breaking news
Private market
-
ప్రయివేట్ పెట్టుబడులు నేలచూపు
ముంబై: దేశీయంగా గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో ప్రయివేట్ పెట్టుబడులు 33 శాతం క్షీణించినట్లు రేటింగ్ ఎజెన్సీ ఇక్రా తాజాగా వెల్లడించింది. ఇది గత దశాబ్ద కాలంలోనే కనిష్టంకాగా.. లిస్టెడ్ కంపెనీలతో పోలిస్తే అన్‌లిస్టెడ్ సంస్థలు పెట్టుబడుల్లో వెనకడుగు వేసినట్లు నివేదికలో పేర్కొంది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వమే పెట్టుబడులకు దన్నుగా నిలుస్తున్నట్లు తెలియజేసింది. ప్రయివేట్ పెట్టుబడులు లేకపోవడం ఆర్థికవ్యవస్థపై ప్రభావం చూపవచ్చన్న ఆందోళనలు కొన్ని త్రైమాసికాలలో తలెత్తినట్లు వివరించింది. నివేదిక ప్రకారం.. కొత్త సౌకర్యాలపై ఇన్వెస్ట్ చేయడానికి బదులుగా ప్రయివేట్ రంగం రుణ చెల్లింపులకే మిగులు నిధులను వెచి్చంచడంపై దృష్టి పెట్టింది. తద్వారా అధిక సామర్థ్య వినియోగానికి ప్రాధాన్యత ఇచ్చాయి. ప్రధానంగా పట్టణాలలో వినియోగం బలహీనపడటం, డిమాండ్ మందగించడం, చైనా నుంచి పెరిగిన చౌక దిగుమతులు తదితర అంశాల కారణంగా దేశీ కార్పొరేట్ల విస్తరణ ప్రణాళికలు పరిమితమైపోయినట్లు ఇక్రా చీఫ్ రేటింగ్ ఆఫీసర్ కె.రవిచంద్రన్ తెలియజేశారు. -
టమాటా @100
మళ్లీ పెరిగిన ధరలు రైతుబజార్లలో రూ.52 ఠ అవీ నాసిరకమే బెంబేలెత్తుతున్న సామాన్య ప్రజలు విజయవాడ : టమాటా ధర ఠారెత్తిస్తోంది. గత కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు ప్రైవేటు మార్కెట్లో కేజీ రూ.100కు చేరాయి. రైతుబజార్లలో కేజీ రూ.52 పలుకుతున్నా టమాటాలు వినియోగదారులకు సరిపడా దొరకటం లేదు. ఉన్నవీ నాణ్యత లేకపోవడం గమనార్హం. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టమాటా తోటలు పంట అయి పోవటంతో ఉత్పత్తులు గణనీయంగా తగ్గాయి. దీంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఆయా జిల్లాల్లోనూ భారీ వర్షాలకు టమాటా దిగుబడి తగ్గిందని చెపుతున్నారు. నాలుగు రోజుల క్రితం వరకు నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి విజయవాడ మార్కెట్‌కు రోజుకు 10 లారీల టమాటాలు వచ్చేవి. విజయవాడతో పాటు, జిల్లాలోని 17 రైతుబజార్లలో 10 వేల టన్నుల విక్రయాలు సాగించేవారు. నాలుగు రోజుల నుంచి కేవలం రెండు లారీలు అంటే రెండు వేల కిలోల టమోటాలు మాత్రమే దిగుమతి అవుతున్నాయి. దీంతో జిల్లాలోని 17 రైతుబజార్లకు టమాటా సరఫరా కావటం లేదు. రైతు బజార్లలో కేజీ రూ.52గా మార్కెటింగ్ అధికారులు నిర్ణయించారు. దీంతో వ్యాపారులు రైతుబజార్లకు టమాటా సరఫరా చేయకుండా ప్రైవేటు మార్కెట్లకు తరలించేస్తున్నారు. రైతుబజార్లలో అరకొరగా కూరగాయలు రైతుబజార్లకు కూరగాయలు అరకొరగానే వస్తున్నాయి. తోటల్లో పంట ఉత్పత్తులు గణనీయంగా తగ్గటంతో కూరగాయలు అందుబాటులో ఉండటం లేదని చెబుతున్నారు. గోరుచిక్కుడు, బెండ, దొండ, దోస, పచ్చిమిర్చి, వంగ, ఆకు కూరలు కూడా సరిగా రావటం లేదు. వచ్చిన సరకూ నాసిరకంగా ఉంటోంది. వర్షాలు కురిసి కూరల తోటలు పెరిగే వరకు ఇదే పరిస్థితి ఉంటుందని మార్కెటింగ్ అధికారులు చెపుతున్నారు.