breaking news
quality products
-
చంద్రబాబు సొంత సంస్థ... హెరిటేజ్ పెరుగు ‘నాసిరకం’
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సొంత సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ బండారం మరోసారి బయటపడింది. ఆ కంపెనీ తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో నాణ్యత డొల్లేనని అధికారికంగా ఇంకోసారి స్పష్టమయింది. ‘టోటల్ కర్డ్’అంటూ హెరిటేజ్ సంస్థ విక్రయిస్తున్న పెరుగు నాసిరకమని, అందులో ఉండాల్సిన ఫ్యాట్ కనీస స్థాయిలో కూడా లేదని భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) స్పష్టం చేసింది. కనీస ఫ్యాట్ కూడా లేని హెరిటేజ్ పెరుగు నాసిరకమైనదని నిర్ధారిస్తూ ‘సబ్–స్టాండర్డ్’అనే ముద్ర వేసింది. ఇలాంటి ఉత్పత్తులు విక్రయిస్తున్నందుకు రూ.లక్ష జరిమానా చెల్లించాలని హర్యానాలోని ఎఫ్ఎస్ఎస్ఏఐ డిప్యూటీ కమిషనర్ (అడ్జుడికేటింగ్ అథారిటీ) ఆదేశించటంతో విధిలేక హెరిటేజ్ సంస్థ ఆ జరిమానాను చెల్లించింది. ఈ విషయాన్ని సెబీ నిబంధనల ప్రకారం స్టాక్ మార్కెట్‌కు తెలియజేయాలి కనక... గత నెలలో హెరిటేజ్ సంస్థ స్వయంగా తెలియజేసింది. ‘‘ఎఫ్ఎస్ఎస్ఏఐ మా పెరుగు శాంపిళ్లను పరిశీలించింది. కాకపోతే నిబంధనల ప్రకారం వాటిలో ఉండాల్సిన కనీస పాల–ఫ్యాట్ కూడా లేదని ఆ సంస్థ తేల్చింది. ఈ మేరకు మా కంపెనీకి జజ్జర్‌లోని ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి నోటీసు వచ్చింది. మాకు రూ.లక్ష జరిమానా విధించగా మేం దాన్ని చెల్లించాం’’అని హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ స్టాక్ మార్కెట్లకు తెలియజేసింది. ఈ జరిమానా చెల్లించటం వల్ల తమ కంపెనీపై ఆర్థికంగా పెద్దగా ప్రభావం పడదని కూడా కంపెనీ తెలియజేసింది. ఇదంతా ఒకెత్తయితే పెరుగులో పాలకు సంబంధించిన ఫ్యాట్ కనీస స్థాయిలో కూడా లేకపోవటంతో ఇది దేంతో తయారవుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ‘‘పాల–ప్యాట్‌లో ఏ చిన్న తేడాలున్నా అది సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయమే.అలాంటిది పెరుగులో కనీస స్థాయిలో కూడా మిల్క్ ఫ్యాట్ లేదంటే ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే పాలతోనే కదా పెరుగు తయారవుతుంది? అందుకే మేం తరచూ శాంపిళ్లు తీసుకుంటుంటాం. హెరిటేజ్ పెరుగు నాసిరకమని తేలటంతో జరిమానా కూడా విధించాం’’అని ఫుడ్ సేఫ్టీ వర్గాలు తెలియజేశాయి. వాస్తవానికి జరిమానా మొత్తం చిన్నదే. దానివల్ల కంపెనీపై ఆర్థికంగా ప్రభావమేమీ ఉండకపోవచ్చు.కానీ పాలు, పెరుగు వంటివి భారీ సంఖ్యలో జనం నిత్యం వాడే ఉత్పత్తులు. ‘‘వీటిలో నాణ్యత లేదంటే ... అది కంపెనీ ఉత్పత్తులపై నమ్మకాన్ని కూడా దెబ్బతీస్తుంది. దీర్ఘకాలంలో కంపెనీ మనుగడకు ఇలాంటి అంశాలు సవాళ్లు విసురుతాయి’’అని మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కంపెనీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిదని, ఉత్పత్తుల్లో నాణ్యత లేకపోవటం ఏమాత్రం సమ్మతం కాదని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
నాణ్యతతోనే ఉన్నత స్థానానికి
న్యూఢిల్లీ: భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు అత్యుత్తమ నాణ్యతా ఉత్పత్తులు, సేవలు సాయపడతాయని కేంద్ర వాణిజ్య, ఆహార మంత్రిత్వ శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రమాణాలు అనేవి పటిష్టమైన వ్యవస్థకు మద్దతుగా నిలవాలన్నారు. వీటిని భాగస్వాములతో విస్తృత సంప్రదింపుల తర్వాతే అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) వర్క్‌షాప్‌ను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. దేశ వాణిజ్యం, ఎగుమతులకు ప్రమాణాలు అనేవి మూలస్తంభంగా పేర్కొన్నారు. ఆవిష్కరణలు, సామర్థ్యం జాతీయ వృద్ధికి మద్దతుగా నిలుస్తాయన్నారు. సుస్థిరత, నకిలీ ఉత్పత్తుల కట్టడి, ఎంఎస్ఎంఈలకు మద్దతు, స్టార్టప్‌లు మరింత పోటీనిచ్చేందుకు వీలుగా.. ప్రమాణాలు ఉండేలా చూడాల్సిన బాధ్యత బీఐఎస్ సాంకేతిక కమిటీ సభ్యులపై ఉందన్నారు. భారతీయ ప్రమాణాలు ఆధునిక టెక్నాలజీ పురోగతికి అనుగుణంగా, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు ఉండేలా చూడాలని కోరారు. అప్పుడే ప్రపంచానికి తయారీ కేంద్రంగా, స్వావలంబన భారత్‌గా మారాలన్న స్వప్నం సాకారమవుతుందన్నారు. బీఐఎస్‌లో 400 స్టాండింగ్ కమిటీలు భారత ప్రమాణాల రూపకల్పన బాధ్యతను చూస్తుంటాయి. -
ప్రకతి సేద్యంతో నాణ్యమైన ఉత్పత్తులు
ప్రకతి సేద్యంతో నాణ్యమైన ఉత్పత్తులు, natural, cultivation, quality products యలమంచిలి: జీరో బడ్జెట్ (పెట్టుబడిలేని) ప్రకతి వ్యవసాయమే మేలని వ్యవసాయాధికారులు అభిప్రాయపడ్డారు. పెట్టుబడిలేని ప్రకతి వ్యవసాయంపై సోమవారం కొత్తలిలో రైతులకు వ్యవసాయాధికారులు శిక్షణ ఇచ్చారు. దీనిని పర్యవేక్షించడానికి వచ్చిన డీపీఎం లక్ష్మణరావు, మండల ప్రత్యేకాధికారి సురేష్‌బాబు మాట్లాడుతూ ప్రకతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యకరమైన, నాణ్యమైన ఆహార ఉత్పత్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడిన అధికారులు ఎవరైతే సేంద్రియ వ్యవసాయం అనుసరిస్తున్నారో వారికి ఉచితంగా కూరగాయల విత్తనాలు, వ్యవసాయ నిపుణులచే చెప్పిన వీడియో పాఠాల సీడీలు అందజేశారు. ప్రకతి వ్యవసాయ విధానంపై యలమంచిలి వ్యవసాయాధికారి వి.మోహనరావు రైతులకు ప్రయోగాత్మకంగా వివరించారు. రసాయనిక, సేంద్రియ సాగు వల్ల జరుగుతున్న అనర్ధాల గురించి తెలియజేశారు. దిగుబడి పెరగడానికి జీరో బడ్జెట్ సేద్యమే రైతులకు ఉపయోగపడుతుందన్నారు. పెట్టుబడి పెరిగి గిట్టుబాటు ధరలేక రైతులు నష్టపోతున్న రసాయనిక వ్యవసాయం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదన్నారు. జీరో బడ్జెట్ వ్యవసాయం పూర్తిగా స్వదేశీ విధానమని తెలిపారు. రసాయనిక వ్యవసాయాన్ని రైతులు మానుకోవాలని సూచించారు. ప్రస్తుత వ్యవసాయ సంక్షోభాన్ని శాస్వతంగా పరిష్కరించడానికి నాటు ఆవుతో పెట్టుబడిలేని ప్రకతి సేద్యం అవస్యమన్నారు. ఘనజీవామతం తయారీ విధానాన్ని ప్రయోగాత్మకంగా రైతులకు తెలియజేశారు. రైతుల సందేహాలను వారికి అర్ధమయ్యే విధంగా నివత్తిచేశారు. కార్యక్రమంలో ఏఈఓ దేముడు, కొత్తలి ఎంపీటీసీ ఇత్తంశెట్టి రాజు, మర్రి సూరిబాబు, రైతులు పాల్గొన్నారు. 25వైఎల్‌ఎం06: కొత్తలిలో ఆవు ప్రయోజనాలు వివరిస్తున్న వ్యవసాయాధికారులు


