breaking news
Raging abuse
-
ఏయూ ర్యాగింగ్‌లో టీడీపీ నేతల కుమారులు?: ఎంపీ విజయసాయి రెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఏపీలో కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. చంద్రబాబు పాలనలో ఏయూ వర్సిటీలో మళ్లీ ర్యాగింగ్ రక్కసి పురుడు పోసుకుంది.. అక్కడ దారుణం జరుగుతున్నా ప్రభుత్వం నిద్రపోతుందా? అని ప్రశ్నించారు. టీడీపీ నాయకుల సుపుత్రులు కూడా ఉన్నట్టు తెలుస్తోందన్నారు.ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా..‘ఆంధ్ర యూనివర్శిటీలో కొంతకాలంగా లేని ర్యాగింగ్ రక్కసి మళ్లీ పురుడు పోసుకుని విద్యార్ధినిలు నేరుగా మీడియా ముందుకి రావడంతో బట్టబయలు అయ్యింది. హాస్టల్ రూమ్స్‌లో అసభ్యకరంగా డ్యాన్సులు చేయాలంటూ ఫస్టియర్ విద్యార్థినులపై దురుసుగా ప్రవర్తిస్తూ కొంతమంది సీనియర్లు ఇబ్బంది పెట్టి వీడియోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో కూడా పెట్టారు.ఆంధ్రయూనివర్శిటీలో కొంతకాలంగా లేని ర్యాగింగ్ రక్కసి మళ్లీ పురుడు పోసుకుని విద్యార్ధినిలు నేరుగా మీడియా ముందుకి బట్టబయలు అయ్యింది. హాస్టల్ రూమ్స్ లో అసభ్యకరంగా డ్యాన్సులు చేయాలంటూ ఫస్టియర్ విద్యార్థినులపై దురుసుగా ప్రవర్తిస్తూ కొంతమంది సీనియర్లు ఇబ్బంది పెట్టి వీడియోలు తీసి…— Vijayasai Reddy V (@VSReddy_MP) October 8, 2024దీనిపై స్పందించిన కాలేజీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. మాకు డ్యాన్స్ రాదని చెబితే.. అబ్బాయిల దగ్గరకు వెళ్లి నేర్చుకుని రమ్మని సీనియర్లు ఇబ్బంది పెట్టారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా 10 మంది విద్యార్థినులను 15 రోజుల పాటు సస్పెండ్ చేసింది. బాధిత విద్యార్ధినిల తల్లిదండ్రుల మనోవేదన అర్థం చేసుకోండి. టీడీపీ నాయకుల సుపుత్రులు కూడా దీనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. టీడీపీ ప్రభుత్వం నిద్రపోతుందా? అని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ, పవన్ సినీ పరిశ్రమ నుండి రాలేదా?: వైఎస్సార్సీపీ శ్యామల -
వినోదం.. కారాదు విషాదం!
సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్: ర్యాగింగ్.. సీనియర్లకు వినోదం, జూని యర్లకు ప్రాణసంకటం. మొదట సరదాగానే ఉన్నా పరిస్థితి చేయిదాటి ఒక్కోసారి విషాదంగా మారుతోంది. ఈ పరిస్థితి రాకుండా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే సీనియర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ర్యాగింగ్ వల్ల కలిగే అనర్ధాలను, శిక్షలను వివరించడంతో పాటు జూనియర్లతో స్నేహభావం కొనసాగించే విధానంపై అవగాహన కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. కోటి ఆశలతో కొత్త విద్యార్థులు.. పోస్టు గ్రాడ్యుయేషన్‌లో చేరాక విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి. భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలి. డిగ్రీ వరకు పరిస్థితి ఎలా ఉన్నా పీజీ స్థాయిలో విద్యార్థుల్లో స్నేహ సంబంధాలు కీలకం. జూనియర్, సీనియర్ అభ్యర్థుల మధ్య స్నేహం అవసరం. ర్యాగింగ్ వంటి చర్యలకు దూరంగా ఉండాలి. జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో మొదటి ఏడాది ప్రవేశాలు పూర్తి కావడం, వసతి గృహంలో సీట్లు కేటాయింపు కూడా పూర్తవడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎక్కువగా చేరారు. వీరంతా కొంచెం బిడియంతో ఉంటారు. ఈ సమయంలో ర్యాగింగ్ జరిగే ఆస్కారం ఉంటుంది. శ్రుతిమించితే కష్టమే.. అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం ర్యాగింగ్ నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా, గతంలో తరగతి గదులు, వసతి గృహాల్లో ర్యాగింగ్ జరిగిన సంఘటనలు ఉన్నా యి. జూనియర్ల బయోడేటాలు అడగటం, భోజనం సమయంలో ప్లేట్లు తీసుకువెళ్లడం వంటివి జరిగేవి. ఇవన్నీ సరదాగా సాగితే ఏ సమస్యా ఉండదు. పరిచయ కార్యక్రమం కాస్త శ్రుతిమించితేనే ఇబ్బందులు తప్పవు. కొందరు సీనియర్లు ర్యాగింగ్ పేరిట వికృత శ్రేష్టలు, నేరాలకు పాల్ప డితే సమస్యలు ఎదుర్కోక తప్పదు. కఠిన చర్యలు తప్పవు.. ఏపీలో ర్యాగింగ్ నియంత్రణ చట్టం–1997 ప్రకారం.. విద్యా సంస్థ లోపల, బయట ఎక్కడ ర్యాగింగ్ చేయకూడదు. భయపెట్టే చర్యలకు పాల్పడటం, అవమానించటం, వేధించటం, గాయపర్చటం వంటి చర్యలకు పాల్పడితే ఆరు నెలలు జైలు శిక్ష, వెయ్యి రూపాయల అపరాధ రుసుం విధిస్తారు. క్రిమినల్ చర్యలకు పాల్పడితే సంవత్సరం శిక్ష, రెండు వేల అపరాధ రుసుం కట్టాల్సి ఉంటుంది. క్రిమినల్ ఫోర్స్ వంటి నేరానికి పాల్పడితే రెండేళ్ల శిక్ష, ఐదు వేల జరిమానా విధిస్తారు. కిడ్నాప్, అత్యాచారానికి పాల్పడితే రూ.10 వేలు అపరాధ రుసుం, ఐదేళ్ల శిక్ష వర్తిస్తుంది. ర్యాగింగ్ కేసు నమోదైతే సదరు విద్యార్థిని కళాశాల నుంచి పంపించేస్తారు. ఇతర కళాశాలల్లో సైతం చేర్పించుకోరు. విద్యార్థిపై ఒక్కసారి ర్యాగింగ్ కేసు నమోదైతే విలువైన జీవితం ముగుస్తుంది. విద్యాసంస్థదే బాధ్యత.. సుప్రీం కోర్టు సూచనల నేపథ్యంలో విద్యాసంస్థలు ర్యాగింగ్ నియంత్రణకు పక్కాగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తిస్థా యి నియంత్రణలో విద్యాసంస్థదే బాధ్యత. ర్యాగింగ్ వ్యతిరేక కమిటీలు వేయాలి. వీటిలో సీనియర్, జూనియర్ విద్యార్థులను భాగస్వాములను చేయాలి. విద్యార్థులు, అధ్యాపకులు, బోధన సిబ్బంది కమిటీలో సభ్యులు గా ఉండాలి. ఐదుగురు నుంచి ఆరుగురితో కమిటీలు పక్కాగా నిర్వహించాలి. ప్రచార ఫ్లెక్సీలు ప్రదర్శించి అధికారుల ఫోన్ నంబర్లు పొందుపరిచాలి. వసతి గృహాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి. ధ్రువీకరణ తీసుకుంటున్నాం ర్యాగింగ్‌కు పాల్పడబో మని ప్రవేశ సమయంలో నే విద్యార్థుల ధ్రువీకరణ తీసకుంటున్నాం. వర్సిటీలో ర్యాగింగ్‌కు ఆస్కార మే లేదు. ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. వసతి గృహాల్లో నిరంతరం నిఘా పెట్టాం. అకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాం. విద్యార్థులు, బోధన సిబ్బందితో ర్యాగింగ్ నియంత్రణ కమిటీలు నియమిస్తున్నాం. ప్రిన్సిపాళ్లను అప్రమత్తం చేస్తున్నాం. –ప్రొఫెసర్ కూన రామ్‌జీ, వైస్ చాన్సలర్, బీఆర్‌ఏయూ అవగాహన కల్పిస్తున్నాం విద్యార్థులకు భవిష్యత్‌పై అవగాహన కల్పిస్తున్నాం. భవిష్యత్తు, జీవితం విలు వ తెలిసిన వారు ర్యాగింగ్‌కు పాల్పడరు. తరగతి గదులు, వసతి గృహంలో ర్యాగింగ్‌కు అవకాశం లేకుండా చర్యలు చేపడుతున్నాం. విద్యార్థులు ప్రశాం తంగా చదువుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాం. విద్యార్థులు వర్సిటీలోకి లక్ష్యాలతో అడుగు పెడతారు. వాటిని చేరుకోవాలంటే పట్టుదలతో చదవడం ఒక్కటే మార్గం. – ప్రొఫెసర్ కె,రఘుబాబు, రిజిస్ట్రార్, బీఆర్‌ఏయూ -
ర్యాగింగ్ వేధింపులకు విద్యార్థిని బలి!
కేకే.నగర్(చెన్నై): ర్యాగింగ్ వేధింపులకు ఓ విద్యార్థిని బలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రుల కథనం మేరకు.. తమిళనాడు, నీలగిరి జిల్లా కున్నూరు సమీపంలోని చిన్నకరుంపాళం ప్రాంతానికి చెందిన రాజా, జయలక్ష్మి దంపతుల కుమార్తె ప్రీతి(17). ఈరోడ్ జిల్లా సత్యమంగళం ప్రైవేటు కళాశాలలో సీఏ కోర్సులో గత నెల 22న చేరింది. అదే నెల 25న కళాశాల హాస్టల్ గదిలో ఉరివేసుకుని తనువు చాలించింది. ఈ విషయమై ప్రీతి తల్లిదండ్రులు గురువారం సత్యమంగళం పోలీసులు, ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె ఆత్మహత్యకు సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ కారణమని, హాస్టల్లో ఆమెను అన్నం తిననివ్వకుండా, నిద్ర పోనివ్వకుండా హింసించారని, రాత్రి రెండు గంటలకు తల స్నానం చేసి రమ్మని, తడిగుడ్డలతో వానలో నిలబెట్టి చిత్రహింసలకు గురిచేశారని చెప్పారు. ఈ విషయాలు ఆమె స్నేహితుల ద్వారా తెలిశాయన్నారు. గతనెల 25వ తేదీన చలి, జ్వరం ఉందంటూ హాస్టల్ నిర్వాహకులు ప్రీతిని కోయంబత్తూరు సత్యమంగళం ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారని, తాము బయలుదేరిన కొంత సేపటికే హాస్టల్ వార్డెన్ కోయంబత్తూరు వైద్య కళాశాలకు రమ్మని ఫోన్ కట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రీతి మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని, దీనిపై విచారణ చేయాలని కన్నీటిపర్యంతమయ్యారు. ఆర్డీవో స్పందిస్తూ.. విచారణ కమిటీ వేసి, నిజాలు నిగ్గుతేల్చుతామని హామీ ఇచ్చారు.