breaking news
Pushkar baths
-
జీడిపల్లికి పుష్కర శోభ
బెళుగుప్ప: కృష్ణా పుష్కరాల్లో భాగంగా మండల పరిధిలోని జీడిపల్లి రిజర్వాయర్ పుష్కర శోభను సంతరించుకుంది. రిజర్వాయర్లో ఏర్పాటు చేసిన ఘాట్లో పవిత్ర పుష్కర స్నానాలను ఆచరించడానికి ఆదివారం వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జిల్లా వాసులతో పాటు కర్ణాటక ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. పుష్కరాలకు వచ్చు భక్తులకు ఆదివారం మండల పరిధిలోని నక్కలపల్లి గ్రామస్తులు భోజన వసతిని కల్పించారు. ప్రతి రోజూ మండల పరిధిలోని ఒక గ్రామం తరుపున భోజన వసతి కల్పనకు ముందుకు వచ్చారని అధికారులు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపాలని, రిజర్వాయర్ వద్ద మరిన్ని సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. -
బాబ్లీ వదిలినా భరోసా లేదు..!
వరుణుడు కరుణిస్తేనే బాసర వద్ద పుష్కర స్నానాలు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: గోదావరి నది ఖమ్మం జిల్లా భద్రాద్రి వద్ద పరవళ్లు తొక్కుతుంటే.. ఆదిలాబాద్ జిల్లా బాసర వద్ద మాత్రం ఇప్పటికీ ఎడారినే తలపిస్తోంది. ఎగువన మహారాష్ట్రలో ఆశించిన మేరకు వర్షాలు కురవకపోవడంతో నదిలో వరద నీరు వచ్చి చేరలేదు. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎస్సారెస్పీ నీటి మట్టం కూడా అంతగా పెరగలేదు. ప్రస్తుతం 1,057.6 అడుగుల నీటి మట్టం ఉంది. అంటే ఈ ప్రాజెక్టులో కనీసం మత్తడి లేవల్ వరకు కూడా నీరు రాలేదు. ఎస్సారెస్పీకి 80 శాతం క్యాచ్మెంట్ ఏరియా మహారాష్ట్రలో ఉంది. సుమారు ఐదు శాతం కర్నాటకలో ఉండగా, మిగిలిన 20 శాతం ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఉంటుంది. ఈ రెండు జిల్లాలో వారం రోజులుగా కొంత మేరకు వర్షపాతం నమోదైనప్పప్పటికీ, మహారాష్ట్ర, కర్నాటకల్లో ఆశించిన మేరకు వర్షాలు కురవకపోవడంతో నీటి ప్రవాహం కనిపించడం లేదు. రానున్న పది రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే జూలై 14 నుంచి ప్రారంభం కానున్న పుష్కర స్నానాలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయని నీటి పారుదల శాఖ అధికారులు భావిస్తున్నారు. జూలై మొదటి వారం తర్వాతే నీటిమట్టం విషయంలో పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.