breaking news
Poor People Welfare
-
కుల గణనతో బడుగుల సాధికారత
న్యూఢిల్లీ: సమాజంలో వెనుకంజలో ఉన్న బడుగు బలహీన వర్గాలను ప్రధాన అభివృద్ధి స్రవంతిలోకి తీసుకురావడానికి కుల గణన ఒక కీలకమైన ముందడుగు అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కుల రాజకీయాలపై తమకు విశ్వాసం లేదని అన్నారు. అణగారిన వర్గాల సాధికారితకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. భౌగోళికంగా అన్ని ప్రాంతాలు, వెనుకబడిన జిల్లాల ప్రజలు, మహిళల ప్రగతికి కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారు. ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశం ఆదివారం ఢిల్లీలో నిర్వహించారు. 20 మంది ముఖ్యమంత్రులు, 18 మంది ఉప ముఖ్యమంత్రులు హాజరయ్యారు. పహల్గాం ఉగ్రవాద దాడిలో మరణించినవారికి నివాళులరి్పంచారు. మూడో టర్మ్‌లో మోదీ ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహించిన ఈ భేటీలో ప్రధానమంత్రి మాట్లాడారు. రక్షణ రంగంలో స్వయం సమృద్ధికి మనం ఇస్తున్న ప్రాధాన్యతకు ఆపరేషన్ సిందూర్ విజయమే సాక్ష్యమని తెలిపారు. ఉగ్రవాదుల భరతం పట్టడంలో మన స్వదేశీ రక్షణ సాంకేతికత కీలక భూమిక పోషించిందని గుర్తుచేశారు. ఉగ్రవాద క్యాంప్‌లను నేటమట్టం చేయడంలో మన సైనిక దళాలు అద్భతంగా పనిచేశాయని పేర్కొన్నారు. అత్యుత్తమ పాలనా విధానాలపై అధ్యయనం ఉత్తరాఖండ్‌లో అమలు చేస్తున్న ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) సహా వేర్వేరు రాష్ట్రాల్లోని అత్యుత్తమ పరిపాలనా విధానాలను మోదీ ప్రస్తావించారు. ఛత్తీస్‌గఢ్‌లో బస్తర్ ఒలింపిక్స్, అస్సాంలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం, బిహార్‌లో జల జీవన్ హరియాలీ అభియాన్, గుజరాత్లో సోలార్ విద్యుత్ కార్యక్రమం, మేఘాలయాలో పారదర్శక పరిపాలన వంటివి ఇందులో ఉన్నాయి. వీటిపై అధ్యయానికి ఒక కమిటీ ఏర్పాటు చేయాలని మోదీ సూచించారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ విధానాలను అమలు చేయడంపై దృష్టి పెట్టాలన్నారు. ‘వికసిత్ భారత్’ సాధన కోసం ఎన్డీయే పాలిత రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా పని చేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. భారత్‌ను శక్తివంతమైన, స్వయం సమృద్ధి దేశంగా తీర్చిదిద్దుకోవాలని, ఆ దిశగా కార్యాచరణ వేగవంతం చేయాలని అన్నారు. ఏదైనా మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, వివాదాలకు తావు లేకుండా వ్యవహరించాలని సూచించారు. ‘ఎక్కడైనా, ఏదైనా మాట్లాడే’ ధోరణి మానుకోవాలని చెప్పారు. క్రమశిక్షణతో కూడిన కమ్యూనికేషన్ అవసరమని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కొందరు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయినట్లు గుర్తుచేశారు. భారత్–పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ విషయంలో మూడో పక్షం ప్రమేయం ఎంతమాత్రం లేదని ప్రధాని మోదీ మరోసారి స్పష్టంచేశారు. పాకిస్తాన్ నుంచి వచి్చన విజ్ఞప్తి మేరకు కాల్పుల విరమణకు తాము అంగీకరించామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రెండు తీర్మానాలు ఆమోదించారు. పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం ఆపరేషన్ సిందూర్‌లో భారత సైనిక దళాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు, ప్రధాని మోదీ నాయకత్వ ప్రతిభను ప్రశంసిస్తూ ఒక తీర్మానం, దేశవ్యాప్తంగా జన గణనతోపాటు కుల గణన నిర్వహించాలన్న నిర్ణయాన్ని కొనియాడుతూ మరో తీర్మానం ఆమోదించారు. సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జె.పి.నడ్డా, తదితరులు పాల్గొన్నారు. దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను అమిత్ షా వివరించారు. -
రూ.600 కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి రాసిచ్చిన డాక్టర్.. ఎందుకో తెలుసా?
ఇతరులకు సాయం చేయాలి అనిపించినా చేసే స్థోమత అందరికీ లేకపోవచ్చు. కొంతమంది ఆ సామర్థ్యం ఉన్నా సాయం చేసేందుకు మనసు ఒప్పదు. కానీ ఇందుకు భిన్నంగా కొందరు తమ స్థాయి గురించి ఆలోచించకుండా ప్రజాసేవే పరమావధి జీవిస్తుంటారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అర్వింద్ గోయల్ అనే డాక్టర్ కూడా అచ్చం ఇలాంటి వాడే. ఏకంగా తన యావదాస్తిని రాష్ట్ర ప్రభుత్వానికి రాసిచ్చారు. అయితే ఆస్తి అనేగానే ఏదో 10, 20 లక్షలు, మహా అయితే కోటి రూపాయలు అనుకునేరు.. అక్షరాల 600 కోట్ల విలువైన ఆస్తిని పేదల సంక్షేమం,అభివృద్ధి కోసం యూపీ ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చేశారు. దాదాపు 50 ఏళ్లుగా వైద్య వృత్తి ద్వారా ప్రజలకు సేవ చేస్తున్న అర్వింద్ గోయల్ కేవలం తన ఇంటిని మాత్రమే ఉంచుకొని మిగతా ఆస్తినంతా ఇచ్చేశారు. ఆస్తిని ఇచ్చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ నిర్ణయం 25 ఏళ్ల క్రితమే తీసుకున్నట్లు తెలిపారు. కాగా రోనా లాక్డౌన్ సమయంలో వేల మందిని కష్టాల నుంచి ఆదుకున్నారు. మోరదాబాద్‌లోని 50 గ్రామాలను దత్తత తీసుకొని అన్ని రకాల వసతులను ఉచితంగా కల్పించారు. పేదలకు ఉచిత విద్య, వైద్యం వంటి సదుపాయాలను అందించారు. చదవండి: ముగిసిన సోనియా గాంధీ ఈడీ విచారణ.. గోయల్ 100కు పైగా విద్యాసంస్థలు, వృద్ధాశ్రమాలు, ఆస్పత్రులకు ట్రస్టీగా ఉన్నారు. తన సేవలకుగాను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సహా నలుగురు రాష్ట్రపతుల చేతులమీదుగా పలు పురస్కారాలు అందుకున్నారు. అరవింద్‌కు భార్య రేణు గోయల్‌తో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆస్తిని విరాళంగా ఇస్తానని చెప్పగానే కుటుంబసభ్యులు కూడా మద్దతు ఇచ్చారు. -
హౌసింగ్ పేరుతో బాబు చీటింగ్...!
సాక్షి, విజయవాడ : పేద ప్రజలను ఆదుకునేందుకు ప్రధానమంత్రి ఆవాస్‌యోజన పథకం క్రింద కేంద్ర ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేసినా వాటిని పూర్తిస్థాయిలో నిర్మించలేక రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. నిర్మించిన కొద్దిపాటి ఇళ్లను తెలుగుదేశం ఎమ్మెల్యేల ద్వారా కార్యకర్తలకు ఇప్పించడంతో అర్హులైన లబ్ధిదారులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్మించే ఇళ్లకు చంద్రన్న హౌసింగ్‌గా పంపిణీ చేయడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాకు మంజూరైనవి 57 వేల ఇళ్లు కృష్ణాజిల్లాకు మొత్తం 57 వేల ఇళ్లు మంజూరయ్యాయి. విజయవాడ నగరంతో పాటు మచిలీపట్నం, పెడన, ఉయ్యూరు, గుడివాడ, నందిగామ, జగ్గయ్యపేట, నూజీవీడు, తిరువూరు, మున్సిపాలిటీలలో ఈ ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అయితే ఇళ్ల నిర్మాణం పూర్తిగా కాలేదు. హడావుడిగా గృహప్రవేశాలు చేయించి అందరికీ ఇళ్లు ఇచ్చినట్లు చెబుతున్నారు. వాల్ టెక్నాలజీతో భారం పేదలకు కట్టించే ఇళ్లను షియర్ వాల్ టెక్నాలజీతో ప్రభుత్వం నిర్మించింది. ఈ షియర్ వాల్ టెక్నాలజీ వల్ల ఒక్కొక్క లబ్ధిదారుడుపైనా సుమారు రూ.2 లక్షల వరకు ఆర్ధి్దక భారం çపడుతోంది. ఈ ఇళ్లు అంత గొప్ప నాణ్యత ఏమీ ఉండబోమని, సాధారణ ఇళ్లకంటే ఏమాత్రం భిన్నంగా ఉండవని కాంట్రాక్టర్లు, సివిల్ ఇంజనీర్లు చెబుతున్నారు. షియర్‌వాల్ టెక్నాలజీ అంటే... గోడలను ఏ విధంగా నిర్మిస్తారో స్లాబ్ కూడా అదే మెటీరియల్‌తో నిర్మిస్తారు. దూరం.. భారం! జీ+3 పద్ధతిలో ఈ ఇళ్లు నిర్మిస్తున్నారు. నిళ్ల నిర్మాణానికి కావాల్సిన స్థలం ప్రభుత్వమే సమకూర్చాల్సి రావడంతో ఊరుకుదూరంగా మూడు నాలుగు కి.మీ దూరంలో నిర్మిస్తున్నారు. దీంతో అక్కడ ఉండలేక ఇళ్లు వదులుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలో జక్కంపూడిలో నిర్మించడంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థలం కొనుగోలుకు నిధులు నిల్ విజయవాడలో ఇంకా 20వేల ఇళ్లు నిర్మించాల్సి ఉంది. దీని కోసం సుమారు 100 ఎకరాల స్థలం అవసరం అవుతుందని అధికారులు అంచనా వేశారు. దీనికోసం జక్కపూడిలో సుమారు 106 ఎకరాల భూమిని రైతులు వద్ద నుంచి సేకరించాలని నిర్ణయించారు. ఈ రూ.100 కోట్లు మంజూరు కోసం ప్రభుత్వం ఆరు నెలల క్రితం జీవో కూడా ఇవ్వడంతో అధికారులు ఈ నిధులు విడుదల కాగానే రైతుల వద్ద నుంచి భూములు తీసుకుం టామని హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఒక్క రూపాయీ ఇవ్వలేదు. జగన్ హామీతో హర్షం పట్టణ పేదలకు ఇళ్లు రుణాలుగా తీసుకుంటే వాటిని తాను అధికారంలోకి రాగానే మాఫీ చేస్తానని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో నిరుపేదలైన పేదలకు ఇళ్లమీద ఆశలు పెంచింది. తాను అధికారంలోకి వస్తే 25 లక్షలు ఇళ్లు నిర్మించి పేదలందరికీ ఇస్తామని హామీ ఇచ్చారు. అక్క చెల్లెమ్మలకు గృహప్రవేశం రోజునే రిజిస్ట్రేషన్ పట్టా ఇస్తామని, పావలా వడ్డీకే ఇంటి పై బ్యాంకు రుణం ఇప్పిస్తానని నవరత్నాల్లో ఇచ్చిన హామీల పట్ల పేద ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఆయన ప్రకటనతో దీంతో జిల్లాలో దరఖాస్తులు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఎన్నికల తరువాత జగన్ వస్తే తమకు ఇళ్లు వస్తాయని మహిళలు ఆశతో ఎదురు చూస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలకు కాసులు కురిపించిన పేదల ఇళ్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులతో నిర్మించిన ఇళ్లను టీడీపీ ఎమ్మెల్యేలు య«థే చ్ఛగా విక్రయించుకున్నారు. జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు మూడేసి వేల ఇల్లు చొప్పున కేటాయించారు. దీంతో ఎమ్మెల్యేలు తమ అనుచరులు ద్వారా రూ.50 వేలు తీసుకుని ఇళ్లు కేటాయించారని చెబుతున్నారు. విజయవాడలో ఒక ఎమ్మెల్యే అనుచరులు రూ.40 లక్షలు ఇళ్లు ఇప్పిస్తామంటూ వసూలు చేశారు. క్రీస్తు రాజపురంలో ఒక మహిళ ఆటోస్టాండ్ అధ్యక్షురాలు ద్వారా 20 మందికి ఇళ్లు ఇప్పిస్తామంటూ రూ.10 లక్షలు వరకు వసూలు చేశారు. అలాగే బస్టాండ్‌లో ఉన్న ఒక ఆటోస్టాండ్ అధ్యక్షుడు ద్వారా మరో 25 మంది వద్ద నుంచి రూ.15 లక్షలు వసూలు చేశారు. సింగనగర్‌లో చిట్స్ నిర్వహించే ఒక మహిళ ద్వారా సుమారు 30 మంది నుంచి మరో రూ.15 లక్షలు వసూలు చేశారు. అయితే వీరికి ఇళ్లు మంజూరు కాలేదు. గుడివాడలో అయోమయం పట్టణంలో పేదలకు ఇళ్లు నిర్మించాలని అందుకు కావలసిన స్థలం కొనుగోలు చెయ్యాలని 2007లో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) గుడివాడ నుంచి హైదరా బాద్‌కు పాదయాత్ర చేశారు. ఒక శాసన సభ్యుని పాదయాత్రకు స్పందించిన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అందుకు కావలసిన నిధులు కేటాయించారు. దీంతో బొమ్ములూరు మలుపు వద్ద 74 ఎకరాలు భూమి కొనుగోలు చేశారు. అనంతరం జరిగిన పరిణామాలతో ఆ భూములు నిరుపయోగంగా మారిపోయాయి. 2015లో కేంద్ర ప్రభుత్వం హౌస్ ఫర్ ఆల్ పథకం క్రింద పట్టణానికి ఆ పథకాన్ని వర్తింప చేసింది. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం రూ 1.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ 1 లక్ష సబ్సిడీగా అందచేస్తుంది. లబ్ధిదారుడు డబుల్ బెడ్రూమ్ 430 చదరపు అడుగులకు లక్షరూపాయలు, డబుల్ బెడ్రూమ్ 365 చదరపు అడుగులకు రూ.50 వేలు, సింగిల్ బెడ్ రూమ్‌కు రూ.500 చెల్లించాలని నిబంధన చేశారు. మిగిలిన మొత్తాలను జాతీయ బ్యాంకుల ద్వారా రుణం అందచేసి లబ్ధిదారుడు నెలవారి తీర్చుకునేలా పథకం రూపొందించారు. దీనిని అవకాశంగా తీసుకున్న తెలుగుదేశం నాయకులు కేంద్ర ప్రభు త్వ పధకాన్ని పూర్తిగా చంద్రబాబు నాయుడే పట్టణ ప్రజలను కరుణించినంత ప్రచారం చేసుకున్నారు. ఈ పథకం నిమిత్తం ప్రతి లబ్ధిదారుని వద్ద నుంచి సొమ్ము వసూళ్లు చేసేశారు. పెడనలో అడుగు పడలేదు! పురపాలక సంఘంలోని అర్హులైన సొంత స్థలాలు లేని నిరుపేదలకు జీ ప్లస్ త్రి గృహాలు నిర్మించాలనే ప్రభుత్వం ప్రతిపాదనలు ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అన్న చందాన పరిస్థితి ఏర్పడింది. చివరకు చేతులు ఎత్తిసేంది. జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల్లో జీ ప్లస్ త్రీ పరిస్థితి బాగున్న పెడనలో రిక్తహస్తం చూపింది. 2017లో ఈ పథకానికి అంకురార్పణ జరిగినా ఉన్నతాధికారులు మాత్రం ప్రైవేటు స్థలాలు కొనుగోలు చేసి ఇచ్చేందుకు ససేమిరా అన్నారు. మరోపక్క పురపాలక శాఖామాత్యులు నారాయణ మాత్రం అవసరమైతే ఎకరానికి రూ.60 లక్షలు వెచ్చించి అయినా నిరుపేదల ఇంటి కలలను సాకారం చేస్తామని పేర్కొన్నా ఆ దిశగా అడుగులు ముందుకు పడలేదు. టీడీపీకి చెందిన నాయకులే స్వయంగా పలు ప్రైవేటు స్థలాలను పరిశీలించి రైతులను ఒప్పించి ప్రభుత్వ అధికారుల దృష్టిలో పెట్టినా ఆ స్థలాలను కొనుగోలు చేసేందుకు అధికారులు ఆసక్తి చూపించకపోవడం గమనార్హం. అధికారులు మాత్రం పురపాలక సంఘానికి చెందిన డంపింగ్ స్థలం 6.27 ఎకరాలు స్థలం, తామర చెరువు 13 ఎకరాలను పరిశీలించారు. డంపింగ్ యార్డు స్థలం ఇచ్చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు రావచ్చుననే ఉద్దేశంతో డంపింగ్ యార్డు కోసం కొనుగోలు చేసిన స్థలాన్ని అప్పగించడానికి కౌన్సిల్ అంగీకరించలేదు. నందిగామలో అవిగో.. ఇవిగో... నందిగామ : నగర పంచాయతీ వాసులకు జీ ప్లస్ త్రీ నిర్మాణాలు అందని ద్రాక్షగా మారాయి. మూడేళ్లుగా ఈ ప్రాజెక్టు పనులు పునాదుల దశను దాటలేదంటే పథకం నిర్వహణ పట్ల పాలకులు, అధికారులకు ఎంత చిత్తశుద్ధి ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జీ ప్లస్ త్రి నిర్మాణాల పేరిట నందిగామ నగర పంచాయతీ వాసులను ఊరించడమే తప్ప ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి చిత్తశుద్ధితో ప్రయత్నించిన దాఖలాలు లేవు. వాస్తవానికి ప్రధాన మంత్రి ఆవాస యోజన పథకం కింద నందిగామ నగర పంచాయతీకి 2,496 గృహాలు మంజూరయ్యాయి. స్థలా భావం వల్ల వేర్వేరుగా కాకుండా జీ ప్లస్ త్రి విధానంలో భవనాలు నిర్మించాలని సంకల్పించారు. ఇంతవరకు బాగానే ఉన్నా. స్థల సేకరణ పెద్ద సమస్యగా మారింది. తొలుత డీవీఆర్ కాలనీలో వీటిని నిర్మిస్తామంటూ అధికార పార్టీ హడావుడి చేసింది. కొన్ని నెలలు తాత్సారం చేసిన తరువాత రాఘవాపురం గట్టు వద్ద స్థలం సేకరించేశామంటూ ఆర్భాటంగా ప్రకటించడంతోపాటు సదరు స్థలాన్ని చదును చేసేందుకు హడావుడిగా పనులు మొదలు పెట్టారు. దీనిపై అనేక ఆరోపణలు రావడం, విజిలెన్స్ విచారణలు కూడా కొనసాగడంతో అక్కడ నుంచి కూడా స్థలాన్ని మార్చేశారు. ఈ క్రమంలోనే రెండేళ్లు గడచిపోయాయి. -
పస్తులు తప్పవా..?
లంఖణం(పస్తు ఉండడం) దివ్య ఔషధం అన్నారు పెద్దలు. వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటే ఆరోగ్యమేమో గాని..ఏకంగా నెలంతా ప్రతిరోజూ పస్తులుంటే శుష్కించి అనారోగ్యం బారిన పడతారు. పేదప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతినెలా రేషన్ షాపుల ద్వారా చౌకధరలకు సరుకులను పంపిణీ చేస్తోంది. సరుకుల పంపిణీలో పారదర్శకత కోసం ఈపోస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే గ్రామాల్లో డిపోలకు అందజేసిన ఈ పోస్ మెషీన్లు సరిగా పనియకపోవడం, కొంతమంది వృద్ధుల వేలిముద్రలు స్కాన్ అవకపోవడం వంటి ఇబ్బందులతో లబ్ధిదారులకు వచ్చిన రేషన్ కాస్తా తిరిగి వెళ్లిపోతుండడంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. సరుకులు అందకుండా వెనక్కి వెళ్లిపోతే నెలంతా పస్తులుండాల్సిదేనని వాపోతున్నారు. * జిల్లాలో 76వేల మందికి పైగా అందని రేషన్ * ఇబ్బందుల్లో లబ్ధిదారులు భోగాపురం: జిల్లాలోని 34మండలాల్లో ఈ పోస్ ద్వారాపనిచేస్తున్న 1341 రేషన్ షాపుల్లో 6,62,681 లబ్ధిదారులు ఉండగా ఫిబ్రవరిలో కేవలం 5,86,080మందికి మాత్రమే రేషన్ సరుకులు అందాయి. ఈ పోస్ సిగ్నల్స్ అందని షాపులు జిల్లాలో 30నుంచి 40వరకు ఉండవచ్చు. వారికి మాన్యువల్‌గానే సరుకులు అందిస్తున్నారు. జిల్లా మొత్తం మీద ఈనెల సరుకులు 88.44శాతం పంపిణీ జరిగాయి. జిల్లాలో అత్యధికంగా కొత్తవలసలో 93.49శాతం సరుకులు అందించగా, అతితక్కువగా మెంటాడ మండలంలో 84.79శాతం సరుకులను మాత్రమే అందించారు. దీంతో ఈనెల చౌకధరల దుకాణాల ద్వారా 76,541మంది సరుకులను పొందలేకపోయారు. జిల్లాలో ఇన్చార్జ్ డీలర్లు ఎక్కువగా ఉండడం, ఈపోస్ మెషీన్లు పనిచేయకపోవడం. మెషీన్లు పనిచేసినా ఇంట్లో ఒక్కరే ఉన్న కార్డుల్లో వేలిముద్రలు స్కాన్ కాకపోవడంతో సరుకుల పంపిణీ కాలేదు. అయితే రేషను సరుకులపైనే ఆధారపడే పేదవారు ఈపోస్ విధానం ద్వారా సరుకులు పొందలేక ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రతినెలా 15నుంచి 20వ తారీఖుల్లో ఈ పోస్ ఆన్లైన్ ఆగిపోవడంతో సరుకులు వెనక్కి వెళ్లిపోతున్నాయి. రేషన్ ఇస్తున్నారంటే చాలు లబ్ధిదారులు పగలనక, రాత్రనక డిపోల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుంది. పడిగాపులు కాసినా తీరా వారివంతు వచ్చేసరికి వేలిముద్రలు పడకపోవడమో, సర్వర్ ఆగిపోవడమో జరుగుతుండడంతో వారంతా ఉసూరుమంటూ వెనుదిరగాల్సి వస్తోంది. జిల్లాలోని ఒక్క నెల్లిమర్ల నియోజకవర్గంలోనే ఫిబ్రవరి నెలలో సుమారు 10వేల మంది లబ్ధిదారుల రేషన్ వెనక్కి వెళ్లి పోయింది. దీంతో లబ్ధిదారులు ఈనెల ఏంతిని బతకాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులు తిరిగినా రేషన్ రాలేదు మాది భోగాపురం మండలం రావాడ పంచాయతీ చినరావాడ గ్రామం. మేము రేషన్ అందుకోవాలంటే సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రావాడ గ్రామానికి వెళ్లాలి. నా వయసు 80ఏళ్లు. నేను ఒక్కదాన్నే ఉంటాను. వారంరోజులు తిరిగాను వేలి ముద్రలు పడలేదని వెనక్కి పంపించేశారు. కోటా బియ్యమే ఆధారం. నెలకు నాకు ఇచ్చే ఐదు కేజీల బియ్యం కూడా అందలేదు. - బమ్మిడి అచ్చెమ్మ, చినరావాడ రేషను సరుకులకు ఇబ్బంది పడుతున్నాం రేషన్ సరుకులకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. మెషీన్లు పనిచేయడం లేదని సరుకులు రాత్రిపూట ఇవ్వడంతో మా గ్రామం నుంచి చీకట్లో ఇబ్బందులు పడి మరీ వెళ్తాం. అయినా నాకు రేషను అందలేదు. రావాల్సిన ఐదుకేజీల బియ్యం అందకపోతే ఏం తిని బతకాలి. మా పరిస్థితి ఏంటి? - ఇప్పిలి తాత, చినరావాడ