ఆర్భాటంలేని యువరాణి!
వ్యక్తిత్వం
సుల్తాన్ బిన్ మహమద్ బిన్ సౌద్ అల్ కబీర్... తరతరాలుగా వస్తున్న రాజరికంతో సౌదీ అరేబియాను ఏలుతున్న చక్రవర్తి ఆయన. సిరి సంపదలతో తులతూగే ఆ దేశం, ఆ రాజుగారి వైభోగమే వేరు! అలాంటి రాచరికపు ఆడంబరాల మధ్య పుట్టి పెరిగిన అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ అనే ఆయన కూతురు మాత్రం నిరాడంబరతకు ప్రతిరూపం.కోట్ల డాలర్ల విలువ జేసే ఆస్తి, ఎంతో విస్తృతమైన అధికార పరిధి ఉన్నా అజీజ్ సాధారణమైన జీవితాన్ని గడుపుతోంది.
వివిధ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ సేవా నిరతిని చాటుకొంటోంది. తమ దేశంలో సామాన్య మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తోంది. తండ్రి ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాలను చక్కబెడుతూ తన చతురతను ప్రదర్శిస్తోంది. మరి అలాంటి యువరాణిగారిని చూసి ఇప్పుడు సౌదీ అరేబియన్లు మురిసిపోతున్నారు. మా యువరాణి ఎంత మంచిదో చూడండి అంటూ ప్రపంచానికి చెప్పుకొంటున్నారు.