కడా కూడా అతడిలో తడబాటు కన్పించలేదు. విరాట్ భారత జట్టులో అత్యంత నిలకడైన ఆటగాడు. అతడు వరల్డ్‌కప్ టోర్నీలో ఆడేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాడు" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్‌కుమార్ పేర్కొన్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ కోహ్లి దుమ్ములేపాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కోహ్లి 302 పరుగులు చేశాడు.చదవండి: అదరగొట్టిన రింకూ సింగ్, ధ్రువ్ జురెల్.. చెలరేగిన జీషన్ అన్సారీ -
మోసం కేసులో న్యాయవాది, సినీ దర్శకుల అరెస్ట్
టీ.నగర్ : రియల్ ఎస్టేట్ యజమాని వద్ద *17 లక్షలు మోసగించిన న్యాయవాది, సినీ దర్శకులను పోలీసులు అరెస్టు చేశారు. ఆవడి దేవినగర్ అన్నై థెరిస్సా వీధికి చెందిన రాజ్‌కుమార్ (40) రియల్ ఎస్టేట్ యజమాని. ఇతని వద్ద పట్టాభిరామ్, మోడ్రన్ సిటీ మూడవ వీధికి చెందిన న్యాయవాది శిఖామణి (47) న్యాయవాది ఉన్నారు. రాజ్‌కుమార్ వద్ద నగదు ఉన్నట్లు తెలుసుకున్న శిఖామణి దానిని అపహరించేందుకు పథకం పన్నాడు. దీంతో శిఖామణి స్నేహితులైన తిరుత్తణి, ఆర్ఎ పురం మేట్టు వీధికి చెందిన సినిమా అసిస్టెంట్ డెరైక్టర్ రమేష్ (29)అనే వ్యక్తి రాజ్‌కుమార్‌కు మార్చి 15వ తేదీ నుంచి హత్యా బెదిరింపులు చేశారు. సమాచారాన్ని న్యాయవాది శిఖామణికి రాజ్‌కుమార్ తెలిపాడు. దీంతో ఆవడి, రామలింగాపురం టీకేసీ వీధికి చెందిన శ్రీనివాసన్ (34) అనే చిత్ర దర్శకుడు ఉన్నారని అతనికి పోలీసు శాఖలో ఉన్నతాధికారులు తెలుసని వారి ద్వారా బెదిరింపులు చేసిన వ్యక్తిని పట్టుకుంటామని తెలిపారు. అయితే అందుకు అధికంగా ఖర్చు అవుతుందని రాజ్‌కుమార్‌కు శిఖామణి తెలిపాడు. ఆ తరువాత మీకు బెదిరింపులు చేసిన యువకుడిని మణిమంగళం సమీపంలో గత ఏప్రిల్ 18వ తేదీ హత్య చేశామని, ఆ ప్రాంతానికి చెందిన పోలీసు ఉన్నతాధికారి సాయంతో ఆ హత్యను రోడ్డు ప్రమాదంగా మార్చామని తెలిపారు. ఇందుకు పోలీసు అధికారులకు చాలా డబ్బు ఖర్చు చేశామని రాజ్‌కుమార్‌కు శిఖామణి తెలిపారు. తరువాత యువకుని హత్య చేసిన విషయం తల్లిదండ్రులకు తెలిసిందని వారిని శాంత పరిచేందుకు వారికి నగదు అందచేయాలని శిఖామణి తెలిపారు. ఈ విధంగా రాజ్‌కుమార్ వద్ద *17 లక్షలు తీసుకున్నట్టు తెలిసింది. ఇలా ఉండగా రాజ్‌కుమార్ వద్ద మళ్లీ నగదు అపహరించేందుకు ప్రయత్నించి తిరుత్తణి రమేష్ ద్వారా మరొక సెల్ఫోన్లో హత్యాబెదిరింపులు చేశారు. దీంతో అనుమానించిన రాజ్‌కుమార్ మణిమంగళంలో జరిగిన సంఘటన గురించి విచారించారు. దీని గురించి ఆ ప్రాంతం ఇన్స్పెక్టర్ తెలుపుతూ హత్యా సంఘటన జరగలేదని, మోసగించి డబ్బు అపహరించినట్లు తెలిపారు. దీంతో ఆవడి పోలీసుస్టేషన్లో రాజ్‌కుమార్ గురువారం ఫిర్యాదు చేశాడు. ఇన్స్పెక్టర్ విజయరాఘవన్ కేసు నమోదు చేసి విచారణ జరిపారు. దీంతో శిఖామణి, సినీ దర్శకుడు శ్రీనివాసన్, రమేష్‌లను అరెస్టు చేశారు. వీరిని గురువారం పూందమల్లి కోర్టులో హాజరు పరచి పుళల్ జైలులో నిర్బంధించారు.


