breaking news
private jet crash
-
విమాన ప్రమాదంలో లిబియా సైన్యాధ్యక్షుడి మృతి
అంకారా: తుర్కియే రాజధాని అంకారా నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే ఒక ప్రైవేట్ జెట్ విమానం కుప్పకూలిన ఘటనలో లిబియా సైన్యాధ్యక్షుడు జనరల్ ముహమ్మద్ అలీ అహ్మద్ అల్–హదద్ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని లిబియా ప్రధాన మంత్రి అబ్దుల్ హమీద్ దిబేబాహ్ ధృవీకరించారు. మంగళవారం రాత్రి 8.30 నిమిషాలకు అంకారాలోని ఎసెన్‌బోగా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫాల్కన్– 50 రకం ప్రైవేట్ బిజనెస్ జెట్ చిన్న విమానం టేకాఫ్ అయింది. ఇందులో లిబియా సైన్యా ధ్యక్షుడు అలీ సహా నలుగురు సైనికాధికారులు, ముగ్గురు విమాన సిబ్బంది ఉన్నారు. వీళ్లంతా తుర్కియేలో పర్యటన ముగించుకుని స్వదేశం పయనమయ్యారు. అయితే గాల్లోకి లేచిన కేవలం 40 నిమిషాల తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్(ఏటీసీ)తో విమాన సంబంధాలు తెగిపోయాయి. వెనువెంటనే 408 మంది సిబ్బందితో సహాయక, అన్వేషణ బృందాలు గాలింపు మొదలెట్టాయి. ఎయిర్‌పోర్ట్‌కు 70 కిలోమీటర్ల దూరంలోని హేమన పరిధిలోని కెసిఖావ్ గ్రామ శివారులో విమాన శకలాలను గాలింపు బృందాలు గుర్తించాయి. విమానంలోని వారంతా చనిపోయి నట్లు నిర్ధారించాయి. -
విమాన ప్రమాదంలో లాడెన్ కుటుంబ సభ్యుల మృతి
లండన్: దక్షిణ ఇంగ్లండ్‌లో శుక్రవారం జరిగిన విమాన ప్రమాదంలో అల్‌కాయిదా ఒకప్పటి చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కుటుంబ సభ్యులు మృతిచెందారు. వారు ప్రయాణిస్తున్న ఫీనమ్ 300 అనే ప్రైవేట్ జెట్ విమానం హాంప్‌షైర్‌లోని బ్లాక్‌బుషె ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌అయ్యేందుకు ప్రయత్నిస్తూ కుప్పకూలింది. రన్‌వేను దాటి దూసుకెళ్లిన విమానం ఫెన్సింగ్‌ను తాకి సమీపంలో ఉన్న కార్ల వేలంపాట సంస్థ ప్రదేశంలో బోల్తాపడి పేలిపోయింది. ఈ దుర్ఘటనలో పైలట్ సహా నలుగురు మృతిచెందారు. మృతుల్లో లాడెన్ సవతి తల్లి, సోదరి, ఆమె భర్త ఉన్నట్లు అరబ్ మీడియా పేర్కొంది. ఇటలీలోని మిలాన్-మాల్పెన్సా ఎయిర్‌పోర్టు నుంచి ఈ విమానం బయలుదేరింది. బిన్ లాడెన్ తండ్రి మొహమ్మద్ బిన్ లాడెన్ సైతం 1967లో సౌదీ అరేబియాలో జరిగిన విమాన ప్రమాదంలో మృతిచెందారు.


