breaking news
Postpaid mobile connections
-
జమ్మూకశ్మీర్‌లో మరో కీలక పరిణామం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో పూర్తిస్థాయి ఆంక్షల సడలింపు దిశగా మరో కీలక ముందడుగు పడింది. సోమవారం నుంచి కశ్మీర్లో పోస్ట్ పేయిడ్ మొబైల్ సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జమ్మూకశ్మీర్ యంత్రాంగం శనివారం కీలక ప్రటకన చేసింది. సోమవారం మధ్యాహ్నం నుంచి పోస్ట్ పెయిడ్ మొబైల్ సేవలు ప్రారంభమవుతాయని, దీంతో రాష్ట్రంలో 99శాతం ఆంక్షలు ఎత్తివేసినట్టు అవుతుందని రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ ప్రధాన సెక్రటరీ రోహిత్ కన్సాల్ తెలిపారు. నిజానికి శనివారం నుంచే పోస్ట్ పేయిడ్ మొబైల్ సేవలు ప్రారంభం కావాల్సి ఉండగా చివరినిమిషంలో తలెత్తిన సాంకేతిక సమస్యల వల్ల సోమవారానికి వాయిదా వేశారు. ఇక, ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణకు మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఆందోళనలు చెలరేగకుండా కేంద్రం జమ్మూకశ్మీర్‌లో పెద్ద ఎత్తున ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇంటర్నెట్, మొబైల్ సేవలను కూడా ప్రభుత్వం నిలిపివేసింది. అయితే, కశ్మీర్లో పరిస్థితులు క్రమంగా కుదుటపడుతుండటంతో దాదాపు 90శాతం ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తూ వచ్చింది. దీంతో కశ్మీర్లో పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. -
బీఎస్ఎన్ఎల్ రోమింగ్ మరింత చౌక
కోల్‌కతా: ప్రభుత్వ రంగ టెలికం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్ రోమింగ్ చార్జీలను 40 శాతం వరకూ తగ్గించింది. మే 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు ఈ మేరకు వెలువడిన ఒక ప్రకటన తెలిపింది. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మొబైల్ కనెక్షన్లు అన్నింటికీ ఈ తగ్గింపు వర్తిస్తుంది. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ జారీచేసిన టెలికం టారిఫ్ ఉత్తర్వు నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్కమింగ్ కాల్స్‌కు రోమింగ్ టారిఫ్ 40 శాతం తగ్గింది. ఎస్టీడీకి సంబంధించి 23 శాతం, లోకల్ కాల్స్ విషయంలో 20 శాతం రోమింగ్ చార్జీలు తగ్గాయి. ఇక లోకల్ నేషనల్ ఎస్ఎంఎస్ టారిఫ్‌లు 75 శాతం తగ్గాయి. రాత్రి 9 నుంచి ఉదయం 7 గంటల వరకూ ల్యాండ్‌లైన్ నుంచి ల్యాండ్‌లైన్‌కు ఉచిత అపరిమిత కాల్స్ నిర్ణయాన్ని మే 1 నుంచి బీఎస్ఎన్ఎల్ అమలు చేస్తోంది. ట్రాయ్ గరిష్ట టారిఫ్ ధరలను తగ్గించటంతో పలు టెలికం కంపెనీలు రోమింగ్ మొబైల్ కాల్స్, ఎస్ఎంఎస్ ధరలను 40 శాతం, 75 శాతం వరకూ తగ్గించాయి.