breaking news
Putta Naresh
-
కాలిఫోర్నియాలో కృష్ణాజిల్లా విద్యార్థి గల్లంతు
విజయవాడ: అమెరికా కాలిఫోర్నియాలోని లివర్మోర్ నదిలో ఓ తెలుగు విద్యార్థి గల్లంతయ్యాడు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెంకు చెందిన పుట్టా నరేష్ కాలిఫోర్నియా యూనివర్సిటిలో ఎమ్మెస్సీ సెకండియర్ చదువుతున్నాడు. పరీక్షలు పూర్తవడంతో స్నేహితులతో కలిసి అతడు విహార యాత్రకు వెళ్లాడు. ఈ సందర్భంగా పడవలో షికారుకు వెళ్లిన నరేష్ ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. నరేష్ కోసం నదిలో గాలింపు కొనసాగుతోంది. కుమారుడు గల్లంతు అయిన వార్త తెలుసుకున్న నరేష్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అతడి తల్లిదండ్రులు అమెరికా వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. -
అమెరికాలో తెలుగు విద్యార్థి గల్లంతు
యూఎస్ఏలో తెలుగు విద్యార్థి ఒకరు నదిలో మునిగి గల్లంత య్యారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామానికి చెందిన పుట్టా నరేష్ కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఎంఎస్ సెకండియర్ చదువుతున్నాడు. ఆదివారం అతడు మిత్రులతో కలిసిలివర్మోర్ నదిలో పడవ షికారుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడటంతో అతడు నదిలో పడి గల్లంతయ్యాడు. నరేష్ కోసం గాలింపు కొనసాగుతోందని కుటుంబసభ్యులు తెలిపారు.