Quinton de Cock
-
సీఎస్కేతో మ్యాచ్.. కేకేఆర్ స్టార్ ఓపెనర్ పై వేటు! అతడి ఎంట్రీ?
ఐపీఎల్-2025లో కోల్‌కతా నైట్‌రైడర్స్ మరో కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా శుక్రవారం చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో కేకేఆర్ తలపడనుంది. గత మ్యాచ్‌లో లక్నోపై అనుహ్య ఓటమి చవిచూసిన కేకేఆర్.. ఇప్పుడు సీఎస్కేపై గెలిచి తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.వరుస మ్యాచ్‌ల్లో విఫలమవుతున్న స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్‌పై వేటు వేయాలని కేకేఆర్ మేనెజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అతడి స్దానంలో అఫ్గానిస్తాన్ ఓపెనర్ రెహ్మతుల్లా గుర్బాజ్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. అదేవిధంగా సీఎస్కేతో మ్యాచ్‌కు పేసర్ స్పెన్సర్ జాన్సెన్ను కూడా కేకేఆర్ పక్కన పెట్టనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. చెపాక్ పిచ్ ఎక్కువగా స్పిన్‌కు అనుకూలించనున్న నేపథ్యంలో స్పిన్ ఆల్‌రౌండర్ మోయిన్ అలీని తుది జట్టులోకి తీసుకురావాలని కేకేఆర్ కోచ్ అండ్ కెప్టెన్ భావిస్తున్నట్లు వినికిడి. కాగా ఈ ఏడాది సీజన్లో కేకేఆర్ మూడు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండింట మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కోల్‌కతా 4 పాయింట్లతో ఆరో స్ధానంలో కొనసాగుతోంది. మరోవైపు సీఎస్కే కెప్టెన్‌గా ఎంఎస్ ధోని తిరిగి బాధ్యతలు చేపట్టాడు. రెగ్యూలర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ నుంచి వైదొలగడంతో ధోని మరోసారి చెన్నై జట్టును నడిపించనున్నాడు. సీఎస్కేకు కూడా ఈ మ్యాచ్ చాలా కీలకం. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన సూపర్ కింగ్స్ కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. రుతురాజ్ స్ధానంలో రాహుల్ త్రిపాఠి తుది జట్టులో వచ్చే ఛాన్స్ ఉంది.తుది జట్లు(అంచనా)కేకేఆర్రెహ్మతుల్లా గుర్బాజ్, సునీల్ నరైన్, అజింక్యా రహానే, వెంకటేష్ అయ్యర్, మొయిన్ అలీ, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిసీఎస్కేరచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, ఖలీల్ అహ్మద్చదవండి: PSL 2025: వరుస షాక్‌లు.. పీఎస్ఎల్ నుంచి తప్పుకున్న మరో స్టార్ ప్లేయర్ -
సఫారీ దెబ్బకు ‘కంగారు’
లక్నో: మళ్లీ కంగారే! వన్డే వరల్డ్‌కప్‌లో ‘ఫైవ్ స్టార్’ చాంపియన్ ఆ్రస్టేలియా ఈ కప్‌లో ఓ కూనలా విలవిలలాడుతోంది. పసలేని బౌలింగ్, బాధ్యతలేని బ్యాటింగ్‌తో ఆ్రస్టేలియాకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. బవూమా సారథ్యంలోని దక్షిణాఫ్రికా జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో 134 పరుగుల తేడాతో ఆ్రస్టేలియాను బోల్తా కొట్టించి ఈ మెగా టోర్నీలో వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 311 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డికాక్ (106 బంతుల్లో 109; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) వరుసగా రెండో సెంచరీతో కదంతొక్కాడు. మార్క్రమ్ (44 బంతుల్లో 56; 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, మ్యాక్స్‌వెల్ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఆ్రస్టేలియా 40.5 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది. లబుõÙన్ (74 బంతుల్లో 46; 4 ఫోర్లు) టాప్‌స్కోరర్ కాగా, స్టార్క్ (27; 3 ఫోర్లు), కెపె్టన్ కమిన్స్ (22; 4 ఫోర్లు) 20 పరుగులు మించారంతే! రబడ (3/33) ఆసీస్‌ను చావుదెబ్బ తీయగా, జాన్సెన్, కేశవ్, షమ్సీ తలా 2 వికెట్లు పడగొట్టారు. ఓపెనర్ జోరు... దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్ టాపార్డర్‌తో కలిసి పటిష్టమైన భాగస్వామ్యాలు నమోదు చేశాడు. జట్టు భారీస్కోరుకు బాటవేశాడు. బవుమా (55 బంతుల్లో 35; 2 ఫోర్లు)తో తొలి వికెట్‌కు 108 పరుగులు, డసెన్ (30 బంతుల్లో 26; 2 ఫోర్లు)తో రెండో వికెట్‌కు 50 పరుగులు జోడించాడు. 90 బంతుల్లో సెంచరీ పూర్తయ్యాక డికాక్ జట్టు స్కోరు 197 పరుగుల వద్ద నిష్క్రమించాడు. అనంతరం మార్క్రమ్ అర్ధసెంచరీ సాధించడం, క్లాసెన్ (27 బంతుల్లో 29; 3 ఫోర్లు), జాన్సెన్ (22 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) ఇలా క్రీజులో వచ్చిన వారంత స్కోరు పెరిగేందుకు దోహదం చేయడంతో సఫారీ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ 300 పైచిలుకు స్కోరు చేసింది. లంకపై తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఏకంగా 428 పరుగులు చేసిన సంగతి తెలిసిందే! కంగారూ... కంగారూ... జోరు మీదున్న ప్రత్యర్థి, కొండంత లక్ష్యం ముందరుంటే ... మిచెల్ మార్ష్ (7), వార్నర్ (13), స్మిత్ (19)...ఆస్ట్రేలియా టాపార్డర్ స్కోరిది! ఇదికాస్తా 10 ఓవర్లలోపే కంగారూ, బేజారు కలగలిసి ఆసీస్ పరాజయానికి బీజం పడేలా చేసింది. రబడ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో అప్పటికే అనుభవజ్జుడైన స్మిత్‌ను అవుట్ చేసి తర్వాత జోష్ ఇంగ్లిస్ (5), స్టొయినిస్ (5)లను పట్టుమని పది పరుగులైనా చేయనివ్వలేదు. దీంతో ఆ్రస్టేలియా 70 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. లబుషేన్ నిలబడటంతో ఆస్ట్రేలియా ఆమాత్రం స్కోరు చేసింది. అంతేగానీ గెలిచేందుకు ఏ దశలో ఆడలేదు. భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ ఓడిన ఆ్రస్టేలియా తమ తదుపరి మ్యాచ్‌లో సోమవారం శ్రీలంకతో ఆడుతుంది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (బి) మ్యాక్స్‌వెల్ 109; బవుమా (సి) వార్నర్ (బి) మ్యాక్స్‌వెల్ 35; డసెన్ (సి) సబ్–అబాట్ (బి) జంపా 26; మార్క్రమ్ (సి) హాజల్‌వుడ్ (బి) కమిన్స్ 56; క్లాసెన్ (సి) ఇంగ్లిస్ (బి) హాజల్‌వుడ్ 29; మిల్లర్ (బి) స్టార్క్ 17; జాన్సెన్ (సి) వార్నర్ (బి) స్టార్క్ 26; రబడ (నాటౌట్) 0; కేశవ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 311. వికెట్ల పతనం: 1–108, 2–158, 3–197, 4–263, 5–267, 6–310, 7–311. బౌలింగ్: స్టార్క్ 9–1– 53–2, హాజల్‌వుడ్ 9–0–60–1, మ్యాక్స్‌వెల్ 10–1 –34–2, కమిన్స్ 9–0–71–1, జంపా 10–0– 70–1, మార్ష్ 1–0–6–0, స్టొయినిస్ 2–0–11–0. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: మార్ష్ (సి) బవుమా (బి) జాన్సెన్ 7; వార్నర్ (సి) డసెన్ (బి) ఇన్‌గిడి 13; స్మిత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రబడ 19; లబుõÙన్ (సి) బవుమా (బి) కేశవ్ 46; ఇంగ్లిస్ (బి) రబడ 5; మ్యాక్స్‌వెల్ (సి అండ్ బి) కేశవ్ 3; స్టొయినిస్ (సి) డికాక్ (బి) రబడ 5; స్టార్క్ (సి) డికాక్ (బి) జాన్సెన్ 27; కమిన్స్ (సి) మిల్లర్ (బి) షమ్సీ 22; జంపా (నాటౌట్) 11; హాజల్‌వుడ్ (సి) రబడ (బి) షమ్సీ 2; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (40.5 ఓవర్లలో ఆలౌట్) 177. వికెట్ల పతనం: 1–27, 2–27, 3–50, 4–56, 5–65, 6–70, 7–139, 8–143, 9–175, 10–177. బౌలింగ్: ఇన్‌గిడి 8–2–18–1, జాన్సెన్ 7–0–54–2, రబడ 8–1–33–3, కేశవ్ 10–0–30–2, షమ్సీ 7.5–0–38–2. ప్రపంచకప్‌లో నేడు న్యూజిలాండ్ X బంగ్లాదేశ్ వేదిక: చెన్నై మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
T20 WC 2021 PAK Vs RSA: శతక్కొట్టి దక్షిణాఫ్రికాను గెలిపించిన వాన్ డెర్ డస్సెన్
శతక్కొట్టి దక్షిణాఫ్రికాను గెలిపించిన వాన్ డెర్ డస్సెన్ వాన్ డెర్ డస్సెన్(51 బంతుల్లో 101 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) శతక్కొట్టడంతో పాక్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా సూపర్ విక్టరీ సాధించింది. పాక్ నిర్ధేశించిన 187 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆరంభంలో ఆచితూచి ఆడిన సఫారీలు.. ఆఖర్లో డస్సెన్, కెప్టెన్ బవుమా(46)లు చెలరేగి ఆడడంతో 6 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేశారు. హసన్ అలీ వేసిన ఆఖరి ఓవర్లో డస్సెన్ ఏకంగా 22 పరుగులు పిండుకుని సెంచరీ పూర్తి చేయడంతో పాటు జట్టును విజయతీరాలకు చేర్చాడు. పాక్ బౌలర్లలో ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది చెరో 2 వికెట్లు పడగొట్టారు. పాకిస్తాన్ భారీ స్కోరు.. సౌతాఫ్రికా టార్గెట్ 187 సౌతాఫ్రికాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ దుమ్మురేపింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. పాక్ బ్యాటింగ్‌లో ఫఖర్ జమాన్(52 పరుగులు, రిటైర్డ్‌హర్ట్), అసిఫ్ అలీ 32, షోయబ్ మాలిక్ 28 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబడ 3, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నోర్జ్టే చెరో వికెట్ తీశారు. 14 ఓవర్లలో పాకిస్తాన్ 114/3 14 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ 3 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్ 52, షోయబ్ మాలిక్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. 5 ఓవర్లలో పాకిస్తాన్ 32/1 దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 32 పరుగులు చేసింది. రిజ్వాన్ 15, ఫఖర్ జమాన్ 1 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు బాబర్ అజమ్(15) రబడ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ►2 ఓవర్లలో పాకిస్తాన్ వికెట్ నష్టపోకుండా 11 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్ 3, బాబర్ అజమ్ 9 పరుగులతో ఆడుతున్నారు. టి20 ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ మధ్య వార్మప్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. దక్షిణాఫ్రికా: టెంబా బావుమా (వికెట కీపర్), క్వింటన్ డి కాక్ (కెప్టెన్), ఐడెన్ మక్రమ్, రాసీ వాన్ డెర్ డసెన్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, డ్వైన్ ప్రిటోరియస్, కేశవ్ మహారాజ్, జార్న్ ఫోర్టిన్, లుంగీ న్గిడి, తబ్రేజ్ షమ్సీ, వియాన్ ముల్డర్, అన్రిచ్ నార్ట్జే, కాగిసో రబడ, రీజా హెండ్రిక్స్ పాకిస్తాన్ : మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), బాబర్ అజమ్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం, హసన్ అలీ, షహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, సర్ఫరాజ్ అహ్మద్ , మహ్మద్ నవాజ్, హైదర్ అలీ, మొహమ్మద్ వసీం జూనియర్ -
దుమ్మురేపిన ఓపెనర్లు; సఫారీ ఘన విజయం
డబ్లిన్: దక్షిణాఫ్రికా, ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. శుక్రవారం జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 70 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై జయభేరి మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు 50 ఓవర్లలో 4 వికెట్లకు 346 పరుగులు చేసింది. ఓపెనర్లు జేన్‌మన్ మలాన్ (169 బంతుల్లో 177; 16 ఫోర్లు, 6 సిక్స్‌లు), క్వింటన్ డికాక్ (91 బంతుల్లో 120; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) శతకాలతో చెలరేగారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 225 పరుగులు జోడించారు. ఛేజింగ్‌లో ఐర్లాండ్ 47.1 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. సిమీ సింగ్ సెంచరీ (91 బంతుల్లో 100 నాటౌట్; 14 ఫోర్లు)తో ఐర్లాండ్ గెలుపు కోసం ఒంటరి పోరాటం చేశాడు. ఫెలుక్వాయో, షమ్సీ చెరో మూడు వికెట్లు తీశారు. -
డి కాక్ సెంచరీ
దక్షిణాఫ్రికాకు భారీ ఆధిక్యం హోబర్ట్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులోనూ దక్షిణాఫ్రికా పట్టు బిగించింది. మ్యాచ్ మూడో రోజు సోమవారం దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్సలో 326 పరుగులకు ఆలౌటైంది. క్వింటన్ డి కాక్ (143 బంతుల్లో 104; 17 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా, బవుమా (74) రాణించాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 144 పరుగులు జోడించారు. ఆసీస్ బౌలర్లలో హాజల్‌వుడ్‌కు 6 వికెట్లు దక్కారుు. దక్షిణాఫ్రికాకు తొలి ఇన్నింగ్సలో 241 పరుగుల భారీ ఆధిక్యం లభిం చింది. అనంతరం రెండో ఇన్నింగ్స ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 121 పరుగులు చేసింది. బర్న్స్(0), వార్నర్ (45) అవుట్ కాగా... ఉస్మాన్ ఖాజా (56), స్మిత్ (18) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ మరో 120 పరుగులు వెనుకబడి ఉంది.