breaking news
praise raised
-
ప్రపంచ జ్ఞానామృతం భగవద్గీత
బీజింగ్: భగవద్గీత జ్ఞానామృతమంటూ ప్రశంసలు చైనా పండితులు కురిపించారు. ఆధునిక కాలంలో ప్రజలు ఎదుర్కొనే ఆధ్యాత్మిక, భౌతిక సమస్యలకు సమాధానాలు ఇందులో ఉన్నాయన్నారు. భగవద్గీత భారతీయ నాగరికత సూక్ష్మ చరిత్ర వంటిదంటూ శ్లాఘించారు. ఈ ప్రాచీన భారతీయ గ్రంథరాజంపై చైనీయులు ఇలా బహిరంగంగా గౌరవాన్ని ప్రకటించడం అరుదైన విషయంగా చెబుతున్నారు. శనివారం చైనా రాజధాని బీజింగ్‌లో భారత దౌత్యకార్యాలయం ‘సంగమమ్– భారతీయ తాత్విక సంప్రదాయాలు’అంశంపై నిర్వహించిన చర్చాగోష్టిలో పలువురు పండితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు గీతను భారతీయ తత్వశాస్త్ర విజ్ఞాన సర్వస్వంగా అభివరి్ణంచారు. ఆధ్యాత్మిక, భౌతిక అన్వేషణల మధ్య సామరస్యాన్ని సాధించేందుకు భగవద్గీత ఎంతో సాయంగా ఉంటుందన్నారు. భగవద్గీతను చైనీస్ భాషలోకి తర్జుమా చేసిన ప్రొఫెసర్ ఝాంగ్ బావోషేంగ్(88) ఈ కార్యక్రమంలో కీలక ప్రసంగం చేశారు. భగవద్గీతను భారతదేశ ఆధ్యాత్మిక ఇతిహాసం, తాత్విక విజ్ఞాన సర్వస్వంగా ఆయన పేర్కొన్నారు. ఇది నేటికీ భారతీయ జీవనాన్ని తీర్చిదిద్దుతోందని చెప్పారు. ప్రొఫెసర్ ఝాంగ్ భారత్‌లో 1984–86 సంవత్సరాల మధ్య గడిపిన తన అనుభవాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. దక్షిణాగ్రాన కన్యాకుమారి నుంచి ఉత్తరాన ఉన్న గోరఖ్‌పూర్ వరకు ప్రతిచోటా శ్రీకృష్ణుని ఉనికిని, ఒక సజీవ నైతిక, ఆధ్యాత్మిక ఆదర్శాన్ని ప్రత్యక్షంగా గమనించానన్నారు. జెజియాంగ్ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ ఓరియంటల్ ఫిలాసఫీ రీసెర్చ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వాంగ్ ఝి–చెంగ్ మాట్లాడుతూ.. 5 వేల ఏళ్ల క్రితం ప్రాచీన భారతీయ యుద్ధరంగంలో జరిగిన సంభాషణ అయిన భగవద్గీత, నేడు ప్రజలు ఎదుర్కొంటున్న ఆందోళనలు, అనేక గందరగోళాలకు సైతం సరైన సమాధానాలను ఇస్తూ కాలాతీతంగా మారిందన్నారు. కార్యక్రమానికి వచ్చిన పండితులకు భారత రాయబారి ప్రదీప్ కుమార్ రావత్ ఘనస్వాగతం పలికారు. గతేడాది తమ దౌత్య కార్యాలయం రామాయణంపై ఏర్పాటు చేసిన సదస్సుకు కొనసాగింపుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
Union Cabinet: జన నాయకుడు మోదీ
న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయ ప్రారంభ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించినందుకు ప్రధాని నరేంద్ర మోదీపై కేంద్ర కేబినెట్ ప్రశంసల వర్షం కురిపించింది. ఆ సందర్భంగా దేశ ప్రజలు మోదీపై కనబరచిన ప్రేమ, ఆప్యాయతలు ఆయన నిజమైన జన నాయకుడని మరోసారి నిరూపించాయని పేర్కొంది. ‘‘రామ మందిరం కోసం ప్రజలంతా కలసికట్టుగా ఉద్యమించిన తీరు కొత్త తరానికి తెర తీసింది. ఇదంతా మోదీ దార్శనికతతోనే సాధ్యపడింది’’ అని పేర్కొంది. భరత జాతి శతాబ్దాల కలను సాకారం చేసినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ కేబినెట్ ఈ సందర్భంగా తీర్మానం చేసింది. తీర్మాన ప్రతిని బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చదివి విని్పంచారు. ‘‘1947లో దేశానికి భౌతికంగా మాత్రమే స్వాతంత్య్రం వచి్చంది. దాని ఆత్మకు మాత్రం ఇన్నేళ్ల తర్వాత 2024 జనవరి 22న రామ్ లల్లా విగ్ర ప్రతిష్టాపన ద్వారా ప్రాణప్రతిష్ట జరిగింది. ప్రజలు కనబరిచిన ప్రేమాభిమానాల ద్వారా మీరు జన నాయకునిగా సుప్రతిష్టితులయ్యారు. రామ మందిర ప్రతిష్టాపన ద్వారా కొత్త తరానికి తెర తీసిన దార్శనికుడయ్యారు’’ అంటూ మోదీపై తీర్మానం ప్రశంసలు కురిపించింది. ‘‘ప్రజల్లో ఇంతటి ఐక్యత గతంలో దేశంలో ఎమర్జెన్సీ విధించిన సందర్భంగా కని్పంచింది. అది ఒక నియంతను ఎదిరించేందుకు జరిగిన ఉద్యమం. ఇదేమో దేశంలో నూతన శకానికి అయోధ్య రాముని సాక్షిగా నాంది పలికిన చరిత్రాత్మక క్షణాలకు సాక్షిగా నిలిచిన ఐక్యత’’ అని పేర్కొంది. ఈ సందర్భంగా కేబినెట్ భేటీలో ఆసాంతం భావోద్వేగాలు ముప్పిరిగొన్నాయని ఒక మంత్రి తెలిపారు. రాముని ప్రాణప్రతిష్టకు సాక్షిగా నిలిచిన మంత్రివర్గంలో భాగస్వాములుగా ఉండటం గర్వకారణమని కేబినెట్ సభ్యులంతా అభిప్రాయపడ్డట్టు చెప్పారు. ఇది కొన్ని జన్మలకు ఒకసారి మాత్రమే లభించే అరుదైన అవకాశమన్నారు. ఆ ప్రాజెక్టులకు రూ.8,500 కోట్లు రసాయనాల ఉత్పత్తిని దేశీయంగా పెంచడం ద్వారా వాటి దిగుమతిని తగ్గించుకునే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బొగ్గు, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు రూ.8,500 కోట్ల ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశం ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. అలాగే కోల్ ఇండియా, గెయిల్ భాగస్వామ్యంలో రూ.13,052 కోట్ల కోల్–ఎస్ఎన్జీ (సింథటిక్ నేచురల్ గ్యాస్), సీఐఎల్, బీహెచ్ఈఎల్ భాగస్వామ్యంలో రూ.11,782 కోట్ల కోల్–అమ్మోనియం నైట్రేట్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కూడా ఆమోదం తెలిపింది. -
జిలకర మసూర @రూ.20వేలు
ధరల పెరుగుదలతో లాభపడుతున్న దళారులు మనుబోలు :జిలకర మసూర ధాన్యం ప్రస్తుతం పుట్టి రూ.20 వేలు పలుకుతుంది. దీని వల్ల రైతులకన్నా దళారులే ఎక్కువగా లాభపడుతున్నారు. జిలకర మసూర రకం నిల్వ చేసుకున్న కొద్ది మంది రైతులతో పాటు దళారులు కొన్ని రోజులుగా మండలంలో ముమ్మరంగా ధాన్యం విక్రయిస్తున్నారు. పుట్టి రూ.19,200 నుంచి రూ.20 వేల ధరకు విక్రయిస్తున్నారు. ఏప్రిల్, మే నెలల్లో పుట్టి రూ.12 నుంచి రూ.13 వేలు మాత్రమే ఉన్న జిలకర మసూర ధర కొద్ది రోజులుగా అమాంతంగా పెరిగిపోయింది. నాలుగైదు నెలల్లోనే పుట్టికి రూ.7 వేల నుంచి రూ.8 వేలు ధర పెరగడంతో నిల్వ చేసుకునే వసతి లేక అప్పుడే అమ్ముకున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొని ధాన్యం నిల్వ చేసుకున్న దళారులు ఖుషిగా ఉన్నారు. ధరల పెరుగుదలతో ప్రస్తుతం లాభపడుతున్న వారిలో 10 శాతం మంది మాత్రమే రైతులు ఉండగా, మిగిలిన 90 శాతం మంది దళారులు, మిల్లర్లు ఉన్నారు. గోడౌన్లు అందుబాటులో లేకపోవడంతో 90 శాతం రైతులు అప్పుడే తక్కువ ధరకు ధాన్యం అమ్ముకున్నారు. ప్రభుత్వం గోడౌలు కట్టించి రైతులకు అందుబాటులోకి తెస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైతులంటున్నారు.


