breaking news
pyalakurthi
-
భర్తను వేట కొడవలితో నరికి చంపిన భార్య
-
భర్తను వేట కొడవలితో నరికి చంపిన భార్య
కర్నూలు : కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తనే...ఓ భార్య దారుణంగా హతమార్చిన సంఘటన కోడుమూరు మండలం ప్యాలకుర్తిలో చోటుచేసుకుంది. నిద్రిస్తున్న భర్త గొల్ల సంజన్నను ... భార్య చిట్టెమ్మ వేట కొడవలితో నరికి చంపిన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. గత అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో భర్త అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ అలికిడి విని లేచిన సొంత తల్లిని కూడా ఆమె వదలలేదు. తల్లి లక్ష్మీదేవిపైనా దాడి చేసింది. కాగా చిట్టెమ్మ, సంజన్న తరచూ గొడవపడుతుండేవారని స్థానికులు చెబుతున్నారు. గాయపడిన లక్ష్మీదేవి ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో కోలుకుంటోంది. కాగా కుటుంబ కలహాల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలిస్తున్నారు.