breaking news
Protesting rally
-
కోల్‌కతాలో 150 మంది మాజీ టీచర్ల అరెస్ట్
కోల్‌కతా: ఉద్యోగాలు కోల్పోయి నిరసనకు దిగిన సుమారు 150 మంది ఉపాధ్యాయులను కోల్‌కతా పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. తమలో అర్హులైన వారిని శాశ్వత ప్రాతిపదికన తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మళ్లీ ఎంపిక పరీక్ష పెడతామంటూ పశి్చమ బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిరసన తెలిపేందుకు సెక్రటేరియట్ వైపు ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని 100 మందిని అరెస్ట్ చేశారు. కోల్‌కతాలోని సెంట్రల్ పార్క్ వద్ద కూడా మరో 500 మంది మాజీ ఉపాధ్యాయులు ఇదే డిమాండ్‌తో ఆందోళన చేపట్టారు. అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో సాల్ట్‌లేక్, ఎస్‌ప్లనేడ్‌ల వద్ద వందలాది మంది టీచర్లు నిరసనకు దిగారు. సెక్రటేరియట్ వైపు వెళ్తున్న వీరిని పోలీసులు ఆపేశారు. తమ పరిస్థితిని వివరించేందుకు సీఎం మమతా బెనర్జీ అపాయింట్మెంట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. సాల్ట్‌లేక్ వద్ద 500 మంది మాజీ ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. అయితే, టీచర్లు షర్టులు తీసేసి ర్యాలీ చేపట్టడాన్ని పోలీసులు అనుమతించలేదు. కోల్‌కతా హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సెంట్రల్ పార్క్ వద్ద నిరసన చేపట్టేందుకు వీరికి వీలు కలి్పంచారు. అయితే, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేందుకు యత్నించిన 50 మంది మాజీ టీచర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మహిళా పోలీసులతో జరిగిన తోపులాటలో కాలికి గాయమైన ఓ మాజీ ఉపాధ్యాయినిని ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించామన్నారు. రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యాలయం వద్ద గత 22 రోజులుగా కొందరు బాధితులు నిరసన సాగిస్తున్నారు. 2016లో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు చేపట్టిన ఎంపిక పరీక్షల్లో తీవ్ర స్థాయిలో అక్రమాలు జరిగాయని తేలడంతో సుప్రీంకోర్టు ఏప్రిల్ 3వ తేదీన మొత్తం 25,753 మంది టీచర్ల నియామకాలు చెల్లవంటూ సంచలన తీర్పు వెలువరించడం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం గురువారం 40 వేల టీచర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసిన అనుభవమున్న టీచర్లకు ఈ పరీక్షలో అదనంగా మార్కులుంటాయని ప్రకటించింది. -
సన్‌ఫ్లవర్ ధరపై సమస్య..జాతీయ రహదారిని నిర్బంధించిన రైతులు
హరియాణా:సన్ఫ్లర్ (పొద్దుతిరుగుడు) పంటకు కనీస మద్దతు ధర ఇవ్వకపోవడంపై హరియాణాలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంలో సీఎం మంజూరు చేసిన రిలీఫ్ ఫండ్ తక్కువగా ఉందని రోడ్లపైకి వచ్చారు. కురుక్షేత్ర జిల్లాలో నిర్వహించిన మహాపంచాయత్ తీర్మాణం మేరకు ఢిల్లీకి వెళ్లే జాతీయ రహదారిపై రైతులు బైటాయించారు. దీంతో ఆ మార్గంలో వాహనాలను దారి మళ్లించారు ట్రాఫిక్ పోలీసులు. హరియాణాలో సన్‌ఫ్లవర్‌కు కనీస మద్దతు లభించడంలేదు. మద్దతు ధర లభించని పంటలకు రాష్ట్రంలో భవంతర్ భర్తీ యోజన(బీబీవై) కింద రిలీఫ్ ఫండ్‌ను ప్రభుత్వం ఇస్తోంది. అయితే. ఈ ఏడాదికి 36,414 ఎకరాల్లో సాగు చేసిన సన్‌ఫ్లవర్ పంటకు రూ.29.13కోట్లను విడుదల చేశారు సీఎం మనోహర్ పారికర్. అయితే.. ఈ ఫండ్‌పై సంతృప్తి చెందని రైతులు ఆందోళనలు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం సన్‌ఫ్లవర్ క్వింటాల్‌కు రూ.1000ని నష్టపరిహారంగా ఇస్తోంది. కానీ రూ.6400 కనీస మద్దతు ధర ఇచ్చి సన్ఫ్లవర్ను కొనుగోలు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బ్రిజ్ భూషన్ సింగ్‌పై లైంగిక ఆరోపణల్లో ఉద్యమించిన రెజ్లర్ భజరంగ్ పూనియా కూడా ఈ మహాపంచాయత్‌లో పాలుపంచుకున్నారు. రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ కూడా ఈ నిరసనల్లో ఉన్నారు. దీనిపై స్పందించిన సీఎం మనోహర్ పారికర్.. రైతు సంఘాలు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇదీ చదవండి:'కొవిన్ యాప్‌లో వ్యక్తిగత డేటా లీక్'.. కేంద్రంపై ప్రతిపక్షాలు ఫైర్.. -
సీమాంధ్ర మంత్రులు ద్రోహులు
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: సీమాంధ్ర కేంద్రమంత్రులు తెలుగుజాతి ద్రోహులని విశాలాంధ్ర మహసభ జిల్లా అధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు ఆరోపించారు. రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర మంత్రుల తీరును వ్యతిరేకిస్తూ శనివారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట వినూత్న రీతిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మామిడి మాట్లాడుతూ, సీమాంధ్ర కేంద్రమంత్రుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బస్సు, రైల్వే స్టేషన్లో ఉండే దొంగలకన్నా వీరు ప్రమాదమని, ఈ విషయంలో ప్రజలను చైతన్యపరచడానికే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. ఎన్నికల్లో ఓట్ల కోసం గ్రామాలకు వస్తే తరమికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విశాలాంధ్ర మహాసభ జిల్లా కో కన్వీనర్ మద్దిల సోంబాబు, విద్యార్థి సంఘం నాయకులు శ్యామ్, భరత్, పతంజలి, వికలాంగుల సంఘం నాయకులు శ్రీను, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎంపీలు డ్రామాలాడుతున్నారు విజయనగరం ఆరోగ్యం : సీమాంధ్రకు చెందిన ఎంపీలు రాష్ట్ర విభజన విషయంలో డ్రామాలాడుతున్నారని వైద్య, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పి.ఇజ్రాయిల్ అన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా స్థానిక కేంద్రాస్పత్రి అత్యవసర విభాగం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటలీ లేడీ.. సోనియా కిలాడీ.. సమైక్యాంధ్ర జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇజ్రాయిల్ మాట్లాడుతూ, తెలంగాణ బిల్లును అడ్డుకోవాల్సిన ఎంపీలు ప్యాకేజీల గురించి మాట్లాడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర విభజనకు సహకరిస్తే సీమాంధ్ర ద్రోహులుగా గుర్తించి విగ్రహాలు కడతామని చెప్పారు. ఇప్పటికైనా కపట నాటకాలు మాని చిత్తశుద్ధిదతో సమైక్యాంధ్ర పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. వైద్య ఉద్యోగుల ధర్నాకు ఏపీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు ప్రభూజీ, పెద్దింటి అప్పారావు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సంఘ నాయకులు ఆచారి, బాలాజీ పాణిగ్రాహి, ఉమాపతి, చిన్నంనాయుడు, రామయ్యమ్మ, ధనలక్ష్మి, పద్మజ, సత్యనారాయణ, రమణ, త్రినాథ్, తదితరులు పాల్గొన్నారు. చివరి వరకూ పోరాటం బెలగాం : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం చివరి వరకూ పోరాడుతామని ఏపీ ఎన్జీఓ పార్వతీపురం డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు గంజి లక్ష్మున్నాయుడు, జీవీఆర్‌ఎస్ కిశోర్ అన్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఏపీఎన్జీఓలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అంతకుముందు కాంప్లెక్స్ నుంచి పట్టణంలోని ప్రధాన రహదారుల్లో ర్యాలీ నిర్వహించారు. తెలుగుతల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేసి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరం వద్ద లక్ష్మున్నాయుడు, కిశోర్ మాట్లాడుతూ, ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా 10న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, 12న వ్యాపార సంస్థల బంద్, జాతీయ రహదారుల దిగ్బంధం, తదతర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. స్థానిక కోర్టు జంక్షన్ వద్ద బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో న్యాయవాదులు దీక్షలు చేపట్టారు. ఆందోళన కొనసాగిస్తాం విజయనగరం కలెక్టరేట్ : రాష్ట్ర విభజన బిల్లు ఉపసంహరించుకునేంత వరకూ ఆందోళన కొనసాగిస్తామని సమైక్యాంధ్ర జేఏసీ చైర్మన్ గంటా వెంకటరావు, ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు ప్రభూజీ స్పష్టం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎన్జీఓలు చేపడుతున్న ఆందోళన మూడు రోజుకు చేరుకుంది. సిబ్బంది విధులకు హాజరుకాకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ వెలవెలబోయాయి. కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరసన దీక్షలో వెంకటరావు, ప్రభూజీ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం మొండిగా విభజన వైపు అడుగులు వేయటం మంచి పద్ధతి కాదన్నారు. తక్షణమే సీమాంధ్ర ఎంపీలు, కేంద్రమంత్రులు స్పందించి విభజనను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల మనోభావాలు పట్టించుకోకపోతే పుట్టగతులుండవన్నారు. రోజురోజుకూ ఉద్యమం తీవ్రమవుతున్నా పాలకులు పట్టించుకోకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నుంచి ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు. పదో తేదీన చేపట్టనున్న జిల్లా బంద్‌కు సహకరించాని కోరారు. నేడు సమైక్య పరుగు.. సమైక్యాంధ్రకు మద్దతుగా సమైక్య రాష్ట్రపరిరక్షణ సమితి, ఒలింపిక్ అసోషియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఆదివారం సమైక్యపరుగు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి యువత తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఎన్జీఓ అసోషియేషన్ నాయకులు డీవీ రమణ, ఆర్ఎస్ జాన్, పింఛనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్దింటి అప్పారావు, ఎన్జీఓ నాయకులు కొట్నాన.శ్రీనివాసరావు, రత్నం, రమణమూర్తి, కనికరం బాబు, తదితరులు పాల్గొన్నారు.