breaking news
private telecom companies
-
ఒకరి సిమ్ కార్డును మరొకరికి కేటాయించిన సంస్థ..
తమిళనాడు, టీ.నగర్: నిర్లక్ష్యంగా సిమ్ కార్డును మరొక వ్యక్తికి కేటాయించిన ప్రైవేటు టెలికమ్యూనికేషన్ సంస్థ వినియోగదారునికి నష్టపరిహారంగా రూ.8.50 లక్షలు చెల్లించాలంటూ వినియోగదారుల కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈ వివరాలు సోమవారం వెలుగులోకి వచ్చాయి. చెన్నై జిల్లా ఉత్తర వినియోగదారుల కోర్టులో ఎగ్మూర్‌కు చెందిన పూజన్‌గోయల్ దాఖలు చేసిన పిటిషన్లో ఇలా పేర్కొన్నారు. చెన్నై ఐనావరంలోగల ఒక ప్రైవేటు టెలికమ్యూనికేషన్ సంస్థలో మొబైల్ ఫోన్ కనెక్షన్ తీసుకున్నానని, ఈ ఫోన్ సాధారణంగా రావాల్సిన బ్యాంకు లావాదేవీల వివరాలు రాలేదని తెలిపారు. దీంతో టెలికమ్యూనికేషన్ సంస్థను సంప్రదించగా సిమ్కార్డులో లోపం ఉండొచ్చని తెలిపారని పేర్కొన్నారు. దీంతో కొత్త సిమ్‌కార్డు కొని బ్యాంకు వివరాలు పరిశీలించగా తన బ్యాంకు అకౌంట్ నుంచి రూ.7.50 లక్షలు చోరీకి గురైనట్లు తెలిసిందన్నారు. దీనిగురించి టెలికమ్యూనికేషన్ సంస్థలో విచారించగా నకిలీ ధ్రువపత్రాలతో వేరొకరికి తన సిమ్‌కార్డును కొత్తగా ఇచ్చినట్లు తెలిసిందన్నారు. దీంతో సదరు సంస్థ తాను పోగొట్టుకున్న సొమ్ముతోపాటు నష్టపరిహారంగా ఆరు లక్షల రూపాయలు చెల్లించాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి లక్ష్మికాంతం పిటిషనర్‌కు రూ.7.5 లక్షలతోపాటు అదనంగా లక్ష రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. -
‘ప్రైవేటు టెలికాం’కు జీఎస్టీ ఎఫెక్ట్
- సిమ్ కార్డులు, రీచార్జ్ కార్డుల సరఫరా తాత్కాలికంగా నిలిపివేత - జూలై 4 నుంచి పునరుద్ధరణ సాక్షి, అమరావతి బ్యూరో: జీఎస్టీ దెబ్బకు ప్రైవేటు టెలికం కంపెనీలు తమ సిమ్ కార్డులు, రీచార్జి కార్డుల జారీని తాత్కాలికంగా నిలిపివేశాయి. మార్కెట్లోని తమ ఫ్రాంచైజీలు, ఏజెన్సీలకు కొన్ని రోజులుగా వాటిని సరఫరా చేయడం లేదు. జీఎస్టీలో సిమ్ కార్డులు, రీచార్జ్ కార్డులపై పన్ను రేటు పెరగనుంది. ప్రస్తుతం వాటిపై 15 శాతం పన్ను ఉండగా, జీఎస్టీలో పన్ను రేటును 18 శాతానికి పెంచారు. ఈ మేరకు టెలికం సంస్థలు తమ సిమ్‌కార్డులు, రీచార్జ్ కార్డుల రేట్లు, ఇతరత్రా రికార్డుల్లో మార్పులు చేయాల్సి ఉంది. ఇందుకోసం సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలి. దీనికి సంబంధించి ప్రైవేటు టెలికం సంస్థలు వారం రోజులుగా కసరత్తు చేపట్టాయి. అయితే, జూలై ఒకటో తేదీ నాటికి కూడా సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేయడం సాధ్యమయ్యేలా లేదు. జూలై 3వ తేదీ నాటికి సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేయగలమని కంపెనీలు భావిస్తున్నాయి. దీంతో అప్పటి వరకు ఏజెన్సీలకు సిమ్ కార్డులు, రీచార్జ్ కార్డులను సరఫరా చేయకూడదని అనధికారికంగా నిర్ణయించాయి. జూలై 4వ తేదీ నుంచి మళ్లీ సరఫరాను పునరుద్ధరించాలని భావిస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్కు మాత్రం వ్యవస్థాగత సామర్థ్యం ఎక్కువగా ఉండటంతో తమ సాఫ్ట్‌వేర్‌ను కొన్నిరోజుల క్రితమే అప్డేట్ చేసింది. ఏజెన్సీలకు యథాతథంగా సిమ్‌కార్డులు, రీచార్జ్ కార్డుల సరఫరాను కొనసాగిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ మార్కెటింగ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.