breaking news
Rajagopal Sathish
-
కేకేఆర్ మాజీ ప్లేయర్ సంచలన ఆరోపణలు.. 40 లక్షలు ఇస్తా.. మ్యాచ్ ఫిక్స్ చేయమన్నారు!
ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ మాజీ ఆటగాడు, తమిళనాడు ప్లేయర్ రాజ్‌గోపాల్ సతీశ్ సంచలన ఆరోపణలు చేశాడు. మ్యాచ్ ఫిక్స్ చేయమని తనకు 40 లక్షల రూపాయలు ఆశ చూపారని ఆరోపించాడు. ఈ మేరకు రాజగోపాల్ సతీశ్ బెంగళూరులో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా ఒకప్పుడు కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహించిన రాజగోపాల్ ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్ ఆడుతున్నాడు. ఇందులో భాగంగా చెపాక్ సూపర్ గల్లీస్ తరఫున అతడు బరిలోకి దిగాడు. ఈ నేపథ్యంలో పోలీసులను ఆశ్రయించిన 40 ఏళ్ల రాజగోపాల్ బన్నీ ఆనంద్ అనే వ్యక్తి తనను మ్యాచ్ ఫిక్స్ చేయాలని కోరాడని ఫిర్యాదు చేశాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం... ‘‘జనవరి 3న బన్నీ ఆనంద్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను సంప్రదించాడు. 40 లక్షలు రూపాయలు ఆఫర్ చేశాడు. ఇప్పటికే ఇద్దరు ఆటగాళ్లు ఈ ఆఫర్‌కు అంగీకరించారని చెప్పాడు’’అని రాజగోపాల్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయంపై స్పందించిన పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అనుమానితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: Ind Vs Sa 1st ODI: ధావన్‌కు షాక్... ఓపెనర్‌గా వెంకటేశ్ అయ్యర్! -
సెమీస్‌లో తమిళనాడు
► యూపీపై వికెట్ తేడాతో గెలుపు ► రాణించిన రాజగోపాల్ సతీష్ ► విజయ్ హజారే ట్రోఫీ బెంగళూరు: తమిళనాడు లక్ష్యం 50 ఓవర్లలో 169 పరుగులు... ఓ దశలో జట్టు స్కోరు 118/6... ఇక గెలవాంటే 51 పరుగులు చేయాలి. ఈ దశలో రాజగోపాల్ సతీష్ (38 బంతుల్లో 34 నాటౌట్; 6 ఫోర్లు) సంచలన బ్యాటింగ్ చేశాడు. చివరి వరుస బ్యాట్స్‌మెన్‌తో కలిసి కష్టంగా మారిన లక్ష్యాన్ని సులువుగా ఛేదించాడు. దీంతో విజయ్ హజారే టోర్నీలో భాగంగా గురువారం జరిగిన క్వార్టర్ఫైనల్లో తమిళనాడు వికెట్ తేడాతో ఉత్తర ప్రదేశ్‌పై నెగ్గింది. ఫలితంగా తమిళనాడు సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఉత్తర ప్రదేశ్ 48.2 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. రింకూ సింగ్ (60) మినహా మిగతా వారు విఫలమయ్యారు. బాలాజీ 3, అశ్విన్ 2 వికెట్లు తీశారు. తర్వాత తమిళనాడు 41.3 ఓవర్లలో 9 వికెట్లకు 169 పరుగులు చేసింది. ఇందర్జిత్ (48), మురళీ విజయ్ (33), శంకర్ (22) రాణించారు. గుజరాత్ ముందుకు ఆలూర్: లక్ష్య ఛేదనలో పార్థివ్ పటేల్ (57), అక్షర్ పటేల్ (36 నాటౌట్) వీరోచితంగా పోరాడటంతో మరో క్వార్టర్ఫైనల్లో గుజరాత్ 2 వికెట్ల తేడాతో విదర్భపై గెలిచి సెమీస్‌కు చేరింది. కేఎస్‌సీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచిన విదర్భ 48 ఓవర్లలో 195 పరుగులకు ఆలౌటైంది. ఫయాజ్ ఫజల్ (52), జితేష్ శర్మ (51), గణేశ్ సతీష్ (47) రాణించినా మిగతా వారు విఫలమయ్యారు. బుమ్రా 4, రుజుల్, అక్షర్ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత గుజరాత్ 48.1 ఓవర్లలో 8 వికెట్లకు 198 పరుగులు చేసింది. శనివారం జరిగే సెమీస్‌లో గుజరాత్.. తమిళనాడుతో తలపడుతుంది.