breaking news
preparation of Indian dishes
-
రుచిని ఉటంకించండి
ఒక్కో ప్రాంతానికి ఒక్కో పిండి వంటకం గుర్తింపు తీసుకువస్తుంది. ఉటంకి అటువంటిదే. సోంపేట వాస్తవ్యులైన కింతలి కుటుంబరావు దంపతులు తయారుచేసే ఉటంకులతో ఆ ఊరి పేరు ప్రపంచ పటంలో చేరింది. అత్తవారి దగ్గర నుంచి వారసత్వంగా నేర్చుకున్న ఆ వంటకాన్నే జీవనోపాధిగా చేసుకుంటున్నారు ఆ కుటుంబ సభ్యులు. ఉటంకులతో దేశవిదేశాలవారి మనసులను తీపి చేస్తున్నారు. సుమారు 50 సంవత్సరాలుగా కింతలి కుటుంబం వారు మాత్రమే చేస్తున్న ఉటంకుల విజయయాత్ర ఈ వారం ఫుడ్ ప్రింట్స్... ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుండగానే పీటల మీద కూర్చున్న భార్యభర్తలు, వారికి ఎదురుగా మరుగుతున్న నూనెతో నిండిన నాలుగు బాణళ్లూ కనిపి స్తాయి. పక్కనే ఉన్న పిండి గిన్నెలో ఐదువేళ్లను ముంచి తీగెలుగా సాగుతున్న పిండి చేతితో జంతికల మాదిరిగా తిప్పుతూ నూనెలో వేయడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలోని సోంపేట పట్టణంలో వంశపారంపర్యంగా నేర్చుకున్న వంటకం ఆ కుటుంబానికి జీవనోపాధిగా మాత్రమే కాదు, వారి ఇంటి పేరుగా మారింది. ఉటంకి వంటకం తయారీ మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా గుమ్మ లక్ష్మీపురం గ్రామంలో ప్రారంభమైంది. రెండు తరాల క్రితం కింతలి కుటుంబీకులు తమ ఆడ పిల్లలకు పండగ పూట మర్యాద చేయడం కోసం, కింతలి శ్రీనివాసరావు తల్లి ధనలక్ష్మి నేర్చుకున్నారు. జీవనోపాధి కోసం శ్రీనివాసరావు ఇరవై సంవత్సరాల క్రితం సోంపేటకు వచ్చి, అక్కడ వైశ్యరాజు వెంకన్న సహాయంతో తాము నేర్చుకున్న వంటకాన్ని వ్యాపారంగా మార్చుకున్నారు. భార్య లక్ష్మితో కలిసి ఉటంకి స్వీటు తయారు చేసి అమ్మడం ప్రారంభించారు. అదే వారి కుటుంబాన్ని నిలబెట్టింది. వారి ఇంటిపేరును ఉటంకిగా మార్చేసింది. రోజుకి 800 ఉటంకుల తయారీ సుమారు 20 సంవత్సరాల క్రితం వారు తమకు వారసత్వంగా మారిన వంటకాన్ని వ్యాపారంగా ప్రారంభించినప్పుడు రోజుకు 100 ఉటంకులు తయారు చేసేవారు. అప్పట్లో ఒక ఉటంకిని రూ.1.50 పైసలకు అమ్మేవారు. ఇప్పుడు రోజుకి 800 ఉటంకులు తయారుచేస్తూ వ్యాపారాన్ని వృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ఒక ఉటంకి ధర 12 రూపాయలు. – కందుల శివశంకర్, సాక్షి, శ్రీకాకుళం ఫొటోలు: పిరియా ధర్మేంద్ర, సోంపేట నాణ్యత పాటిస్తాం... మిక్సీలో బియ్యం, పాలు, పంచదార వేసి గ్రైండ్ చేస్తే, తీగెలాంటి పదార్థం తయారవుతుంది. ఆ పిండినే ఉటంకిల తయారీకి వాడతాం. ఒక రోజు వాడిన నూనెను రెండో రోజు ఉపయోగించం. ఉటంకి స్వీట్ తయారు చేయడం చాల కష్టం. చాలామంది మా దగ్గరకు వచ్చి నేర్చుకున్నారు, కానీ చేయలేకపోతున్నామని చెబుతున్నారు. నేర్చుకోవాలనే పట్టుదల ఉంటే సాధించగలుగుతారు. వంశపారంపర్య వంటకం కావడంతో మేము సులువుగా నేర్చుకున్నాం. పూర్తిగా ఆరోగ్యమైన వంటకం కావడంతో వీటిని అందరూ తినచ్చు. ఇవి సుమారు ఆరు నెలల పాటు నిల్వ ఉంటాయి. చుట్టుపక్కల ప్రాంతాల వారు మా దగ్గర కొని, వాళ్ల గ్రామాలలో అమ్ముతుంటారు. – కింతలి శ్రీనివాసరావు, సోంపేట మాకు జీవనోపాధి వంశ పారపర్యంగా నేర్చుకున్న వంటకం మా ఇంటి పేరుగా మారింది. మా దగ్గర ఉటంకి తయారీ నేర్చుకోవడానికి చాలామంది వచ్చారు. తయారుచేయడానికి ఓపిక ముఖ్యం. మేం నేర్చుకోవడానికి నెలరోజుల సమయం పట్టింది. – కింతలి లక్ష్మి, సోంపేట -
కుక్ & టేస్ట్
నలభీములను ఆదర్శంగా తీసుకున్న మహిళలు.. పాకకళను మరింత పదునుపెడుతున్నారు. నోరూరించే వంటకాల తయారీలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారు. రొటీన్ ఫుడ్ కాకుండా వెరైటీలను ట్రై చేయుడానికి మేం రెడీగా ఉన్నామంటున్నారు. నానక్‌రామ్‌గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని హోటల్ హయాత్‌లో ‘ఎక్స్పర్ట్ చెఫ్‌తో కుకరీ క్లాసెస్’ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. హయత్ హోటల్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ ఆనంద్ భారతీయ వంటకాల తయారీపై శిక్షణ ఇచ్చారు. ఇండియన్ ఫుడ్ వెరైటీస్ షమ్మీకబాబ్,పరద్దార్ పన్నీర్, దమ్కాముర్గ్, కోఫ్తాకర్రీ, సబ్జ్ పులావ్, దాల్ మఖానీ, కుల్చా, నాన్ రోటీ వంటి వంటకాల తయారీపై ఈ సెషన్లో శిక్షణ ఇచ్చారు. ట్రైనింగ్‌కు హాజరైన మగువలు కూడా గరిట పట్టి తవు వంటకాలు రుచి చూపించారు. ఈ కుకరీ క్లాసెస్‌కు విదేశీయుులు కూడా హాజరవడం విశేషం. ఇండియున్ ఫుడ్ టేస్ట్ అదరహో అని కితాబిచ్చారు. పెరుగుతున్న ఆదరణ కుకరీ క్లాసెస్‌కు ఆదరణ పెరుగుతోందని హోటల్ హయాత్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ ఆనంద్ తెలిపారు. మొదట్లో కుకరీస్ క్లాసెస్‌కు ఒకరిద్దరు వూత్రమే హాజరయ్యేవారని.. ఇప్పుడు వారి సంఖ్య పెరిగిందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 13న ఏషియున్ వంటకాలపై క్లాసెస్ నిర్వహిస్తావుని తెలిపారు. - హయత్ హోటల్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ ఆనంద్ రాయదుర్గం