breaking news
potluri harikrishna
-
సాంస్కృతిక దాడులు ప్రమాదకరం
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శివారెడ్డి మలికిపురం: భౌతికదాడుల కంటే సాంస్కృతిక దాడులు అత్యంత ప్రమాదకరమైనవని ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శివారెడ్డి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో ప్రపంచ తెలుగు కవిత్వోత్సవం శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. రికార్డు స్థాపించే లక్ష్యంతో 30 గంటల 30 నిమిషాల 30 సెకన్ల పాటు నిర్వహిస్తున్న ఈ కవిత్వోత్సవంలో శనివారం నాటికి 1,620 మంది కవులు పేర్లు నమోదు చేరుుంచుకున్నారు. అంతకు ముందు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శివారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో సాంస్కృతిక దాడులు అధికమయ్యాయన్నారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడు పొట్లూరి హరికృష్ణ మాట్లాడుతూ సంస్కృతీ సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లేది భాష ఒక్కటేనన్నారు. ఐక్యరాజ్యసమితిలో ఆరు భాషలున్నాయని, ఏడో భాషగా తెలుగు చేరేందుకు మన కృషి చాలా అవసరమన్నారు. -
పొట్లూరి హరికృష్ణ నియామకంపై సర్వత్రా విమర్శలు
-
ఇదేనా భాషా సేవ?
ఇంటర్లో ఇక నుంచి రెండవ తప్పనిసరి భాషగా తెలుగే ఉం టుందని ముఖ్యమంత్రి చంద్రబాబు గిడుగువారి సభలో ప్రకటిం చడం హర్షించదగినదే. ఇంటర్ విద్య నుంచి తెలుగును తన్ని తగ లేసిన విద్యావ్యాపారులతో కూడిన మంత్రివర్గం ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే, దానిని మసిపూసి మారేడుకాయ చేయగలమన్న ధీమా ఉండే ఉంటుంది. రెండవ తప్పనిసరి భాషపై సీఎం ప్రకటన మీద నమ్మకం కలగకపోవడానికి మరో కారణం- అధికార భాషా సంఘం అధ్యక్షుని నియామకం గురించి ఆ సభలో చేసిన ప్రక టన. పొట్లూరి హరికృష్ణ పేరును ప్రకటించగానే ఆయన వేదిక ఎక్కారు. హరికృష్ణ పేరు నేనైతే మొదటిసారి విన్నాను. పాతిక వేలు పురస్కారం అందుకున్నారు కాబట్టి, ఆయన భాషకు రహస్య సేవ ఏదైనా చేసే ఉండాలి. వావిలాల వంటి సామా జిక కార్యకర్త, సినారె వంటి పండితుడు, పరుచూరి గోపాలకృష్ణ వంటి కళాసాహిత్యకారుడు, ఏబీకే వంటి సంపాదకుడు నిర్వహిం చిన ఆ పదవిని నేడు అలంకరించబోయే వ్యక్తి అర్హతలు ఏమిటో ఇంకా వెల్లడికావాల్సి ఉంది. కాగా అధికార భాషా సంఘం ఆవిర్భ వించి యాభైయ్యేళ్లయింది. కానీ తెలుగునాట తెలుగులో పాలనా వ్యవహారాలు జరగడం లేదు. సంఘం లక్ష్యాలు ఎంత వరకు నెరవే రాయో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. దివికుమార్ ప్రధాన కార్యదర్శి, జనసాహితి