breaking news
punadipadu
-
ఐటీ అధికారుల పేరుతో రూ. 17.5 లక్షల దోపిడి
కంకిపాడు: కృష్ణాజిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు చెరువు కట్టపై ఇన్‌కంటాక్స్ అధికారుల పేరుతో కైకలూరుకు చెందిన చేపల వ్యాపారి చొక్కరపు శ్రీనివాస్ నుంచి 17.5 లక్షల రూపాయలు దోచుకెళ్లారు. ఈ సంఘటన సోమవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. శ్రీనివాస్ వ్యాపార లావాదేవీలు ముగించుకుని 17.5 లక్షల రూపాయల నగదుతో కారులో కంకిపాడు మీదుగా కైకలూరుకు బయలుదేరారు. పునాదిపాడు చెరువు కట్టపైకి వచ్చేసరికి వెనుకనుంచి ఎర్ర బుగ్గ కారు ఓవర్టేక్ చేసి వచ్చి కారును ఆపారు. తాము ఇన్‌కంటాక్స్ డిపార్ట్మెంట్కు చెందిన వారమని, కారును తనిఖీ చేయాలని చెప్పారు. సూట్‌కేసులో ఉన్న 17.5 లక్షల రూపాయలను వారు తీసుకుని , ఈ మొత్తానికి లెక్క చెప్పాల్సి ఉంటుందని... తమ వెంట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు రమ్మని చెప్పారు. అనంతరం సదరు నగదు ఉన్న సూట్‌కేసును తీసుకుని వారు తమ కారులో బయలుదేరారు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత ఎర్ర బుగ్గ ఉన్న కారు వేగం పెంచి మరోదారిలో వెళ్లి కనుమరుగయ్యారు. తాను మోసపోయానని భావించిన శ్రీనివాస్ వన్ టౌన్ సీఐకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా సదరు రహదారిలోని సీసీ కెమెరా ఫూటేజ్ లను పోలీసులు పరిశీలిస్తున్నారు. -
అడ్డొచ్చాడని కొట్టి చంపాడు
-
అడ్డొచ్చాడని కొట్టి చంపాడు
కంకిపాడు : ఎదురెదురుగా వస్తున్న టీవీఎస్, సైకిల్ ఢీకొనడంతో.. వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన సైకిలీస్ట్ టీవీఎస్ పై ఉన్న వ్యక్తిని తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆస్పత్రి పాలైన వాహనదారుడు చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఈ సంఘటన కృష్ణాజిల్లా కంకిపాడు మండలం పునాదిపాడులో చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి పునాదిపాడు సెంటర్లో టీవీఎస్పై వెళ్తున్న పొల్లూరు సాంబశివారావు (40) అనే వ్యక్తికి సైకిల్ పై వెళ్తున్న కిరణ్ ఎదురుగా వచ్చి ఢీకొట్టాడు. దాంతో వారి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కోపోద్రిక్తుడైన కిరణ్.. సాంబశివరావుపై దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలైన సాంబశివరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సెంటర్లో ఉన్న సీసీ టీవీ కెమరా ఫూటేజిల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.