'మిస్టర్ 420' గా వరుణ్ సందేశ్
హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం వంటి సినిమాలతో యూత్‌లో క్రేజ్ సంపాదించుకున్న హీరో వరుణ్ సందేశ్. గత కొంతకాలంగా ఈ యువ హీరో హిట్‌కు దూరంగా ఉన్నారు. తాజాగా 'మిస్టర్ 420' అనే చిత్రంతో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఎస్.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ప్రియాంక భరద్వాజ్ హీరోయిన్ గా నటిస్తుంది.
చిత్ర ఆడియోను ఇదే నెలలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వచ్చే నెలలో 'మిస్టర్ 420' ధియేటర్లలో ప్రత్యక్షం కానున్నాడు. ఈ చిత్రం అతని కెరీర్‌ను ఊపందుకునేలా చేస్తుందని భావిస్తున్నాడు. కాగా తను ప్రేమించిన వితికను వరుణ్ ఇటీవలే వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 'పడ్డానండి ప్రేమలో మరి' చిత్రంలో వరుణ్ సరసన హీరోయిన్గా నటించిన వితిక.. నిజ జీవితంలో కూడా అతని హీరోయిన్ అయిపోయింది.