breaking news
rajiv killers
-
రాజీవ్ హంతకులను విడుదల చేయాలి : రజనీ
సాక్షి, చెన్నై : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేయాలని తమిళ నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానవతా దృక్పధంతో స్పందించి శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు హంతకులను విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజీవ్ హంతకులు తెలీదు అనడానికి తానేమి మూర్ఖుడిని కాదని.. ఈ విషయంపై గతంలో ఆయనపై వచ్చిన విమర్శలను రజనీ తిప్పికొట్టారు. మంగళవారం చెన్నైలో రజనీ ఓ సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎలాంటి పార్టీ అనేది ప్రజలే నిర్ణయిస్తారని.. ప్రతిపక్షాలను మాత్రం అది ప్రమాదకర పార్టీనే అని అన్నారు. ఇన్ని పార్టీలు, ఇంతమంది నేతలను ఎదుర్కొంటున్నాడంటే ప్రధాని మోదీ బలమైన నేతనే అని ఆయన కొనియాడారు. తానింకా పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రాలేదని ఈ సందర్భంగా రజనీ తేల్చిచెప్పారు. కాగా రాజీవ్ హంతకుల విషయంలో తమిళనాడు ప్రభుత్వం సానుభూతితో ఉన్నా.. కేంద్రం మాత్రం ససేమిరా అంటున్న విషయం తెలిసిందే. ఈ విషయం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. -
రాజీవ్ హంతకులు జైల్లోనే ఉండాలి: సుప్రీం
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హంతకులు జైల్లో ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజీవ్ హంతకులను విడుదల చేయాలంటూ తమిళనాడులోని జయలలిత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, ఆ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ ఆదేశాల ఫలితంగా మురుగన్, పెరారివాలన్, శాంతన్ సహా మొత్తం ఏడుగురు కుట్రదారులు జైల్లోనే ఉండాల్సి వస్తుంది. రాజీవ్ గాంధీ హత్య కేసును సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించింది. రాజ్యాంగ ధర్మాసనం పరిష్కరించాల్సిన పలు సవాళ్లతో ప్రధాన న్యాయమూర్తి జస్టస్ పి.సదాశివం నేతృత్వంలోని బెంచి ఓ జాబితా తయారుచేసింది. రాజీవ్ హంతకులను విడుదల చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా లేక రెండూ కలిసి నిర్ణయం తీసుకోవాలా అన్న విషయాన్ని కూడా నిర్ధారించాలని బెంచి కోరింది.