Purchase of helicopters
-
'అగస్టా' కేసులో గవర్నర్‌ను విచారించిన సీబీఐ
-
గవర్నర్‌ను విచారిస్తున్న సీబీఐ అధికారులు
-
గవర్నర్‌ను విచారిస్తున్న సీబీఐ అధికారులు
హైదరాబాద్ : అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం కేసులో గవర్నర్ నరసింహన్‌ను సీబీఐ అధికారులు బుధవారం విచారిస్తున్నారు. రాజ్‌భవన్‌లో ఆయనను సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. నరసింహన్ వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేయనున్నారు. నరసింహన్‌ను కీలక సాక్షిగా సీబీఐ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. 2005 లో ఈ ఒప్పందం కుదిరినప్పుడు నరసింహన్ కేంద్ర ఐబి చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. 2005 మార్చి ఒకటిన జరిగిన కీలక సమావేశంలో వీరిచ్చిన నివేదికలు కీలకమయ్యాయని సీబీఐ భావిస్తోంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన సీబీఐ అధికారుల బృందం గవర్నర్ ఇచ్చే వివరాలను సేకరించనుంది. ఈ కేసులో ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ మార్షల్ ఎస్పీ త్యాగీతో పాటు మరో 13 మందిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 3,700 కోట్ల రూపాయలకుపైబడి ఈ హెలికాప్టర్ల కొనుగోలు వ్యవహారంలో ఇప్పటికే పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ ఎంకె నారాయణన్, గోవా మాజీ గవర్నర్ వాంఛూలను సీబీఐ ప్రశ్నించిన విషయం తెలిసిందే. హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం కుదిరినప్పుడు నారాయణన్ జాతీయ భద్రతా సలహాదారుగా వాంఛూ ఎస్పీజీ చీఫ్‌గా కొనసాగారు. సీబీఐ విచారణ అనంతరం వారు తమ పదవులకు రాజీనామా చేశారు. -
అగస్టా కేసులో నరసింహన్‌ను ప్రశ్నించనున్న సీబీఐ
హైదరాబాద్: అగస్టావెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం కేసులో సాక్షిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వాంగ్మూలాన్ని రికార్డు చేయడానికి సీబీఐ సిద్ధమవుతోంది. త్వరలోనే ఆయన వాంగ్మూలం రికార్డు చేస్తారని వార్తలొచ్చినప్పటికీ బుధ వారమే ఆయన్ను సీబీఐ ప్రశ్నించే అవకాశాలున్నాయి. హెలికాప్టర్ల కొనుగోలు వ్యవహారంలో ఇప్పటివరకు ఇద్దరు గవర్నర్లను విచారించగా నరసింహన్ మూడో వ్యక్తి అవుతారు. 3,700 కోట్ల రూపాయలకుపైబడి ఈ హెలికాప్టర్ల కొనుగోలు వ్యవహారంలో ఇప్పటికే పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ ఎంకె నారాయణన్, గోవా మాజీ గవర్నర్ వాంఛూలను సీబీఐ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ విచారణ వల్లే వారిద్దరు తమ పదవులకు రాజీనామా చేశారు. హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం కుదిరినప్పుడు నారాయణన్ జాతీయ భద్రతా సలహాదారుగా వాంఛూ ఎస్పీజీ చీఫ్‌గా కొనసాగుతున్నారు. 2005 లో ఈ ఒప్పందం కుదిరినప్పుడు నరసింహన్ కేంద్ర ఐబి చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. 2005 మార్చి ఒకటిన జరిగిన కీలక సమావేశంలో వీరిచ్చిన నివేదికలు కీలకమయ్యాయని సీబీఐ భావిస్తోంది. ఈ కేసులో ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ మార్షల్ ఎస్పీ త్యాగీతో పాటు మరో 13 మందిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆనాడు జరిగిన వ్యవహారాలపై నరసింహన్‌ను సీబీఐ ప్రశ్నించవచ్చు. నరసింహన్‌ను కీలక సాక్షిగా సీబీఐ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. కాగా, గవర్నర్లను తప్పించాలన్న ఆలోచనతో ఉన్న కేంద్ర ప్రభుత్వం అందులో భాగంగానే ఒత్తిడి పెంచడానికే ఈ రకంగా చేస్తున్నట్టు నరసింహన్ సన్నిహితులు చెబుతున్నారు. -
ఎన్డీఏ హయాంలోనే ‘అగస్టా’
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణం మూలాలు గత ఎన్డీఏ ప్రభుత్వ హయాంనాటివని తేలింది. అగస్టా కంపెనీ నుంచి 12 వీవీఐపీ చాపర్ల కొనుగోలు ఒప్పందంలో అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరుగుతుండడం తెలిసిందే. బిడ్డింగ్‌లో అగస్టా కంపెనీ పాల్గొనేలా చేసేందుకు చాపర్లు ఎగరాల్సిన ఎత్తు పరిమితిని 6వేల మీటర్ల నుంచి 4500 మీటర్లకు తగ్గించారన్నది ప్రధాన ఆరోపణ. ఎన్డీఏ అధికారంలో ఉన్న 2003లోనే ఈ ఎత్తు తగ్గింపుపై సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారన్న విషయంవెల్లడైంది. ఇటీవల మాజీ గవర్నర్లు ఎంకే నారాయణన్, బీవీ వాంఛూ(ఎస్పీజీ మాజీ చీఫ్)లను సీబీఐ ప్రశ్నించిన సందర్భంగా ఈ విషయం వారు సీబీఐకి స్పష్టం చేశారు. 2003లో పీఎంఓ అధికారుల భేటీలో ప్రధాని రక్షణ బాధ్యతలు చూసే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌ను సంప్రదించి ‘ఎత్తు తగ్గింపు’పై నిర్ణయం తీసుకున్నట్లు వాంఛూ చెప్పారని అధికార వర్గాలు తెలిపాయి. వాంఛూ వెల్లడించిన అంశాల్లో.. ఎన్డీఏ హయాంలో భద్రతాసలహాదారుగా ఉన్నబ్రజేశ్ మిశ్రా కూడా ‘ఎత్తు తగ్గింపు’ను సమర్థించారన్న విషయమూ ఉందన్నాయి.