రేప్ కేసులో ఎమ్మెల్సీ కొడుకు?
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నగరంలో ఓ యువతిపై జరిగిన రేప్ కేసులో ఓ ఎమ్మెల్సీ కొడుకు ఉన్నట్టు తెలుస్తోంది. కొంపల్లికి చెందిన ప్రీతమ్‌రెడ్డి అనే వ్యక్తి.. పబ్‌లో పరిచయంతో యువతి(23)ని తన ఇంటికి పిలిపించుకొని శనివారం (ఈనెల 6న) అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను గదిలో బంధించి అదే ప్రాంతంలో ఉంటున్న తన స్నేహితులు స్నేహిత్‌రెడ్డి, ఆరవ్రెడ్డిలను తీసుకొచ్చి వారి కోరిక తీర్చాలని బలవంతం చేశాడు. ఎలాగో అలా ఆ యువతి అక్కడ్నుంచి బయటపడి ఫిర్యాదు చేయడంతో పోలీసులు సోమవారం ప్రీతమ్రెడ్డిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.
ప్రీతమ్‌రెడ్డి తీసుకువచ్చిన స్నేహితుల్లో ఒకరిని ఎమ్మెల్సీ తనయుడిగా భావిస్తున్నారు. అయితే పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించడం లేదు. వారిని పట్టుకొనేందుకు పోలీసులు రెండు బృందాలను ఏర్పాటు చేశారు.